Wednesday, 9 July 2025

ట్రెండ్ అలా ఉంది!


మొన్న నేను చేసిన ఒక రోడ్-క్రైం-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి" మేకింగ్ సమయంలో కొత్తగా చాలా తెలుసుకున్నాను.

ముఖ్యంగా రెండు విషయాలు: 

1. అంతకు ముందు ఒక్క సినిమా కూడా చేసిన అనుభవం లేకపోయినా, ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన అ-ఆలు కూడా ఏం తెలీకపోయినా, ఎలాంటి సంకోచం లేకుండా, ప్రతి ఒక్కరూ సినిమా ఎలా చేయాలన్న దాని మీద మనకు పాఠాలు చెప్తారు. ఈ ఒక్క విషయంలోనే అందరూ ఉరికురికి ముందుకొస్తుంటారు.   

2. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయటం అంటే - టీమ్‌లో ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు రావటం, పోవటం, రాకపోవటం, చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవటం, అసలా డిపార్ట్‌మెంట్‌కే వాల్యూ ఇవ్వకపోవటం. 

ఇది ఎవ్వరిమీద నా కంప్లెయింట్ కాదు.

ఇప్పుడు "ట్రెండ్ అలా ఉంది." 

ఈమాట కూడా మా అసిస్టెంట్ ఒకరు నాకు చెప్పటం విశేషం.  

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 83/100. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani