'అసలేం గుర్తుకురాదు' అనే పాటలో సౌందర్య అందాన్ని ఆయన పెట్టిన ఫ్రేమ్స్ బీట్ చేస్తుంటాయి. టాబూ ఫీలింగ్స్‌ని వీరికన్నా అందంగా క్యాప్చర్ చేసిన సినిమా నేను చూడలేదు. ఒక ఇరవై మంది ఉన్న కుటుంబాన్ని వీరు చూపించినదానికంటే ఆత్మీయంగా ఇంకెవ్వరైనా చూపిస్తారా అన్నది నాకిప్పటికీ డౌటే. తలకాయ కూర ప్లేట్లో వేసుకొని అతి మామూలుగా కింద నేలమీద కూర్చొని తిన్న ప్రకాశ్‌రాజ్‌ను అంతకంటే అత్యంత సహజమైన నటనలో నేనింకా చూళ్ళేదు. సౌందర్య కావచ్చు, సోనాలి బింద్రే కావచ్చు... వీరి ఫ్రేముల్లో దిద్దుకున్న అందాన్ని మరోచోట మనం చూడలేం.
బైక్ మీద, కాటమరాంగ్ బోట్ మీద పూర్తిపాటల్ని అంత బాగా, అంత కిక్కీగా తీయగలం అన్న ఆలోచన వీరికే వస్తుంది. శశిరేఖా పరిణయాలూ, చందమామలూ, గులాబీలూ వీరు తీసినంత అందంగా మరొకరు తీయలేరేమో. సిందూరాలూ, ఖడ్గాలూ వీరివల్లనే తెరమీద చూస్తాం. రాఖీలు, చక్రాలు వీరు తీస్తేనే చూడగలం. ఎన్టీఆర్ చెప్పే ఒకే ఒక్క డైలాగ్‌తో మనకు తెలీకుండానే మన కళ్ళు వర్షిస్తుంటాయి. ప్రభాస్ అసలు డైలాగ్ చెప్పకుండానే అతని ముఖాన్ని పట్టుకున్న ఆ ఫ్రేమ్ మనల్ని చాలెంజ్ చేస్తుంది... మీ కంట్లో తడి రాకుండా ఆపుకోగలరా అని.
ఒక ఫ్రేమ్ కోసం, ఒక ఫీలింగ్ కోసం, ఒక డైలాగ్ కోసం, డైలాగ్ లేని ఒక క్లోజప్ కోసం, మొత్తంగా మీ మార్క్ క్రియేటివిటీ కోసం... మీ సినిమాల్ని మేం చూస్తూనే ఉంటాం.
ఒక చిన్న హంబుల్ రిక్వెస్టు...
రీమేకుల జోలికి వెళ్లకండి. వయసుతోపాటు సహజంగా వచ్చే టూ మచ్ మెచ్యూరిటీని మీ దగ్గరికి రానీకండి. ముఖ్యంగా మీ శైలి మర్చిపోకండి.
Because -
age is just a number…
and cinema, just pure magic.
Happy Birthday, Krishna Vamsi garu.
Have an epic year ahead.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani