“Cinema doesn’t wait for the perfect moment — it belongs to those who show up, bleed behind the scenes, and dare to tell the story anyway.”
— Manohar Chimmani
ఎప్పటికప్పుడు నా నిర్ణయాలు మారుతుంటాయి...
ఒకే ఒక్క విషయంలో.
ఒకే ఒక్క విషయంలో.
అది - సినిమా.
అందుకే ఇంక నిర్ణయాలు తీసుకోవడం మానేశాను. నాకు కావల్సిన ఫ్రీడమ్ వచ్చే వరకు ఎలాగూ తప్పదు కాబట్టి, నాకు కొత్తగా ఇబ్బందులు క్రియేట్ కానంతవరకు కంటిన్యూ చేస్తాను.
ఒక క్రియేటివ్ ప్రొఫెషన్‌గా, ఎట్ లీస్ట్, ఆ ప్రాసెస్ అయినా ఒక రెండేళ్ళు ఎంజాయ్ చెయ్యాలనుకొంటున్నాను.
ఒక క్రియేటివ్ ప్రొఫెషన్‌గా, ఎట్ లీస్ట్, ఆ ప్రాసెస్ అయినా ఒక రెండేళ్ళు ఎంజాయ్ చెయ్యాలనుకొంటున్నాను.
కట్ చేస్తే -
అన్నీ అనుకున్నట్టు జరిగితే, త్వరలో ఒక కొత్త భారీ స్టార్టప్ పెట్టబోతున్నాం. ఒకసారి దూకాం అంటే, ఇంక అవతలి ఒడ్డుకి చేరేదాకా కలిసి ప్రయాణం చేయగల సత్తా ఉన్నవారికే ఇందులో అవకాశం ఉంటుంది.
పిరికివాళ్ళకు, గోడమీద పిల్లులకు, మాటమీద నిలబడలేని మోరన్‌లకు, ముందుకుతోసి వెనుకవెనుకనే మాయమయ్యేవాళ్లకు, వాళ్లేం చేస్తున్నారో వాళ్ళకే తెలీని గొప్ప అమాయకులకు, 'స్టాప్ బ్లాక్' లో చెప్పాచెయ్యక తప్పుకునేవాళ్లకు... ఇది రైట్ ప్లాట్‌ఫామ్ కాదు. రైట్ స్కూల్ కాదు.
ఒక రెండేళ్ళు ఝలక్ చూపించాలి. అదొక్కటే గోల్.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 92/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani