Monday, 27 January 2025

శ్రీ వెంకటేశ్వర అప్పర్ ప్రైమరీ స్కూల్


నిన్న డైమండ్ జుబ్లీ. 

సుమారు యాభై ఏళ్ళ తర్వాత నా చిన్నప్పటి క్లాస్‌మేట్స్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఇంకో నాలుగురోజుల్లో పూర్తవబోతున్న ఫిల్మ్ షూటింగ్ వల్ల వెళ్ళలేకపోయాను. 

ఒకవైపు పర్సనల్‌గా ఇంత పెద్ద త్యాగం చేసి షూటింగ్ అయినా చేశానా అంటే... లేదు. 

నిన్న షూటింగ్ చేస్తున్నప్పుడు, పర్మిషన్ లేదని పోలీసులొచ్చి సినిమా షూటింగ్ ఆపేశారు. ఆ ఇష్యూ బహుశా ఇవ్వాళ ముగుస్తుందనుకుంటాను. 

కట్ చేస్తే -

వరంగల్ 17 వ వార్డు... ఉర్సు, ప్రతాప్‌నగర్‌లోని... శ్రీ వెంకటేశ్వర అప్పర్ ప్రైమరీ స్కూల్లో నేను 7 వ తరగతి దాకా చదువుకున్నాను. 

7 లో నేనే స్కూల్ ఫస్ట్. 

మా హెడ్‌మాస్టర్ చంద్రమౌళి సార్, సోమనర్సయ్య సార్, ప్రకాశం సార్, సత్యనారాయణ, లింగమూర్తి, శ్రీనివాసులు, భిక్షపతి, వెంకటేశ్వర్లు, రాజమౌళి సార్లు... 

గంట కొట్టే కొమ్మాలుతో సహా వీళ్లంతా నాకు పేరు పేరునా బాగా గుర్తున్నారు. 

మా క్లాసులో దాదాపు 46 మంది విద్యార్థుల్లో చాలామందిని నేను మర్చిపోయాను. కొంతమంది ఫోటోలు చూసినా గుర్తుపట్టలేకపోయాను. 

నిన్నటి కార్యక్రమానికి వెళ్ళుంటే నా క్లాస్‌మేట్స్ అందరూ కలిసేవారు. మంచి జ్ఞాపకంగా మిగిలేది. కాని, జరిగింది మరొకలాగా.  

Man Plans... God Laughs.  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani