Monday, 27 January 2025

శ్రీ వెంకటేశ్వర అప్పర్ ప్రైమరీ స్కూల్


నిన్న డైమండ్ జుబ్లీ. 

సుమారు యాభై ఏళ్ళ తర్వాత నా చిన్నప్పటి క్లాస్‌మేట్స్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఇంకో నాలుగురోజుల్లో పూర్తవబోతున్న ఫిల్మ్ షూటింగ్ వల్ల వెళ్ళలేకపోయాను. 

ఒకవైపు పర్సనల్‌గా ఇంత పెద్ద త్యాగం చేసి షూటింగ్ అయినా చేశానా అంటే... లేదు. 

నిన్న షూటింగ్ చేస్తున్నప్పుడు, పర్మిషన్ లేదని పోలీసులొచ్చి సినిమా షూటింగ్ ఆపేశారు. ఆ ఇష్యూ బహుశా ఇవ్వాళ ముగుస్తుందనుకుంటాను. 

కట్ చేస్తే -

వరంగల్ 17 వ వార్డు... ఉర్సు, ప్రతాప్‌నగర్‌లోని... శ్రీ వెంకటేశ్వర అప్పర్ ప్రైమరీ స్కూల్లో నేను 7 వ తరగతి దాకా చదువుకున్నాను. 

7 లో నేనే స్కూల్ ఫస్ట్. 

మా హెడ్‌మాస్టర్ చంద్రమౌళి సార్, సోమనర్సయ్య సార్, ప్రకాశం సార్, సత్యనారాయణ, లింగమూర్తి, శ్రీనివాసులు, భిక్షపతి, వెంకటేశ్వర్లు, రాజమౌళి సార్లు... 

గంట కొట్టే కొమ్మాలుతో సహా వీళ్లంతా నాకు పేరు పేరునా బాగా గుర్తున్నారు. 

మా క్లాసులో దాదాపు 46 మంది విద్యార్థుల్లో చాలామందిని నేను మర్చిపోయాను. కొంతమంది ఫోటోలు చూసినా గుర్తుపట్టలేకపోయాను. 

నిన్నటి కార్యక్రమానికి వెళ్ళుంటే నా క్లాస్‌మేట్స్ అందరూ కలిసేవారు. మంచి జ్ఞాపకంగా మిగిలేది. కాని, జరిగింది మరొకలాగా.  

Man Plans... God Laughs.  

Wednesday, 22 January 2025

ఎలా సాధ్యం?


ఇప్పుడొక సినిమా చేస్తున్నాం. 

నా మిత్రుడు, సీనియర్ కెమెరామన్ వీరేంద్ర లలిత్ ఈ సినిమాకు పనిచేయడానికి ముంబై నుంచి దాదాపు నెల క్రింద హైద్రాబాద్ వచ్చాడు. ఆయనకు ఇల్లుంది, కుటుంబం ఉంది, పండగలున్నాయి. అవన్నీ వదులుకొని ఎందుకంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నాడు లలిత్?   

నాకూ ఇల్లుంది, కుటుంబం ఉంది, పండగలున్నాయి. రోజుకి 4-5 గంటలకంటే ఎక్కువ పడుకోడానిక్కూడా వీల్లేకుండా ఎందుకిలా పని చేస్తున్నాను?   

పైగా, ఇదేం రెమ్యూనరేషన్స్ తీసుకొనే సినిమా కాదు. ఒక చిన్న బడ్జెట్ సినిమా. ఇండిపెండెంట్ సినిమా. దీనికి ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ ఉండరు. 

మరెందుకు చేస్తున్నాం? మా ప్యాషన్ కోసం చేస్తున్నాం. ఈ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ఇచ్చే ఆనందం కోసం చేస్తున్నాం. మాకు పనికొస్తుందని, పరోక్షంగా ఇంకొకటిరెండు ఒక మాదిరి పెద్ద సినిమాలు చేయడానికి ఉపయోగపడుతుందని చేస్తున్నాం. అల్టిమేట్‌గా డబ్బు కోసం చేస్తున్నాం. 

ఇదే నేపథ్యం మా టీంలోవాళ్ళకు కూడా పరోక్షంగా ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతుందన్నది వాస్తవం.  

కట్ చేస్తే - 

ఒక పని చెయ్యడానికి ఏవేవో సాకులు చెప్పటం వేరు. ప్యాషన్‌తో ఆ పని పూర్తిచెయ్యడం వేరు.  

ఇవాళ మా ఏడీ (అసిస్టెంట్ డైరెక్టర్) ఒకరు ఒక మాటన్నారు. "అంతకు ముందులా లేదు సర్. ఇప్పుడెవ్వరు పనిచెయ్యటం లేదు" అని! 

అదెలా సాధ్యం? 

డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్స్ సిన్సియర్‌గా, ఒక కమిట్‌మెంట్‌తో పనిచెయ్యందే ఇన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు ఎలా వస్తున్నాయి? 

Monday, 13 January 2025

కమ్యూనికేషన్ & కో-ఆర్డినేషన్ అంటే ఇలా ఉంటుందా?


అన్ని ప్రొఫెషన్స్ వేరు, సినిమా ప్రొఫెషన్ వేరు. 

ఇది 9-5 జాబ్ కాదు. ఎప్పుడు చేతిలో పని ఉంటుందో, ఎప్పుడు ఉండదో చెప్పలేం. ఉన్నప్పుడు మాత్రం దాని మీదే పూర్తి ఫోకస్ పెట్టి ఒక తపస్సులా పనిచేయాలి. 

ఎంత చేస్తున్నా మన మీద రాళ్ళు పడుతుంటాయి... అది వేరే విషయం. 

మనం తప్పు చేయనంతవరకు అలాంటి రాళ్లను పట్టించుకోనవసరం లేదు. ఆ రాళ్లతోనే ఒక దుర్గం కట్టుకోవాలి. 

ఇప్పుడు నేను చేస్తున్న ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. ఒక రెనెగేడ్ పద్ధతిలో చేసుకుంటూపోతున్నాం. 

13, 14 సెలవులు. 15 నుంచి మళ్ళీ షూటింగ్ ఉంది. 

15 నుంచి షూటింగ్ చెయ్యాలంటే, దానికి సంబంధించిన 101 పనుల్ని 13, 14 తేదీల్లో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం పండగల్ని త్యాగం చెయ్యాల్సిన పనిలేదు. కాని, పని అంటూ ఉంటుంది. చేసుకోవాలి. గంటో, రెండు గంటలో... మెంబర్స్ అంతా కో-ఆర్డినేట్ చేసుకోవాలి.   

పండగలు చేసుకోవద్దని ఎవరూ అనరు. కాని, పండగల్ని పండగలా చేసుకొనే దశకు చేరుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు చెయ్యాలి. ఇంకా కష్టపడాలి.  

అది ఎవరి కోసమో కాదు. మన కోసం. 

కట్ చేస్తే - 

మొన్న జనవరి 4 నాడు "మాకు కమ్యూనికేషన్ లేదు, కో-ఆర్డినేషన్ లేదు" అని మొత్తుకొని, ఇంక నానా మాటలతో మొత్తం టీమ్ స్పిరిట్‌ను చంపుకున్న పదిరోజుల్లోనే... ఇంకో అత్యంత బాధ్యతారాహిత్యమైన సంఘటన జరగటం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. 

మా టీంలోని 5 గురు ముఖ్యమైన మెంబర్స్, కనీసం "నేను ఊరెళ్తున్నాను" అని కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, కనీసం మెసేజ్ కూడా లేకుండా వెళ్ళడం ఏదైతే ఉందో... వారిలోని కేర్‌లెస్‌నెస్‌కు పరాకాష్ట.  

ఇంతకంటే అవమానకరం ఇంకోటి ఉండదు.   

అయితే ఈ అవమానం నాకు కాదు. 

వారికే. 

అసలు ఇలా జరగడానికి కారణం ఎవరు? పరోక్షంగా ఏ సంఘటన టీంలో మరీ ఇంత మినిమం స్టాండర్డ్స్‌ను కూడా పాటించలేని చిల్లర స్థాయి ప్రవర్తనకు దారి తీసింది?

దేన్నయినా బిల్డ్ చెయ్యడానికి చాలా సమయం పడుతుంది. కూలగొట్టడానికి ఒక్క నిమిషం చాలు.    

జస్ట్ ఇంకో వారం. అంతే.   

మ్యాటర్ ఓవర్.  

- మనోహర్ చిమ్మని  

Wednesday, 8 January 2025

"స్వయంకృషి" రాందాస్


"రాందాస్ అన్న చెప్పిండంటే ఇంక అంతే. మీరు నన్ను గారు-గీరు-సర్ అని కూడా అనొద్దు అన్నా. ఏం షూటింగ్ చేసుకుంటరో చేసుకోండి. మీ ఇష్టం. మీకు కావల్సినవన్ని మావోళ్ళు అరేంజ్ చేస్తరు!" 

మా రాందాస్‌తో కాల్ చేయించుకొని షూటింగ్ లొకేషన్ కోసం వెళ్ళిన సందర్భంగా, షామీర్ పేట లోని ఒక పెద్ద కాలేజ్ చైర్మన్ నాతో అన్న మాట అది. 

కట్ చేస్తే -

ఓయూలో నా ఎమ్మే సహాధ్యాయి, నా ఆత్మీయ మిత్రుడు రాందాస్‌ను మావాళ్ళంతా ఒక జోకర్‌లా ట్రీట్ చేసేవాళ్ళు. సందు దొరికితే చాలు, మాలో కొంతమంది ఇప్పటికీ రాందాస్‌ మీద చిల్లర జోకులేస్తూ, అప్పటి స్థాయిలోనే ట్రీట్ చేయడానికి ఇష్టపడతారు. వాడు కూడా పెద్దగా పట్టించుకోడు. కాని -  

రెండు కాలేజీల యజమాని రాందాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు, వీళ్లంతా ఎక్కడున్నారన్నది నా హంబుల్ కొశ్చన్. 

- Manohar Chimmani