అమితాబ్ బచ్చన్, మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్ ఇద్దరూ దాదాపు సమ వయస్కులు. అమితాబ్ బచ్చన్ కంటే 28 రోజులు పెద్దవారు మా ప్రొఫెసర్.
ఇద్దరూ 81 వ బర్త్‌డే ఈ మధ్యే చేసుకున్నారు.
ఇద్దరూ ఈరోజుకీ యమ యాక్టివ్.
బచ్చన్ గారి యాక్టివ్‌నెస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నొకరోజు ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ని చూశాను. అమిత్‌జీ నడుస్తున్న స్పీడ్‌లో ఆయన బాడీగార్డ్స్ నడవలేక ఉరుకుతున్నారు... లిటరల్లీ!
బచ్చన్ గారి యాక్టివ్‌నెస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నొకరోజు ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ని చూశాను. అమిత్‌జీ నడుస్తున్న స్పీడ్‌లో ఆయన బాడీగార్డ్స్ నడవలేక ఉరుకుతున్నారు... లిటరల్లీ!
కట్ చేస్తే -
గత 37 ఏళ్ళుగా మా ప్రొఫెసర్‌కు, ఆయన లైఫ్ స్టైల్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని.
ఒకటి రెండు ముఖ్యమైన విషయాల్లో తప్ప - చాలా విషయాల్లో - అనుకోకుండా నా లైఫ్ కూడా ఆయన లైఫ్ తరహాలోనే గడిచింది.
బహుశా నాకు తెలీకుండానే నేను ఆయన లైఫ్‌స్టైల్‌ను ఫాలో అవుతున్నా కావచ్చు.
చాలా రోజుల తర్వాత, అనుకోకుండా నిన్న మధ్యాహ్నం - ఢిల్లీ నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్‌తో నేను చాలా బిజీగా ఉన్న సమయంలో - మా ప్రొఫెసర్ నాకు కాల్ చేశారు.
ఓ పది నిమిషాలు మాట్లాడుకున్నాం.
ఈవారంలో మేం కలుస్తున్నాం.
ఇకనుంచి సర్‌ని నేను రెగ్యులర్‌గా కలవాలనుకుంటున్నా.
ఇకనుంచి సర్‌ని నేను రెగ్యులర్‌గా కలవాలనుకుంటున్నా.
నా లాస్ట్ (హారర్) సినిమా "స్విమ్మింగ్‌పూల్"లో మా సార్‌కు ఒక మంచి పవర్‌ఫుల్ రోల్ ఇచ్చి - ఆయన్ను సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయం చేసిన ఆనందం నాకుంది. ఇప్పుడు చేయబోయే సినిమాల్లో కూడా - ఆయన్ను ఒప్పించి మంచి స్పెషల్ అపియరెన్స్ రోల్స్ ఇవ్వాలనుకుంటున్నాను.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నేను రాసిన పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" కాపీ కూడా మా సర్‌కు నేనింకా ఇవ్వాల్సి ఉంది. ఆయనకు తెలుగు రాయడం, చదవడం రాదు. కాని, అడగ్గానే నా బుక్ కోసం కేసీఆర్ మీద తన అభిప్రాయాన్ని ఇంగ్లిష్‌లో రాసి పంపించారు.

మా ప్రొఫెసర్ మురుంకర్ విషయంలో "Age is just number.".
ఆమధ్య - వంట బాగా వచ్చిన మహిళలతో పోటీపడి, స్నేహ చికెన్ వంట కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ కొట్టారు మా ప్రొఫెసర్. అంతే కాదు, ఆయన భారీ ఫ్లెక్సీని (40 x 30) సిటీ సెంటర్లో డిస్‌ప్లే చేశారు.
మా సర్ ఇప్పటికీ అంతే యాక్టివ్‌గా ఉన్నారు...
తరచూ పార్టీలు, ఫంక్షన్స్ అటెండవుతుంటారు. చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకొన్న తన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసుకోడానికి ఎలాంటి హిపోక్రసీ ఫీల్ కారు. రెండేళ్ల క్రితం తన బయోగ్రఫికల్ పుస్తకాన్ని మహేశ్ భగవత్ IPSతో మర్రి చెన్నారెడ్డి హెచ్చార్‌డి సెంటర్ ఆడిటోరియంలో రిలీజ్ చేశారు... నిన్నటి కాల్‌లో కూడా ఎప్పట్లాగే నాకు నాలుగు మంచి ఇన్‌స్పయిరింగ్ మాటలు చెప్పారు...

నా టీమ్‌లో అందరూ నాకంటే చాలా తక్కువ వయస్సు వాళ్ళు.
వీళ్లలో ఏ ఒక్కరిలోనూ మా 81 ఏళ్ళ ప్రొఫెసర్‌లో ఉన్న యాక్టివ్‌నెస్‌లో కనీసం 10 శాతం కూడా లేకపోవడం విచారకరం. 😇
వీళ్లలో ఏ ఒక్కరిలోనూ మా 81 ఏళ్ళ ప్రొఫెసర్‌లో ఉన్న యాక్టివ్‌నెస్‌లో కనీసం 10 శాతం కూడా లేకపోవడం విచారకరం. 😇
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani