నేనిప్పటివరకు డైరెక్టర్‌గా చేసిన 3 సినిమాల్లో సుమారు ఒక 55 మంది కంటే ఎక్కువ కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాను.
వీళ్ళల్లో - హీరోలు, హీరోయిన్స్, విలన్స్, ఇతర సపోర్టింగ్ ఆర్టిస్టులు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్, డాన్స్ మాస్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, మేనేజర్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులు... ఇలా దాదాపు ముఖ్యమైన అన్ని క్రాఫ్టుల నుంచి ఉన్నారు.
ఈ సినిమాలన్నీ కూడా చేయాలనిపించినాప్పుడు, అన్నీ కుదిరినప్పుడు, అప్పుడప్పుడూ ఏదో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినట్టుగా చేశాను తప్ప - నిజంగా నేనెప్పుడూ సినిమాల్లోకి పూర్తిగా దిగిపోలేదు. అలాంటి అవకాశం మొన్నమొన్నటివరకూ నాకు లేదు.

డైరెక్టర్‌గా నాపేరుతో రిలీజైన నాలుగో సినిమాకు నిజానికి నేను పని చేయలేదు. శాటిలైట్ రైట్స్ బిజినెస్ కోసం నా పేరు వాడుకున్నారు. అది వేరే విషయం.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
నేను పరిచయం చేసినవాళ్లల్లో చాలా మంది ఇప్పుడు వివిధ భాషల్లో నటిస్తూ, వివిధ స్థాయిల్లో బిజీగా ఉన్నారు.
వెండితెరకు పరిచయమై లైమ్‌లైట్‌లోకి వచ్చాక, కొందరికి ఇతర వేర్వేరు ఫీల్డుల్లో మంచి అవకాశాలొచ్చి వెళ్ళిపోయారు. స్థిరపడ్డారు. మంచి స్థాయిలో ఉన్నారు.
వీరందరిలో కొందరి గురించి నా తర్వాతి బ్లాగ్ పోస్టుల్లో క్లుప్తంగా చెప్తాను.
కట్ చేస్తే -
కోవిడ్ తర్వాత - ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా వచ్చిన అనేక ఆదాయ మార్గాలు, ఓటీటీ వంటి ప్లాట్‌ఫామ్స్, పెరిగిన క్రేజ్... ఇవన్నీ మళ్ళీ బాగా టెంప్ట్ చేస్తున్నాయి.
మరోవైపు, నాక్కూడా మనీ వాల్యూ బాగా తెలిసివచ్చింది. సినిమాలు చేసుకుంటూ నాకిష్టమైన ఓ డజన్ కంట్రీలు సోలోగా తిరగాలనుకుంటున్నాను.
మరోవైపు, నాక్కూడా మనీ వాల్యూ బాగా తెలిసివచ్చింది. సినిమాలు చేసుకుంటూ నాకిష్టమైన ఓ డజన్ కంట్రీలు సోలోగా తిరగాలనుకుంటున్నాను.
కొంచెం ఆలోచించి, ఎవరితో సంబంధం లేకుండా, ఎలాంటి తలనొప్పులు కొత్తగా కొని తెచ్చుకోకుండా, కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకొని చెయ్యాలి. అంతా బాగుంటుంది.
చిన్న బడ్జెట్స్ చాలు. కొత్తవాళ్ళు, అప్‌కమింగ్ వాళ్ళు చాలు.
మూవీస్. మనీ. మస్తి.
కట్ చేస్తే -
ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న 2 సినిమాల్లో ఒక సినిమా Yo! ప్రిప్రొడక్షన్ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి.
ఇంకో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్‌లో ఉంది.
బైదివే - ఈ 2 సినిమాల్లో ఆల్రెడీ ఫేమ్‌లో ఉన్నవాళ్ళు కొందరుంటారు.
వారితో పాటు - కొత్త హీరోహీరోయిన్లు, కొత్త సపోర్టింగ్ ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్స్‌ను కూడా పరిచయం చేస్తున్నాను.
డైరెక్షన్ & రైటింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ రైటర్స్‌ని కూడా కొత్తగా చాలా మందిని పరిచయం చేస్తున్నాను.

ఇప్పుడు కొత్తగా పరిచయం చేస్తున్న టెక్నీషియన్స్‌లో ఒకరిద్దరు చీఫ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు.
వారు ఎవరన్నది తర్వాతి పోస్టుల్లో...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani