ఉండదు అని అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు గుర్తుచేస్తుంటాయి
కట్ చేస్తే -
జనగాం దగ్గర తరిగొప్పుల నివాసి అయిన ఒక రచయిత, కవి, నిత్య సంచారి (తమ్ముడు బీఆరెస్ వేణుతో కలిసి) ఒకసారి కొంపల్లి వచ్చి నన్ను కలిశాడు.
కాఫీ తాగాం, చాలా సేపు మాట్లాడుకున్నాం.
"సార్, మీ ఆఫీసుకు వచ్చి కూడా మిమ్మల్ని కలుస్తాను. మీరు రాసిన కేసీఆర్ బుక్ మీ చేత్తో తీసుకొని మీతో ఫోటో దిగాలి, ఫేస్‌బుక్‌లో పోస్టు చెయ్యాలి" అని తక కోరిక చెప్పాడు.
అలాగే రమ్మన్నాను.
తర్వాత అతను సిటీకి వచ్చి ఫోన్ చేసిన రెండు మూడు సార్లు నేను ఆఫీసులో లేను.
కొన్ని గంటల క్రితం ఫేస్‌బుక్‌లో అతని ఫోటో చూశాను... అతను చనిపోయాడు!
వీలైతే చేతనైనంత మంచి చేద్దాం. జీవితాన్ని వీలైనంత కూల్‌గా ఎంజాయ్ చేద్దాం.
అతని పేరు జంగం వీరయ్య.
వీరయ్య కొన్ని పుస్తకాలు రాశాడు, పబ్లిష్ చేశాడు. కొందరు సీనియర్ సాహితీవేత్తల్ని జనగాం ఆహ్వానించి ప్రోగ్రామ్స్ చేశాడు.
ఇప్పుడు లేడు!
వయస్సు ఒక నలభై ప్లస్ ఉంటుందేమో. అంతే...
కట్ చేస్తే -
మొన్న రాత్రి రైలు ప్రమాదం.
ట్రక్కుల్లో విసిరేస్తున్న వందలాది శవాలు.
అప్పటిదాకా వాళ్ళంతా జీవితం మీద ఎన్నెన్ని ఆశలతోనో బతుకుతున్న మనలాంటి మనుషులే కదా...
ఒక్క ప్రమాదం అసలు జీవితమే లేకుండా చేసేసింది!
ఇలాంటి సందర్భాల్లోనే మన ఆలోచనల్లో స్మశాన వైరాగ్యం ఎంటరవుతుందనుకుంటాను.
ప్రాక్టికాలిటీలో ఆలోచించినా అంతే...
మనం ఎన్నాళ్ళుంటామో తెలీదు. ఉన్నన్నాళ్ళు ఇన్నిన్ని టెన్షన్స్ పెంచుకుంటూ పోవటం అవసరమా?
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani