పదవుల మీద ఆసక్తితో కాదు. గెలుస్తానా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు.
ఈ విషయంలో నా ఆలోచనలు పూర్తిగా వేరు.
ఈ విషయంలో నా ఆలోచనలు పూర్తిగా వేరు.
ఈ 10 రోజుల ఎన్నికల హడావిడిలో ఆయినా... మనవాళ్ళు అందరితో కలిసి తిరిగే అవకాశం, మాట్లాడే అవకాశం నాకు, ఫోన్లు చేసే అవకాశం... ఫాస్ట్ ట్రాక్‌లో దొరుకుతుందన్నది నా ఆలోచన.
ఇప్పుడు పూర్తిస్థాయిలో రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి, ఇలాంటి ఒక చిన్న యాక్టివిటీ వ్యక్తిగతంగా నాకో చిన్న కిక్ ఇస్తుందని. అంతే.
ఇప్పుడు పూర్తిస్థాయిలో రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి, ఇలాంటి ఒక చిన్న యాక్టివిటీ వ్యక్తిగతంగా నాకో చిన్న కిక్ ఇస్తుందని. అంతే.
కాని, ఒకటి రెండు ప్రాథమిక మీటింగ్స్ తర్వాత నాకు అంత ఉత్సాహకరంగా అనిపించలేదు వాతావరణం. నాకున్న వ్యక్తిగత తలనొప్పులకు తోడు అదనంగా ఇప్పుడిది తగిలించుకోవడం అవసరమా అనిపించింది.
సో, ఆ ఆలోచనకు నిన్న మధ్యాహ్నమే గుడ్ బై చెప్పాను.
కట్ చేస్తే -
అసోసియేషన్ కోసం నిస్వార్థంగా, ఉత్సాహంగా పనిచేయాలన్న ఆసక్తి, అవకాశం అందరికీ ఉండదు. అందరివల్ల కాదు.
డైరెక్టర్‌గా కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నవాళ్ళెవ్వరికీ ఈ అసోసియేషన్ యాక్టివిటీ వైపు, ఎన్నికలవైపు చూసే అవకాశం ఉండదు. చూడాలన్న ఆసక్తి ఉన్నా కుదరదు.
ఎన్నికలు, పదవులతో సంబంధం లేకుండా - అసోసియేషన్ కోసం నిజంగా పనిచేయాలనుకున్న డైరెక్టర్స్‌కు, ఎప్పుడయినా ఏ రూపంలో అయినా దానికి తోడ్పాటు అందించే అవకాశం ఉంటుంది.
నా విషయంలో, ఉడతాభక్తిగా అసోసియేషన్‌కు నావంతు తోడ్పాటు నేనూ ఏదైనా చేయాలనుకొన్నా... రెగ్యులర్‌గా సినిమాలు చేయటం ద్వారా మాత్రమే నాకది సాధ్యమవుతుంది. ప్రస్తుతం నా దృష్టంతా దీనిమీదే ఉంది.
ఇవాళ టి ఎఫ్ డి ఏ ఎన్నికలకు నామినేషన్స్ వేస్తున్న మిత్రులు, గౌరవ సీనియర్స్ అందరికీ శుభాభినందనలు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani