ఈ గట్స్ అందరికి ఉండవు. అందరివల్లా అయ్యే పని కూడా కాదు.
అయితే, ఈ గట్స్‌ను మించిన శక్తులు కూడా కొన్నుంటాయి. వీటిని తప్పించుకోవడం అన్నది ఇండస్ట్రీలో అందరివల్లా కాదు. ఈ శక్తుల్లో ఏ శక్తి ఎప్పుడు ఏ రూపంలో ఎలా దాడిచేస్తుందో కూడా ఎవరూ ఊహించలేరు.
ఈ శక్తులు టీమ్‌లో ఉంటాయి. టీమ్ బయటా ఉంటాయి. అసలు టీమ్‌తో, సినిమాతో సంబంధంలేని రూపంలో అనూహ్యంగా ఇంటా బయటా కూడా ఉంటాయి. కొన్నిసార్లు అసలు సినిమా పూర్తయ్యేదాకా కనిపించని ఈ శక్తులు, సినిమా పూర్తయ్యాక సడెన్‌గా ఆఫీసులో దర్శనమిస్తాయి.
ఇండస్ట్రీలో, ఇండస్ట్రీలోని వ్యక్తుల్లో ఎన్ని స్లంప్‌లైనా రావొచ్చు, ఎన్ని మార్పులైనా రావొచ్చు. ఈ శక్తులు మాత్రం ఎప్పుడూ ఎవర్ గ్రీనే.
ఈ శక్తుల ప్రభావం వల్ల అనుకున్న సినిమాలు ప్రారంభం కావు... ప్రారంభమైన సినిమాలు ఆగిపోతాయి... పూర్తయిన సినిమాలు రిలీజ్ కావు... రిలీజయి కమర్షియల్‌గా బాగా ఆడుతున్న సినిమాల మీద "ఏం బాగా లేదు... చూడ్డం దండగ... ఫస్టాఫ్ పడుకుంది... సెకండాఫ్ సాగింది" అంటూ చెత్త రివ్యూలు వస్తాయి... టీమ్‌లో అప్పటిదాకా నమ్మకంగా ఉన్నవాడు ఏదో కుట్ర చేస్తాడు... ఉన్నట్టుండి డైరెక్టర్ లైఫ్ ఫుట్‌పాత్ ఎక్కుతుంది... ఇట్లా ఎన్నో, ఎన్నెన్నో.
ఇప్పుడైనా, ఎప్పుడైనా - ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొని నిలదొక్కుకున్న ప్రతి ప్రొడ్యూసరూ, డైరెక్టరూ, ప్రతి ఆర్టిస్టూ, టెక్నీషియనూ... ఇలాంటి ఎన్నో శక్తులను, ఎన్నెన్నోసార్లు, ఎన్నో రూపాల్లో ఎదుర్కొని పడిలేచిన కెరటంలా బయటపడ్దవాళ్లే.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
మరోసారి లాక్‌డౌన్ ఎత్తేశారు. సినిమా హాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. షూటింగ్స్ తిరిగి ప్రారంభమవుతున్నాయి. కొత్త సినిమాలు లాంచ్ అవుతున్నాయి.
బిగ్ బిజినెస్ మళ్ళీ ఊపందుకోబోతోంది.
బిగ్ బిజినెస్ మళ్ళీ ఊపందుకోబోతోంది.
లాక్‌డౌన్ నేర్పిన ఎన్నో పాఠాల నేపథ్యంలో... ఇకనుంచీ ప్రతి నిముషం, ప్రతి రోజూ ఎంతో విలువైంది. ఎక్కడా ఎవ్వరూ ఏ చిన్న చాన్స్ తీసుకోడానికి వీల్లేదు.
ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు అందరూ అన్ని విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎవరిపనుల్లో వారు బిజీ అయిపోతారు. తర్వాత ఇంకో వేవ్ వస్తుందో రాదో తెలియదు కాని... వస్తే మాత్రం, కొంతవరకయినా సరే, అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఏ బిజినెస్‌లో అయినా, ఏ ప్రొఫెషన్‌లో అయినా ఇకనుంచీ ప్లానింగ్స్ అన్నీ అంత పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. ఎట్‌లీస్ట్ ఆ స్థాయి ప్రయత్నం చేస్తారు.
నా కొత్త ప్రాజెక్టు పనులు కూడా, 'డే వన్' నుంచే, అంతే సీరియస్‌గా ప్రారంభం కాబోతున్నాయి...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani