నా మిత్రుని కొడుకు పెళ్ళి.
20 నాడు పెళ్ళి కడపలో, 22 నాడు రిసెప్షన్ కొడంగల్‌లో.
20 నాడు పెళ్ళి కడపలో, 22 నాడు రిసెప్షన్ కొడంగల్‌లో.
వాడి మొబైల్లో ఉన్న మొత్తం 269 మంది కాంటాక్ట్స్‌ను ఒక గ్రూప్ చేసి, ఒకే ఒక్క క్లిక్‌తో వెడ్డింగ్ కార్డ్ అందరికీ చేరవేశాడు నా మిత్రుడు.
కరోనా టైమ్‌లో ఇంతకంటే ఏం చెయ్యగలరు ఎవరైనా...
తప్పు పట్టడానికేం లేదు.
వ్యక్తిగతంగా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి కార్డులిచ్చే రోజులు పోయాయి. అది అస్సలు కుదరదు. అలాగని, వాట్సాప్‌లో కూడా ఒక్కొక్కరికి మెసేజ్ పంపాలన్నా కష్టం. అంత టైమ్ ఇప్పుడు ఎవరికుంది?
వ్యక్తిగతంగా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి కార్డులిచ్చే రోజులు పోయాయి. అది అస్సలు కుదరదు. అలాగని, వాట్సాప్‌లో కూడా ఒక్కొక్కరికి మెసేజ్ పంపాలన్నా కష్టం. అంత టైమ్ ఇప్పుడు ఎవరికుంది?
సో, నేను కూడా ఆ 269 మంది 'గ్రూపులో గోవిందా' అవక తప్పలేదు! 🙂
నాకేం పనిలేదు కాబట్టి - వాట్సాప్‌లో ఆ 269 గ్రూపుకు, పర్సనల్‌గా నా మిత్రుని నంబర్‌కూ వాట్సాప్‌లోనే నా శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్ పంపించాను.
కట్ చేస్తే -
చాలా ఏళ్ళ తర్వాత - నిన్న రాత్రి అనుకోకుండా నా క్యాంపస్ మిత్రుడొకరితో కాసేపు ఫోన్లో మాట్లాడాను.
మాటల మధ్య తెలిసింది ఏంటంటే - నేను చాలా ఇష్టపడే నా ఇంకో అతి దగ్గరి ఆత్మీయ మిత్రుడు అతని ఏకైక కూతురి పెళ్ళి చేశాడు. ఇది దాదాపు రెండేళ్ళక్రితం జరిగిందట. మా ఫ్రెండ్స్ అంతా కలిశారట. మరి, ఆ పెళ్ళికి నాకు వాట్సాప్ వెడ్డింగ్ కార్డ్ కూడా రాలేదు...
అనేక కారణాల నేపథ్యంలో, మనం మన ఆత్మీయ మిత్రులు అనుకున్నవారితోకూడా కొద్దిరోజులు టచ్‌లో లేము అంటే, మనమూ మన కాంటాక్టూ జస్ట్ 'షిఫ్ట్ డిలీటే' అన్నమాట! 😊😊
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani