50% ఆక్యుపెన్సీతో మాత్రమే నడపాలి. మిగిలిన అన్ని శానిటరీ జాగ్రత్తలు మామూలే.
కట్ చేస్తే -
ఏపీలో పర్మిషన్ ఇచ్చినా కూడా ఇంకా థియేటర్స్ ఓపెన్ కావల్సి వుంది. ఎక్కడో కేవలం 3, 4 చోట్ల మాత్రం ఇండిపెండెంట్‌గా కొన్ని థియేటర్స్ ఓపెన్ చేసినా పెద్ద కలెక్షన్స్ లేవు. ఫీడింగ్‌కి కొత్త సినిమాల్లేవు.
తెలంగాణలో మొన్న నవంబర్ 1 కి ఆర్డర్స్ ఇస్తారేమో అనుకున్నారంతా. కాని, అది జరగలేదు. ఒక ఇంటర్నల్ న్యూస్ ప్రకారం డిసెంబర్ మొదటివారం నుంచి గాని, డిసెంబర్ 11 నుంచి గాని ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని.
ఆ తర్వాత - క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి వరుసగా వస్తాయి కాబట్టి - సంక్రాంతికంతా ప్రేక్షకులు అలవాటు పడిపోతారనీ, కరోణా ఎఫెక్టు ఇంకా తగ్గి, 50% నుంచు 100% ఆక్యుపెన్సీ సంక్రాంతికి తెచ్చుకోవచ్చనీ అంచనా. సంక్రాంతి నుంచి పెద్ద సినిమాలు కూడా రిలీజ్‌కు రెడీ అయిపోయుంటాయి కాబట్టి థియేటర్స్ ఫీడింగ్‌కు కూడా సమస్య వుండదు.
కరోనా వైరస్ నుంచి ఎలాంటి లాస్ట్ మినట్ జెర్క్‌లు లేవప్పుడే పై అంచనాలన్నీ సాధ్యం అని ఆయా థియేటర్స్ చెయిన్స్ యజమానులందరికీ తెలుసు.
మనం ఎన్నో అనుకుంటాం కాని... థియేటర్స్ ఓపెన్ అయ్యి, థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే మాస్ ప్రేక్షకులతోనే సినిమాలు నిజంగా సక్సెస్ అయ్యేది. కలెక్షన్ల వర్షం కురిసేది.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani