చాలామందిలో చాలా విషయాల పట్ల ఆసక్తి వుంటుంది. ప్రవేశం కూడా వుంటుంది. కానీ, మనం ప్రభావితమైన కొన్ని సోకాల్డ్ రూల్స్ వల్ల, భయాలవల్ల 90 శాతం మనుషులు వారిలోని భిన్న అభిరుచుల్ని వారి మనసులోనే పాతిపెట్టేస్తారు. అవి ఎన్నటికీ పైకిరావు.
ఎప్పుడో అరవయ్యో, డెబ్బయ్యో దాటాక బాధపడతారు.
అంతకంటే విషాదం లేదు.
కట్ చేస్తే -
అతి త్వరలో నా యూట్యూబ్ చానల్ ఒకటి ప్రారంభించబోతున్నాను.
వ్యూస్ మీద వచ్చే డబ్బులకోసం కాదు. నేను చేయాలనుకున్నవన్నీ ఒక్కోటీ చేసెయ్యటంలో భాగంగా చేస్తున్నాను. అలాగని, వుట్టి టైమ్ పాస్ కోసం కూడా కాదు. పరోక్షంగా దాని ప్రయోజనం దానికుంటుంది.
రెండు కెమెరాలు, మూడు సెటప్పులు, మేకప్‌లు, ఎడిటింగ్‌లు, థంబ్‌నెయిల్ డిజైన్స్ వగైరా ... ఇవేవీ వుండవు.
కంప్లీట్ 'రా!'
మరిన్ని వివరాలు త్వరలోనే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani