మనోహరమ్ మ్యాగజైన్ నా రైటింగ్ ప్యాషన్‌లో భాగమే.
ఈమధ్య యూట్యూబ్ చానెల్ అనీ, పాడ్‌కాస్ట్ అనీ, ఫేస్‌బుక్ గ్రూప్ అనీ... వాటిని స్టార్ట్ చెయ్యడానికి ఒకటి రెండుసార్లు కొంచెం టెంప్ట్ అయ్యాను.
కాని, ఇప్పుడు ఆ అవసరం లేదు. అంత సమయం లేదు.
సినిమా, సినిమా, సినిమా.
రైటింగ్ ఫాలోస్.
అంతే.
గత కొన్ని నెలలుగా కూడా సినిమాల మీద నా దృష్టి పూర్తిస్థాయిలోనే వుంది. కాని, మార్చి నుంచి లాక్‌డౌన్ నా ప్రయత్నాలను, అప్పటివరకు నేను చేసుకున్న పనులను పడుకోబెట్టేసింది. ఇది చాలా పెద్ద దెబ్బ. అయినా సరే, ఇకనుంచీ, ఎలాంటి ఆటంకం వచ్చినా ముందుకే కదుల్తుండాలి తప్ప, ఇలా ఒక్క చోటే ఆగిపోకూడదని నిర్ణయించుకొన్నాను.
అందుకే ఈ పోస్టు. నాకోసం, నా రికార్డ్ కోసం.
కట్ చేస్తే -
జనవరి 18 నాటికి నా కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలన్న నిర్ణయం మీద గట్టిగా వున్నాను. అప్పటికి నేను పెట్టుకొన్న ప్రతి చిన్న గోల్ కూడా నేను వంద శాతం సాధిస్తాను. ఎవరి సహాయం వున్నా, లేకపోయినా.
ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భ్రమల్లోనే ఇటీవల జీవితంలో చాలా ముఖ్యమైన సమయం చాలా సిగ్గుచేటైనవిధంగా వృధా అయిపోయింది. ఇంక అలాంటి భ్రమల్లో లేను నేను. అసలు అలాంటి జీవనశైలి కాదు నాది. అనవసరంగా నాకు కుదరని మార్గంలో వెళ్ళి కోలుకోలేని దెబ్బ తిన్నాను. ఎప్పుడైనా నా పనులు నేను చేసుకొన్నప్పుడే సక్సెస్ అయ్యాను. వేరొకరి మాటలు నమ్మిన ప్రతిసారీ మోసపోయాను. బాధపడ్డాను. ఆ అధ్యాయం ముగిసింది.
నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. మధ్యలో నన్ను ఆవహించిన ఆ బలహీన మనస్తత్వం నుంచి పూర్తిగా బయటపడ్డాను. ఇప్పుడు నేను నేనే. నా దారిలో నేను హాయిగా పనులు చేసుకొంటూ వెళ్తున్నాను. అన్ని పనులూ అవుతున్నాయి. అవుతాయి. వరుసగా సినిమాలు చేస్తున్నాను. వరుసగా నా బుక్స్ పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పుడా పనిలోనే బిజీగా వున్నాను.
నా ఈ జర్నీలో ఒకరిద్దరు మిత్రులు, శ్రేయోభిలాషులు నావల్ల కొంత ఇబ్బందికి గురయ్యారు. వారు నాకు అందించిన సహకారానికి మరొక్కసారి నా హృదయపూర్వక అభివందనాలు.
వారితోపాటు - నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani