2013 లో వచ్చిన "లూసియా" అనే కన్నడ సినిమా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలో ఇండిపెండెంట్‌గా తయారైన తొలి కన్నడ సినిమా. 50 లక్షల మొత్తం బడ్జెట్‌ను క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సేకరించి నిర్మించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక్కటే 95 లక్షలు సంపాదించిపెట్టింది. లూసియా మొత్తం కలెక్షన్లు 3 కోట్లు. ఆ తర్వాత నాకు తెలిసి, కనీసం ఇంకో అరడజన్ కన్నడ సినిమాలు ఇదే పధ్ధతిలో నిర్మించారు. హిందీలో , తెలుగులో కూడా ఈ పధ్ధతిలో కొన్ని సినిమాల నిర్మాణం జరిగింది కాని, వీటి గురించి పెద్దగా ప్రచారం లేదు.
లాక్‌డౌన్ సమయంలో - ఓటీటీలు, ఏటీటీల నేపథ్యంలో చాలా గమ్మత్తులు జరిగాయి. కేవలం సినిమా బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో మాత్రమే చూసినట్టైతే మాత్రం, ఏటీటీ అనేది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో శ్రేయాస్ మీడియాను, ఆర్జీవీని మెచ్చుకోకతప్పదు.
ఇండస్ట్రీ అంతా ఆందోళనతోనో, కన్‌ఫ్యూజన్‌తోనో అన్నీ మూసేసుకొని ఒకవైపు టెన్షన్‌పడిపోతోంటే - ఒక్క ఆర్జీవీ మాత్రం దాదాపు ప్రతి రెండు వారాలకు ఒక సినిమా ఎనౌన్స్ చేస్తూ, తీస్తూ, చూపిస్తూపోయాడు! 100 రూపాయల టికెట్ పెట్టి, క్లైమాక్స్ సినిమాకు కేవలం 24 గంటల్లో ఒక రెండున్నర కోట్లు సంపాదించుకున్నాడు. క్లైమాక్స్ ఇచ్చిన కిక్‌తో వెంటనే ఒక 22 నిమిషాల నేకెడ్ సినిమా తీసి దానికి 200 రూపాయల టికెట్ పెట్టి, ఇంకో అరకోటి సంపాదించుకున్నాడు. తర్వాతి సినిమాల కలెక్షన్లు అటు ట్విట్టర్లో గాని, ఇటు వార్తల్లోగాని రాలేదు. టాక్స్ ఎఫెక్ట్ అనుకుంటాను. అలాకాకుండా, ఒకవేళ తక్కువ కలెక్షన్స్ వచ్చినా బాధపడాల్సిందేమీ లేదు. ఒక మంచి బిజినెస్ మాడల్ ప్రూవ్ అయ్యింది.
ఆర్జీవీ కాబట్టి అంత ప్రచారం జరిగి పబ్లిసిటీ వచ్చింది. వేరేవాళ్లకు అట్లా కలెక్షన్స్ రావు అని ఒక లాజిక్. కాని, ఇప్పుడున్న సోషల్‌మీడియా పవర్ నేపథ్యంలో ఈ లాజిక్ నిలబడదు. అంతేకాదు, ఏటీటీ కోసం తీసే సినిమాలు కూడా, అందరూ ఆర్జీవీని అనుకరించి, అట్లాగే తీయాలనే రూల్ కూడా ఏంలేదు.
ఈ నేపథ్యంలో, ఊహించనంత అతి తక్కువ బడ్జెట్లో కొత్తవారితో సినిమాలు నిర్మించి, ATT (Any Time Theater)ల్లో రిలీజ్ చేయవచ్చు. మంచి లాభం కూడా గ్యారంటీ. సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండీ, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించేవారికి క్రౌడ్ ఫండింగ్ పధ్ధతి ఒక మంచి అవకాశం. ఎంత చిన్న పెట్టుబడితోనయినా ఆసక్తి ఉన్న కొత్త ఇన్వెస్టర్స్ ఫీల్డులోకి ప్రవేశించవచ్చు!
లాక్‌డౌన్ ఉన్నా, లేకపోయినా, ఈ ఏటీటీ బిజినెస్ మోడల్ అనేది ఒక ఎవర్‌గ్రీన్ బిజినెస్ మోడల్‌గా కొనసాగుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే క్రమంలో, నంది అవార్డ్ పొందిన ఒక రైటర్-డైరెక్టర్‌గా, కేవలం ఏటీటీలో రిలీజ్ కోసమే నేనొక సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను న్యూ టాలెంట్‌తో ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇదే ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఆశ్చర్యం లేదు.
ఈ నేపథ్యంలో నేను 2 రకాల ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం చూస్తున్నాను:
1. ఇంతకుముందే ఇతర బిజినెస్‌లలో స్థిరపడి ఉండి, ఈవైపు ఆసక్తి ఉన్న పవర్‌ఫుల్ ఫండర్స్ సపోర్ట్.
2. సమర్థవంతంగా భారీ స్థాయిలో క్రౌడ్‌ఫండింగ్ ఎక్జిక్యూట్ చేయగల వర్కింగ్ పార్టనర్స్ సపోర్ట్.
ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్ మిత్రులు/ఎన్నారై సోదరులు/ఫండర్స్/బిజినెస్‌మెన్/సమర్థులైన మీడియేటర్లు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు: WhatsApp: +91 9989578125, Email: mchimmani10x@gmail.com
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani