"ప్రపంచంలోని అతి పెద్ద అబద్ధం ఏది," అని శాంటియాగో అడిగినప్పుడు, మారు వేషంలో వున్న రాజు అంటాడు...
"ఏదో ఒక దగ్గర, జీవితంలో మనపై మనం నియంత్రణ కోల్పోయినప్పుడు, విధి మన జీవితాన్ని నియంత్రణ లోనికి తీసుకుంటుంది... అన్నది ప్రపంచపు అతి గొప్ప అబద్ధం."
- పావ్‌లో కోయెల్యూ, ది ఆల్కెమిస్ట్
కట్ చేస్తే -
రెండు వారాల క్రితమే నేను అనుకొన్న ఒక తెలుగు ఆన్‌లైన్ మ్యాగజైన్ ఆలోచనను వెంటనే అమలుచేసి ఈ విజయదశమికి లాంచ్ చేస్తున్నాను, మీ అందరి ఆశీస్సులతో.
ఇప్పటికే వెబ్‌లో ఉన్న ఓ వంద పైచిలుకు తెలుగు న్యూస్‌పోర్టల్స్, ఫిలిం వెబ్‌సైట్స్, ఎట్సెట్రా... వాటి ఇలాకాలో అవి అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేను ప్రారంభిస్తున్న మ్యాగజైన్ పూర్తిగా ఒక ఫీచర్స్ మ్యాగజైన్. సినిమా కంటెంట్ కూడా కొంత ఉంటుంది గాని, అది పూర్తిగా నా బ్లాగింగ్ శైలిలో ఉంటుంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఉండదు. యాడ్స్ ఉంటాయి.
ఈ ఆన్‌లైన్ మ్యాగజైన్‌కు సంబంధించిన పూర్తివివరాలు ఒక చిన్న టీజర్ రూపంలో త్వరలోనే మీరు చూస్తారు.
నా బ్లాగ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వగైరా అన్నీ కలిపి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో ఒక 100,000+ పాఠకులకు ఈ మ్యాగజైన్ రీచ్ ఉంటుంది. ఆసక్తి ఉన్న రైటర్ మిత్రులు, కంట్రిబ్యూటర్స్ నన్ను ఇన్‌బాక్స్‌లో కలవ్వొచ్చు. విజయదశమి లాంచింగ్ సంచిక కోసం యాడ్స్ ఇవ్వదలిచిన/ఇవ్వగలిగిన మిత్రులు, శ్రేయోభిలాషులు, యాడ్ ఎక్జిక్యూటివ్స్ కూడా నన్ను ఇన్‌బాక్స్‌లో కాంటాక్ట్ చేయవచ్చు. యాడ్ ఎక్జిక్యూటివ్స్‌కు మంచి రాయాల్టీ, ఆకర్షణీయమైన ఇన్‌సెంటివ్స్ ఉన్నాయి.
థాంక్స్ టూ లాక్‌డౌన్... అంతకు ముందు కొన్నిసార్లు ఈ ఆలోచన వచ్చినా, ఇప్పుడు మాత్రమే ఇంత వేగంగా అమలు చేయగలిగాను. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. సదా మీ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ... మీ, మనోహర్ చిమ్మని. 🙏🙏🙏
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani