ఇదో కొత్త అనుభవం. నా రెగ్యులర్ బ్లాగింగ్‌కు కనీసం 10 రెట్లు ఎక్కువ పని! అయినా సరే, కావాలనే ఈ ప్యాషన్‌ను ఎన్నుకున్నాను. ఎలా సక్సెస్ చేస్తానో అన్న భయం లేదు. అలాంటి ఆలోచనా పధ్ధతి ఇప్పుడు అసలు లేదు. ఎందుకు సక్సెస్ చెయ్యలేను?... ఇదే ఇప్పుడు నా కాన్‌ఫిడెన్సు.
కట్ చేస్తే -
రెగ్యులర్ రైటింగ్స్ కోసం, కనీసం ఒక 10 మంది కంట్రిబ్యూటర్స్‌ను ఎన్నుకోవాలి. వాళ్లు వాలంటరీ రైటర్స్ అయ్యుండాలి. నేనేదో పెద్ద పత్రికాధినేత, ఇప్పటికిప్పుడే బాగా రెమ్యూనరేషన్స్ ఇస్తాను అనుకుంటే కష్టం! ఆ మాటకొస్తే, ఇప్పటివరకు నేను ఎన్నో దినపత్రికలకు, మ్యాగజైన్స్‌కు కథలు, కాలమ్స్, ఎడిట్ పేజీ ఆర్టికిల్స్ రాశాను. స్వాతి, ఆంధ్రభూమి వీక్లీలు తప్ప నాకు ఏ ఒక్క పెద్ద దినపత్రిక నుంచీ డబ్బులు రాలేదు.
మ్యాగజైన్ టెక్నికల్ వర్క్ కొంత మిగిలుంది ఇంకా. ఆ ఫైన్ ట్యూనింగ్ త్వరగా పూర్తిచేయాలి. చూస్తుంటే 15 వ తేదీ కూడా వచ్చేసింది. ఇంక దేన్నీ ఈజీగా తీసుకొనే వీళ్లేదు. టీజర్ కట్ చేయాల్సి ఉంది, మ్యాగజైన్ కోసం! రెండో వారం, మూడోవారం కంటెంట్ ఫైల్స్ కూడా ఓపెన్ చెయ్యాలి. పని కూడా స్టార్ట్ అవ్వాలి.
మ్యాగజైన్ పని ఒక్కటే కాదు, ఈ రోజునుంచీ, ప్రతి ఒక్క పనీ 10X స్పీడ్‌లో జరగాలి. జరిగేలా చెయ్యాలి. సినిమాలూ, పుస్తకాలూ, మ్యూజిక్ వీడియోలూ, ఇంకెన్నో... ప్రతి ఒక్కటి ఇంక కదుల్తూనే ఉండాలి... ఒకదాని తర్వాత ఒకటి...
ఎన్నో పనులున్నాయి. సమయం చాలా తక్కువగా ఉంది...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani