50 శాతం ఆక్యుపెన్సీతో ఎవ్వరికీ లాభం ఉండదు. పెద్దసినిమాలకు వర్కవుట్ కాదు. నిజాని విడుదలచేయడానికి పెద్ద సినిమాలేమీ పెద్దగా లేవు. అందరూ 2021 ప్రారంభంలోనే రిలీజ్‌కు ప్లాన్ చేసుకొంటున్నారు. ఇక ఏదన్నా వర్కవుట్ అవుతుందనుకొంటే, అది కేవలం చిన్న సినిమాలకు మాత్రమే. కాని, లాక్‌డౌన్లో ఎన్నో కష్టనష్టాలు అనుభవించాక, ఇప్పుడున్న పరిస్థితులో, చిన్న సినిమాల నిర్మాతలు మళ్లీ రిలీజ్ కోసం పబ్లిసిటీకని, క్యూబులకోసం అనీ, థియేటర్ రెంట్లకనీ పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. అలాగని, అవన్నీ పెట్టుకొని చిన్న సినిమాలను కొనే రిస్క్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏ డిస్ట్రిబ్యూటర్ చేయలేడు.
ఇలాంటి పరిస్థితుల్లో రేపు 15 వతేదేనాడు, ఏదో ఒక బిజినెస్ డీల్‌తో చివరికి చిన్న సినిమాలే రిలీజయ్యే చాన్స్ ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ అయితే తప్ప, ఎంత గొప్ప చిన్న సినిమాకయినా డబ్బులు వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు.
థియేటర్ రెంట్లు, పబ్లిసిటీ, క్యూబ్ చార్జెస్, డిస్ట్రిబ్యూటర్ పర్సెంటేజీ, టక్సులు వగైరా అన్నీ పోగా, చిన్న సినిమాల నిర్మాతలకు ఏదైనా ఇంక మిగుల్తుందనుకోవడం జస్ట్ భ్రమ మాత్రమే. ఈ నేపథ్యంలో - చిన్న సినిమాల రిలీజ్‌కు కొత్తగా వచ్చిన ఏటీటీనే ఇకనుంచీ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అవుతుంది.
రిలయన్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌వాళ్ళు ఈమధ్య ఇచ్చిన ఒక ప్రకటన ప్రకారం, ఇప్పుడున్న ఓటీటీలు కూడా ఇక నుంచీ, కొత్త సినిమాలు రిలీజ్ చేసినప్పుడు, "వాటికి టికెట్ పెట్టడం తప్పనిసరి కానుంది" అనడం విశేషం! సో, ఓటీటీలన్నీ ఇక ముంచీ ఏటీటీలు కానున్నాయని అర్థమవుతోంది. అంటే... కొత్త సినిమాల రిలీజ్ విషయంలో వాటి రెగ్యులర్ సబ్‌స్క్రిప్షన్ పనికిరాదన్నమాట. ఈ నేపథ్యంలో కూడా చిన్న సినిమాల రిలీజ్‌కు ఓటీటీలు, ఏటీటీలే పనికొస్తాయి.
100 శాతం ఆక్యుపెన్సీ వచ్చేదాకా పెద్ద సినిమాల రిలీజ్ థియేటర్లలో ఉండే అవకాశం లేదు. 2021 ప్రారంభం నుంచే పెద్ద సినిమాలను థియేటర్స్‌లో మనం చూసే అవకాశం ఉంది. అసలు ఆయా పెద్ద హీరోల సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోడానికే ఆమాత్రం సమయం ఈజీగా పడుతుంది.
ఇదంతా ఎలా ఉన్నా, కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రేక్షకులందరి ఆలోచనావిధానంలోను, జీవనవిధానంలో కూడా ఊహించని ఎన్నో మార్పులు వచ్చాయి. సగటు ప్రేక్షకులైనా సరే, హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అయినా సరే... ఇంతకు ముందులా థియేట్ర్లకు మాత్రమే వెళ్ళి సినిమా చూడాలనుకొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోనుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా, పదే పదే తన సినిమా రిలీజ్ వాయిదాపడి ఎంతో నష్టపోయిన ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ వాపోయినదాని ప్రకారం - "ఇది ఇలాగే ఇంకొన్నాళ్ళు కొనసాగితే మాత్రం... క్రమంగా అసలు థియేటర్‌కు వెళ్ళి సినిమా చూసే సంస్కృతే అదృశ్యమైపోతుంది" అనటం ఎన్నెన్నో ఆలోచనలకు దారితీసింది.
ఒకప్పుడు మ్యూజిక్‌కు రైట్స్ రూపంలో ఆడియో కంపెనీల నుంచి డబ్బులు బాగా వచ్చేవి. ఇప్పుడసలు మ్యూజిక్ రైట్స్ అనేదే లేకుండాపోయింది. టెక్నాలజికల్‌గా ఊహించని స్థాయిలో వచ్చిన అభివృధ్ధివల్ల, మ్యూజిక్‌ను ఒక ఓపెన్ సోర్స్‌గా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలాంటి పరిస్థితే క్రమంగా సినిమాకు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడు సినిమాకు పెట్టిన ఈ పెట్టుబడి అంతా ఎలా వెనక్కివస్తుంది? లాభాల సంగతేంటి? వీటన్నిటికీ సమాధానాలు కూడా టెక్నాలజీ ద్వారానే దొరుకుతాయి. అయితే, ఇది అంత త్వరగా జరిగేది కాదు, కాని జరగడానికిమాత్రం చాలా అవకాశముంది.
ఈ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ విషయంలో ఊహించని మార్పులెన్నో ఉండే అవకాశముంది. మార్పులు చేర్పులు ఏవైనా గాని, అంతిమంగా వాటి ప్రభావం సగటు ప్రేక్షకుని వాలెట్ పైనే పడుతుందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani