మనోహర్ చిమ్మని పేరుతోనూ, వివిధ కలం పేర్లతోనూ వీరు రాసిన వ్యాసాలు, ఫీచర్లు, కథలు, సీరియల్స్ మొదలైనవి దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో అచ్చయ్యాయి. రేడియోలో కూడా ప్రసారం అయ్యాయి. రష్యన్ భాష నుంచి నేరుగా తెలుగులోకి అనువదించిన వీరి అనువాద కథలు కూడా పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
మనోహర్ చిమ్మని రాసిన “ఆధునిక జర్నలిజం” పుస్తకం కాకతీయ యూనివర్సిటీలో పీజీ స్థాయిలో రికమెండెడ్ బుక్స్ లిస్ట్‌లో ఉంది. వీరు రాసిన "సినిమాస్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం 'సినిమారంగంలో ఉత్తమ పుస్తకం'గా నంది అవార్డు గెల్చుకొంది.
గతంలో - హెచ్ ఎం టి, నవోదయ విద్యాలయ, ఆలిండియా రేడియో వంటి మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సుమారు పదిహేనేళ్లపాటు పనిచేశారు మనోహర్ చిమ్మని. ఫిలిం డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్‌లతోపాటు - ఫ్రీలాన్స్ రైటింగ్, యాడ్ ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ వీడియో మేకింగ్, బ్లాగింగ్, సోషల్‌మీడియా ప్రమోషన్... వీరి ఇతర ప్రొఫెషనల్ ఆసక్తులు.
దర్శకరచయితగా మనోహర్ చిమ్మని ఇప్పటివరకు కల, అలా, వెల్‌కమ్, స్విమ్మింగ్‌పూల్... అని నాలుగు సినిమాలు చేశారు. ప్రస్తుతం రిస్క్-ఫ్రీ బిజినెస్ మోడెల్‌లో, కేవలం ఏటీటీలో రిలీజ్ కోసమే, ఒక సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేసి, ఆ సినిమాల ప్రిప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు మనోహర్ చిమ్మని.
email: mchimmani10x@gmail.com
WhatsApp: +91 9989578125
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani