మొన్న సెప్టెంబర్ 14 నాడు మా రష్యన్ ప్రొఫసర్ మురుంకర్ సర్ "కెలీడోస్కోప్" పుస్తకావిష్కరణ సభకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా నాకో కొత్త అనుభవం ఎదురైంది.
చివర్లో ఒక్క "వోట్ ఆఫ్ థాంక్స్" తప్ప, సమావేశం మొత్తం మరాఠీలోనే జరిగింది. సమావేశం వ్యాఖ్యాత, వక్తలు అందరూ మరాఠీలోనే మాట్లాడారు.
నాకు మరాఠీ అస్సలు రాదు!
అయినాసరే, వక్తలు మాట్లాడినదాంట్లో ఒక 50% నాకు కొద్దికొద్దిగా అర్థమైంది. ఇంకో 50% అస్సలు అర్థం కాలేదు. కాని, ఆ సమావేశాన్ని నేను 100% ఎంజాయ్ చేశాను!
ఓయూలో నేను రష్యన్ డిప్లొమా చేస్తున్నప్పుడు, నాకూ ఇంకో స్టుడెంట్‌కు మధ్య ఒక డిస్కషన్ జరిగింది. అప్పుడు మధ్యలో అటుగా వెళ్తున్న మా మురుంకర్ సర్ వచ్చారు. మా గొడవంతా విని, తన ఫినిషింగ్ టచ్ ఒకటి కూల్‌గా ఇచ్చేసి వెళ్ళిపోయారు.
దాని సారాంశం ఏంటంటే - కొత్తగా ఒక భాష నేర్చుకొనేటప్పుడు, ముందు ఆ కొత్త భాషలోని తిట్లు, పొగడ్తలు నేర్చుకోవాలన్న కుతూహలం ఎవరికైనా సహజంగానే కలుగుతుందిట! "అలాంటి క్యూరియాసిటీ ఉండటంలో తప్పేం లేదు" అని చెప్పేసి వెళ్ళిపోయారు సర్. అప్పటి ఆ సీన్ నాకింకా గుర్తుంది.
మరాఠీ నేర్చుకొనే అవసరం నాకెప్పుడూ రాలేదు. కాని, మరాఠీలో నాకు తెలిసిన ఒక మూడు మాటలు మాత్రం ఇప్పటికీ గుర్తున్నాయి:
1. నేను హెచ్ఎంటీలో మెషినిష్ట్‌గా పనిచేస్తున్నప్పుడు, ఔరంగాబాద్‌నుంచి వచ్చి చేరిన ముగ్గురు మరాఠీ మిత్రులుండేవారు. నేనెప్పుడయినా ఒక 5 నిమిషాలు కనిపించకపోతే, తిరిగి రాగానే "కుటె గేలా?" అని ఎంక్వయిరీ చేసేవాళ్ళు. సుమారు 30 ఏళ్లు గడిచినా, నాకా మాట ఇంకా గుర్తుంది.
2. నా 7వ తరగతిలో అనుకుంటాను... తెలుగు నాన్‌డీటైల్ పుస్తకంలో మరాఠా యోధుడు తానాజీ మీద ఒక పాఠం ఉంది. ఆ పాఠం చివరి లైన్‌గా, తానాజీ గురించి మహారాజా శివాజీ చెప్పిన ఒక మాట ఉంటుంది: "గఢ్ ఆయా, పర్ సింహ్ గయా!" అని. ఇప్పటికీ నేను మర్చిపోలేని డైలాగ్ అది.
3. ఓయూలోనే నేను పీజీ చేస్తున్నప్పుడు ఒక మరాఠీ అమ్మాయికి "నువ్వు అందంగా ఉన్నావు" అని మరాఠీలో చెప్పాలనుకున్నాను. దానికోసం, ఇంకో మరాఠీ అమ్మాయిని కనుక్కొని చెప్పాల్సి వచ్చింది: " తూ సుందర్ ఆహెస్!" అని.
కట్ చేస్తే -
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మా మురుంకర్ సర్ ఇన్విటేషన్ పంపగానే చాలా హాప్పీగా ఫీలయ్యాను. ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకొన్నాను. పుస్తకం మరాఠీలో అనగానే కొంచెం నిరుత్సాహపడ్డాను. వెంటనే చదవలేకపోతాను కదా అన్నది నా బాధ!
సరే, ఎవరో ఒక కొత్త మరాఠీ ఫ్రెండ్‌ను వెతుక్కోవచ్చులే అని సరిపెట్టుకున్నాను.
జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి హెచ్చార్డీ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేటప్పటికి కొంచెం ఆలస్యమైంది. మా మురుంకర్ సర్ మాట్లాడ్డం అప్పుడే ప్రారంభమైంది.
"హమ్మయ్య... సర్ స్పీచ్ మిస్ కానందుకు సేఫ్!" అనుకున్నాను.
సమావేశం పూర్తవ్వగానే ముందుకు వెళ్ళి జ్యోత్స్నా మేడమ్‌కు, మురుంకర్ సర్‌కు విష్‌చేసి బయటపడ్డాను.
నాకోసమే వైజాగ్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన ఫ్రెండ్ కూడా అప్పుడు నాతో ఉన్నారు. మేమిద్దరం వెళ్ళాల్సిన ఇంకో మీటింగ్‌కి టైమ్ ఎప్పుడో అయిపోయింది.
తర్వాత సర్‌ని ఇంటిదగ్గర కలిసి పుస్తకం తీసుకొనే అవకాశం ఎలాగూ ఉంది కాబట్టి వెంటనే నేనూ నా ఫ్రెండూ అక్కడనుంచి బయటపడ్డాము.
కట్ చేస్తే -
అసలు నేనీ సమావేశానికి వెళ్ళడానికి మొదటి కారణం - నాకు మా మురుంకర్ సర్ మీద ఉన్న అభిమానం. పైగా, సర్ పుస్తకం ఆవిష్కరణ! ఎలా మిస్ అవుతాను?
ఇక రెండో కారణం కూడా ఒకటి చాలా బలమైందే ఉంది... ఆ సమావేశానికి వస్తున్న ముఖ్య అథితుల్లో ఒకరు రాచకొండ కమీషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్, ఐపీఎస్!
ఆయనే సర్ పుస్తకం "కెలీడోస్కోప్" ఆవిష్కర్త.
మహేశ్ భగవత్ గురించి నేను చాలా చదివాను, విన్నాను. సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలో అవుతుంటాను. అవుటాఫ్ ద బాక్స్... ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్ అన్నీ నాకు చాలా ఇష్టం.
మహేశ్ భగవత్ చేసిన ఎన్నో మంచిపనుల్లో ఒక్కదాని గురించి మాత్రం ఇక్కడ చెప్తాను:
తను ఆదిలాబాద్ ఎస్పీగా చేస్తున్నప్పుడు ఒక లొంగిపోయిన నక్సలైట్ చేత, అతని కోరిక ప్రకారం, అతను మధ్యలో వదిలేసిన ఇంజినీరింగ్‌ని జె ఎన్ టి యూ లో పూర్తిచేయించారు భగవత్. ఇప్పుడా వ్యక్తి ఒక ప్రముఖ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.
ఇది సినిమా కాదు. రియాలిటీ! రియల్లీ హాట్సాఫ్ టూ మహేశ్ భగవత్ జీ...
అలాంటి మహేశ్ భగవత్ స్పీచ్ కూడా వినొచ్చు అని నా ఉద్దేశ్యం.
మహేశ్ భగవత్ కూడా తన ఉపన్యాసం మరాఠీలోనే ఇచ్చారు. అయితే, నిజం చెప్పాలంటే, మొత్తం సమావేశంలో మాట్లాడిన అందరికంటే ఎక్కువ హుషారుగా మాట్లాడిందీ, అందర్నీ బాగా నవ్వించిందీ మహేశ్ భగవత్ గారే!
మురుంకర్ సర్ 'వెరీ యాక్టివ్' ఫేస్‌బుక్ యాక్టివిటీ గురించి, నా స్విమ్మింగ్‌పూల్ సినిమాలో సర్ యాక్టింగ్ గురించి, స్నేహ చికెన్ వంటల కాంపిటీషన్‌లో సర్ ప్రైజ్ కొట్టేయటం వంటి వాటన్నింటి గురించీ... అందర్నీ నవ్విస్తూ, హుషారెత్తిస్తూ చాలా విషయాల్ని మహేశ్ భగవత్ తన స్పీచ్‌లో చెప్పడం పెద్ద విశేషం.
కట్ బ్యాక్ టూ మురుంకర్ సర్ -
మురుంకర్ సర్ సీఫెల్ అనుభవాలు, జే ఎన్ యూ అనుభవాలు, రష్యా అనుభవాలు చదవాలని నాకు చాలా ఇష్టం. కాని సర్ పుస్తకం మరాఠీలో ఉండి కాబట్టి ఇప్పుడు నేనో ఇంటరెస్టింగ్ ఇంటర్‌ప్రీటర్‌ను హంట్ చేసి పట్టుకోవాలి. తప్పదు.
అలాగే సర్ స్వయంగా "There is one chapter on you... We have translated the blog you wrote about me a couple of years back..." అని కూడా చెప్పారు.
వాటే గ్రేట్ హానర్! సర్ కెలీడోస్కోప్‌లో నేనున్నాను. అంతకంటే ఏం కావాలి? ఫుల్ హాపీస్...
కాకపోతే, ఇప్పుడు వీలైనంత తొందర్లో సర్ దగ్గర్నుంచి బుక్ తెచ్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఒక మరాఠీ ఫ్రెండును పట్టుకోవాలి!
ఇక... కెలీడోస్కోప్ పుస్తకం కంటెంట్‌ను మురుంకర్ సర్ డిక్టాఫోన్లో చెప్తుంటే రికార్డ్ చేసుకొని సురేంద్రపాటిల్ గారు రాసినట్టు తెలుసుకున్నాను. అయితే, వీరిద్దరి పరిచయ నేపథ్యం ఏంటన్నది మాత్రం నేను తెలుసుకోలేకపోయాను.
మా మురుంకర్ సర్ గురించి ఇంత శ్రమ తీసుకొని ఈ కెలీడోస్కోప్‌ని రూపొందించిన రైటర్ సురేంద్రపాటిల్ గారికి నా అభివందనాలు.
ఇంకా... ఈ కెలీడోస్కోప్‌లో జ్యోత్స్న మేడమ్, వాళ్లబ్బాయి అమిత్ మురుంకర్, అమ్మాయి నీలిమ కులకర్ణి రాసిన చాప్టర్లు కూడా ఉన్నాయని తెలిసింది. అన్నీ ఎప్పుడెప్పుడు చదువుదామా అని ఎదురుచూస్తున్నాను.
కట్ చేస్తే -
ఈ బ్లాగ్ ద్వారా మా మురుంకర్ సర్‌కి రెండు రిక్వెస్ట్‌లు:
1. ఈ కెలీడోస్కోప్‌ను మీరు వెంటనే ఇంగ్లిష్‌లోకి అనువదింపజేసి పబ్లిష్ చేయాలి. మీ అనుభవాలు-జ్ఞాపకాలు నాలాంటివాళ్ళు ఇంకెందరో కూడా చదవాలి కాబట్టి.
2. మీరు రోజూ ఒక 10 నిమిషాలు కెటాయించి, మీ "రాండమ్ మెమొరీస్"ను ఇంగ్లిష్‌లో ఒక 100 పదాల్లో రాస్తే చాలు. కావాలంటే దీనికోసం "స్పీచ్ టూ టెక్‌స్ట్" లాంటివి ఎన్నో ఉన్నాయి, మీరు టైప్ చేసే అవసరం కూడా లేకుండా! సంవత్సరం తిరిగేటప్పటికి అది 36500 పదాల పుస్తకం అవుతుంది. అప్పుడు పబ్లిష్ చెయ్యొచ్చు. ఒక సీరియల్ నంబర్ వేస్తూ రోజూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినా సరిపోతుంది.
రాండమ్‌గా సర్ షేర్ చేసుకొనే ఈ అనుభవాలు-జ్ఞాపకాలు ఏవయినా కావొచ్చు. పరోక్షంగానయినా, నాలాంటి అభిమానులకి అవి ఎంతో కొంత నేర్చుకొనే పాఠాలుగా ఉపయోగపడతాయన్నది నా ఉద్దేశ్యం.
బికాజ్... ఇప్పటివరకు నేను చూసిన అతి కొద్దిమంది "100% కంప్లీట్ మెన్"లో సర్ ప్రథమ స్థానంలో ఉంటారు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani