కొంచెం అతిగా స్పందిస్తుంటాను.
స్క్రిబ్లింగ్.
స్టఫ్.
నాన్సెన్స్.
వెరసి... పిచ్చిరాతలు.
వేదిక సోషల్ మీడియా...
ఈమధ్యే ఒక ఆలోచన వచ్చింది.
అన్నిటినీ ఒకే హాష్‌ట్యాగ్‌తో
ఒక్కదగ్గరికి తేవచ్చని.
ఎట్ లీస్ట్ ఇకనుంచయినా
వాటిని నేను మిస్ కాకుండా,
మళ్ళీ వెతుక్కొనే పనిలేకుండా.
ఇంకో నియమం పెట్టుకున్నాను...
ఏ చిన్న స్క్రిబ్లింగ్ చెక్కినా,
దాన్ని ఎక్కడ పోస్ట్ చేసినా,
హాష్ ట్యాగ్ పెట్టాలనీ,
ప్లస్, దాన్ని వెంటనే
బ్లాగ్‌లో కూడా పోస్ట్ చెయ్యాలనీ.
ఇది బెటర్.. అన్నీ ఒక్క దగ్గరే చూసుకోడానికి.
అవసరమైనప్పుడు మళ్లీ అలా ఫీలవ్వడానికి.
కట్ చేస్తే -
చెప్పలేమ్...
కరోనానుంచీ, కష్టాలనుంచీ
కొంచెం ఊపిరిపీల్చుకొన్నాక,
నా అంతరంగంలో
పడిపడి ఆడుకొనే
పదహారణాల పిచ్చిఊహల
"కవితామనోహరమ్" కు
ఈ చిన్న పోస్టే కొత్త ఆరంభం కావచ్చు!
- #మనోహర్‌చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani