దానికో త్రెడ్ కూడా!
కింద ఇంకో రెండు డజన్ల వత్తాసు కామెంట్లు.
వాళ్లందరి బాధల్లా ఒక్కటే... "వరల్డ్ నంబర్ వన్ సిటీ" సెలబ్రేషన్స్ ఈ నీళ్లల్లో చేసుకుంటారా అంటూ.
ఎవరైనా కావొచ్చు. వారు నాకు వ్యక్తిగతంగా తెలియదు. వ్యక్తిగతంగా వారిమీద నాకు ఎలాంటి ఇతర ఉద్దేశ్యాలు లేవు. ఉండవు కూడా.
కట్ చేస్తే -
న్యూయార్క్ లాంటి మహానగరాల్లో, ప్రపంచంలోని ఇంతకంటే నంబర్ 1 సిటీల్లో లెక్కకు మించిన భారీ వర్షాలు పడినప్పుడు ఆ నగరాలు అతలాకుతలం కాలేదా? ఆ ఫోటోలు, వీడియోలు, వార్తలు వీళ్లు చూళ్లేదా? వీళ్లకి కనిపించవా?
ఎంతసేపూ అంతర్లీనంగా ఉన్న ఆ లోలోపలి భావనను, బాధను ఇంకా వదిలిపెట్టలేరా?
హోటళ్లు, పబ్బులు, మాల్స్, షాపింగ్ సెంటర్స్, ఐమాక్స్‌లు... ఇవన్నీ ఓకే. రెండు గంటలు కష్టం వస్తే తట్టుకోలేరా? విషం చిమ్మాల్సిందేనా?!
అంత కష్టంగా ఉన్నప్పుడు, ఈ నగరం నచ్చనప్పుడు, ఇంతకంటే గొప్పగా ఉన్న ఎన్నో మీకు తెలిసిన "నంబర్ ఏక్" నగరాలకు పోయి హాయిగా బ్రతకడం మంచిది కదా?
ప్రభుత్వ పనితీరులోని లోపాలను దర్జాగా ఎత్తి చూపొచ్చు. నిర్మాణాత్మకంగా మీకు చేతనయినంత విమర్శించవచ్చు. మీలో ఇంకేవైనా పనికొచ్చే తెలివితేటలు ఉంటే సలహాలు కూడా ఇవ్వొచ్చు. తప్పులేదు.
కాని, మనం బ్రతుకుతున్న నగరంపైన ఎగతాళిగా ట్వీట్లు పెట్టడం, కామెంట్లు పెట్టడం మంచి పధ్ధతి కాదు.
మళ్లీ తెల్లారితే మీరూ, నేనూ ఇదే హైద్రాబాద్ రోడ్లమీద మన పనులకు పోవాలి. పని చేసుకోవాలి, బ్రతకాలి.
అన్నం పెడుతున్న హైద్రాబాద్‌ను ఎలా ఎగతాళి చేస్తారు?
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani