" హలో అండీ, హౌ ఆర్ యూ...?"
అప్పుడు 2015 లో అంతే. అర్థ దశాబ్దం దాటినా, ఇప్పుడు 2020 లో కూడా అదే పధ్ధతి, అదే పలకరింపు.
అసలే కరోనా కాలం. ఏదో అత్యవసరం ఉంటే తప్ప, అసలు పలకరింపులనేవే లేకుండాపోయిన రోజులివి. అలాంటిది... ఎక్కడో యు కె నుంచి, అనవసరపు మాస్కులు లేని ఇలాంటి పలకరింపు ఈ రోజుల్లో దాదాపు మృగ్యం. నా దృష్టిలో చాలా గొప్ప విషయం.
అదే ఇప్పుడు ఉన్నట్టుండి ఏదన్నా సినిమా ఎనౌన్స్ చేశామనుకోండి. మొత్తం మంది ఎక్కడలేని అభిమానం చూపిస్తూ ఫోన్లూ, వాట్సాపులూ, కలవటాలు... ఒక్కసారిగా ఊపందుకొంటాయి.
అదొక వెరైటీ కేటగిరీ... వాళ్ల స్టయిలే వేరు.
సినిమా ఉంటేనే పలకరింపు అనుకుంటే... అసలలాంటి పలకరింపులు, ఫ్రెండ్‌షిప్పులే శుధ్ధ దండగ.
కట్ చేస్తే -
అరుణ్‌కుమార్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇవ్వాళ పలకరించారు. చాలా హాప్పీగా ఫీలయ్యాను.
మధ్యలో కూడా మా మధ్య మెయిల్స్, చిన్న చిన్న చాట్స్ బాగానే అయ్యాయి. తర్వాత ఎవరి బిజీలో వాళ్లం అలా కంటిన్యూ అయిపోయాం.
ఇదిగో మళ్లీ ఇప్పుడే... కొంచెం గ్యాప్ తర్వాత అరుణ్‌కుమార్ పలకరింపు. అందుకే చాలా హాప్పీగా ఫీలయ్యాను.
ఇద్దరం కలిసి, మేం అనుకున్న ఒక చిన్న బడ్జెట్‌లో ఒక మంచి ప్రాజెక్టు జస్ట్ 12 రోజుల రికార్డ్ టైమ్‌లో షూటింగ్ పూర్తిచేశాం.
కనీసం ఒక నెల ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం. ఆ డేట్ ఒక్కసారి కూడా మార్చకుండానే మా సినిమా రిలీజ్ చేశాం. అదేరోజు విడుదలైన ఇంకో పెద్ద డైరెక్టర్ పెద్ద సినిమా కలెక్షన్ల కంటే మా కలెక్షన్లే ఎక్కువ అని ఫిలిం ట్రేడ్ గైడ్స్‌లో రికార్డ్ చూపించాం!
ఇన్నిరకాలుగా మేం గెలిచాము.
హిట్టా ఫట్టా పక్కనపెడితే, అరుణ్‌కుమార్ ప్రొడ్యూసర్‌గా, ఒక సినిమా నిర్మించి సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్‌చేయగలిగారు.
ఒక ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌కు నిజంగా ఇది పెద్ద విజయమే.
స్విమ్మింగ్‌పూల్ తర్వాత, అరుణ్‌కుమార్ ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు.
ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా, ఒక ప్రొడ్యూసర్‌గా, సినిమాకే సంబంధించిన ఇంకోరంగంలో కూడా అరుణ్‌కుమార్ తప్పకుండా ఒక టాప్ పొజిషన్‌కు ఎదుగుతారు. ఆరోజు కూడా త్వరలోనే వస్తుంది.
I wish him The Best always...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani