"పబ్లిక్‌లోకి వచ్చాక ఎవరి వ్యక్తిగతం కూడా వ్యక్తిగతం కాదు. అంతా పబ్లిక్కే!" .. కొంచెం అటూఇటుగా ఇదే మాటను శ్రీశ్రీ ఎక్కడో అన్నట్టు గుర్తు.
అప్పటి విషయం ఏమోగానీ, సోషల్ మీడియా అనేది మన జీవితంలో ఒక విడదీయరాని భాగమైన ఈ రోజుల్లో మాత్రం పైన చెప్పిన మాట చాలావరకు నిజం. పబ్లిక్‌లోకి వచ్చిన ప్రతి చిన్నా పెద్దా సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ఇతర వి ఐ పి లకే కాదు .. ఇప్పుడిది అందరికీ వర్తిస్తుంది.
ఫేస్‌బుక్‌లో "అస్సలు వ్యక్తిగతం కాదు" అనుకున్న స్టఫ్ ఏది పోస్ట్ చేసినా - కనీసం అంతర్లీనంగానైనా ఆ పోస్ట్ ఆ వ్యక్తి మనస్తత్వం, ఆలోచనాధోరణినిని కొంతైనా ప్రతిబింబిస్తుంది. ట్వీట్స్, బ్లాగింగ్ విషయంలోనూ అంతే. వ్యక్తిగతం కానిది ఏది రాసినా, రాస్తున్నామనుకున్నా .. అందులో ఎంతో కొంత మన వ్యక్తిత్వం, వ్యక్తిగతం తొంగిచూస్తుంది. తప్పదు.
కట్ టూ నా వ్యక్తిగతం -
ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్ .. ఇవన్నీ కలిపి ఒక ఎంటిటీగా నా ప్రయోగశాల. నా మెడిటేషన్ సెంటర్. నా ఏకాంతం. నా ఆత్మశోధన. నా అంతరంగం.
మొత్తంగా - ఒక నేను.
నా జీవితం, జీవనశైలి, నా ఆలోచనలు, నా అంతరంగం, నా సంఘర్షణలు, నా సమస్యలు, నా ఆనందాలూ,నా ఆవేదనలూ అన్నీ వీటిలో అలా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. నేను వద్దనుకున్నా.
అలా అవకూడదు అని ఎవరైనా అనుకుంటున్నారంటే, అంతకంటే ఫూలిష్‌నెస్ మరోటి ఉండదు. ఆ ఫూలిష్‌నెస్ నుంచి నేను ఎన్నడో బయటపడ్డాననే అనుకుంటున్నాను. కాకపోతే, అణచిపెట్టుకొంటున్న నా అగ్రెసివ్ ఆలోచనలనెన్నింటినో నిర్భయంగా, డైరెక్ట్‌గా, నా మనసులో అనుకున్నంత ఓపెన్‌గా షేర్ చేసుకొనే సమయం కోసమే ఎదురుచూస్తున్నాను.
ఆ స్వతంత్రాన్ని అతి త్వరలోనే సాధిస్తాను. ఆ నమ్మకం నాకుంది.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani