నగ్నచిత్రం ఏదో ఒకటి రాయడానికి కాదు. నేను రాసింది కనీసం ఒక్కరికైనా నచ్చాలి. ఆనందం ఇవ్వాలి. ఎట్‌లీస్ట్ ఆ క్షణం ఆలోచింపచేయాలి.
ఇంక ఈ బ్లాగ్ ద్వారా నేను ఆశించే మరో ప్రయోజనం .. నా సినిమాల ప్రమోషన్.
నా సినిమా జరుగుతున్నంతసేపూ - ఆ ప్రాసెస్‌లో .. నాకు తోచిన, రాయాలనిపించిన ప్రతి చిన్న అంశం మీద కూడా ఏదో ఒకటి రాస్తాను. ఇంక ఆ చిత్రానికి పనిచేస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో కూడా దాదాపు ప్రతి ఒక్కరి గురించీ రాస్తాను.
కట్ టూ అసలు పాయింట్ -
నిన్ననే ఒక ట్వీట్ పెట్టాను. "ఫెబ్ ఈజ్ ఫర్ ఫ్రీడమ్" అని.
అంటే, ఈ ఫిబ్రవరి నెలలోనే ఎప్పటినుంచో నేను కోరుకొంటున్న ఫ్రీడమ్ తెచ్చుకోబోతున్నాను. కోరితెచ్చుకొన్న కొన్ని తలనొప్పుల్లోంచి ఫ్రీ అయిపోవాలనుకొంటున్నాను. కనీసం ఆ ప్రాసెస్ అయినా ప్రారంభం కావాలి. ప్రారంభిస్తాను.
అదీ, ఈ ఫిబ్రవరిలోనే!
మరోవైపు నా కొత్త సినిమాలు కూడా ప్రారంభించబోతున్నాను. అందులో మొదటిది నా ఆత్మీయ మిత్రునితో కలిసి చేస్తున్నాను. నిజంగా అదొక చాలెంజింగ్ ప్రాజెక్ట్ అవుతుంది నాకు.
ఇదంతా ఎలా ఉన్నా .. అన్నిటికంటే ముందు, అసలు ఈ బ్లాగ్ నా కోసం నేను క్రియేట్ చేసుకున్నది. కాబట్టి, ఏదో క్షణికావేశంలో అర్థంలేని నిర్ణయాలను తీసుకోవడం ఫూలిష్‌నెస్ అవుతుంది.
సినిమాల దారి సినిమాలదే. బ్లాగింగ్ బ్లాగింగే.
నామట్టుకు నాకు .. బ్లాగింగ్ ఒక మినీ లేబొరేటరీ. ఒక థెరపీ. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒక యోగా. ఒక ధ్యానం. ఒక అంతశ్శోధన. ఒక అంతర్మథనం.
నా ఈ నగ్నచిత్రం లో నన్ను నేను చూసుకుంటున్నాను. నాలో ఉన్న నన్ను ని విశ్లేషించుకుంటున్నాను.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani