"ఈ మధ్య ఫేస్‌బుక్ అంతా ఒకే ఒక్క ప్రొడ్యూసర్ తెగ దున్నేస్తున్నారు. ఎవరో చెప్పగలరా?" అని మొన్న సరదాగా నా టైమ్‌లైన్ మీద ఒక పోస్ట్ పెట్టాను. వెంటనే ఆన్సర్ వచ్చేసింది.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ.
కట్ టూ ఫ్లాష్‌బ్యాక్ -
అది 2006 అని నాకు బాగా గుర్తుంది. ఆరోజు, శాటిలైట్‌రైట్స్ బిజినెస్ చేసే కె వి వి అనే ఒక థర్డ్ పార్టీ వ్యక్తి ఆఫీసు హాల్లో మా మేనేజర్‌తో కలిసి కూర్చునివున్నాన్నేను. అప్పుడా ఆఫీస్ శ్రీనగర్ కాలనీలోని ఒక ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేది.
అప్పుడే - చూడ్డానికి చాలా మామూలుగా ఉన్న ఒక వ్యక్తి మేం కూర్చున్న అదే హాల్లోకి ఎంటరయ్యాడు. పక్కనే ఉన్న ఇంకో సోఫాలో కూర్చుని, ఏదో ఫిలిం మేగజైన్ చేతిలోకి తీసుకున్నాడు.
"ఇదిగో ఈయనే .. రామసత్యనారాయణ అంటే! 'శాటిలైట్ సినిమాలు' తీస్తాడు!!" అని అక్కడున్న ఒకరు చిన్నగా నాతో అన్నారు. తర్వాత ఆయన గురించే ఇంకా ఏవేవో నాలుగు మాటలు అదే హాల్లో ఉన్న ఇంకొందరు కూడా మాట్లాడుకున్నారు.
అప్పుడు నేను విన్న ఆ మాటలన్నిటిలోనూ ఒకరకమైన చిన్నచూపు, ఎగతాళి నేను గమనించాను.
అవన్నీ ఆయనకు వినిపిస్తున్నా, అసలేమీ పట్టించుకోకుండా చేతిలో ఉన్న మేగజైన్‌లో సినిమా న్యూస్ చదువుకొంటూ కూర్చున్నారాయన. ఆ దృశ్యం నాకింకా గుర్తుంది.
కట్ చేస్తే -
అదే 2006 లో, నిర్మాతగా ఆయన 13 సినిమాలు తీసి రిలీజ్ చేశారు.
అది రికార్డ్. గ్రేట్ రికార్డ్!
దాదాపు అంతా స్టార్స్‌తోనే సినిమాలు తీసిన రామసత్యనారాయణ, ఇప్పటివరకు మొత్తం 78 సినిమాలు తీశారు. ఈ మొత్తం 78 సినిమాల్లో కేవలం 4 మాత్రం డబ్బింగ్ సినిమాలు. ఆయన భీమవరం టాకీస్ బ్యానర్లో ప్రస్తుతం ఇంకో 2 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. ఏ ఒకటో, రెండో సినిమాల్లో కొంచెం హెచ్చుతగ్గులు తప్ప ఆయనకు అసలు నష్టం అంటే ఏమిటో ఇప్పటివరకూ తెలియదు!
కట్ టూ హిజ్ సక్సెస్ సాగా -
ఎవరో ఏదో అనుకుంటారని సగం సగం పనులు చేయలేదాయన. తను అనుకున్న విధంగా సినిమా వ్యాపారం చేశారాయన. శాటిలైట్ రైట్స్ ఉన్నప్పుడు అందరూ ఆ రైట్స్‌ను దృష్టిలో పెట్టుకొనే సినిమాలను ప్లాన్ చేశారు. ఆయనా అదే చేశారు.
అయితే, ఎవరి బిజినెస్ స్టైల్ వారిది.
ఇక్కడో గొప్ప విషయం మనమంతా గమనించాలి. శాటిలైట్ రైట్స్ లేని ఈరోజుల్లో కూడా - కేవలం థియేటర్ బిజినెస్‌ను నమ్ముకొని, ఎలాంటి బ్రేక్ లేకుండా, రోజూ తన సినిమాల షూటింగ్ పనిలోనే బిజీగా ఉన్నారు రామసత్యనారాయణ.
దటీజ్ హిజ్ బిజినెస్ స్టైల్!
2004 లో సినీరంగప్రవేశం చేసిన రామసత్యనారాయణ - ప్రారంభంలో ఒక పెద్ద దెబ్బ తిన్నా వెనక్కి తగ్గలేదు. వెనుదిరిగిపోలేదు. "సినిమాతీయడానికి లక్షలు కాదు కావల్సింది, లక్ష్యం" అనుకున్నారు. కేవలం 12 ఏళ్లలో - నిర్మాతగా ఇప్పటివరకూ ఆయన తీసిన మొత్తం 78 సినిమాల్లో హిందీ, ఇంగ్లిష్, తమిళం, భోజ్‌పురి సినిమాలు కూడా ఉన్నాయి.
తన 73, 74 వ సినిమాలకు ఏకంగా జాతీయస్థాయిలో ఒక పారలల్ ఇండస్ట్రీని నడిపిస్తున్న రామ్‌గోపాల్‌వర్మ నే దర్శకునిగా తీసుకోగలిగే స్థాయికి రీచ్ అయ్యారు. ఆయనతో "ఐస్‌క్రీమ్", "ఐస్‌క్రీమ్2" సినిమాలు తీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు.
ఆర్ జి వి తో ఆయన తీస్తున్న "ఎటాక్", "స్పాట్" సినిమాలు ఇంకా ప్రొడక్షన్లో ఉన్నాయి.
కట్ చేస్తే -
ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్‌లు, సినిమా ఫంక్షన్లు, ఫిలిం న్యూస్‌లు, ఫేస్‌బుక్ .. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు.
రామసత్యనారాయణ.
మరి .. అప్పుడు 2006 లో, ఆరోజు, ఆయన మీద కామెంట్స్ చేసినవాళ్లంతా ఎక్కడున్నారో నాకు తెలుసు. ఆయన వైభవాన్ని చూస్తూ అక్కడే ఉన్నారు. కేరాఫ్ గణపతి కాంప్లెక్స్. లేదంటే క్రిష్ణానగర్ గల్లీలు!
ఒక సినిమాతీసి రిలీజ్ చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో - ఈ కొత్త సంవత్సరం 2016 లో, ఇప్పటికే, 10 మంది కొత్త దర్శకులతో 10 కొత్త సినిమాలు ఎనౌన్స్ చేశారు. వాటిలో 2 సినిమాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి.
ఇవి కాకుండా, 4 డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
ఆల్ ది బెస్ట్ రామసత్యనారాయణ! యూ రియల్లీ రాక్ ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani