దీని గురించి చెప్పాలంటే, మన ఫిలిం చాంబర్‌ల అత్యంత ఉన్నతస్థాయి మేధోవిత్వానికి సంబంధించిన పిట్ట కథ ఒకటి మీకు చెప్పాలి.
విషయం తెల్సుకున్న తర్వాత, ఆయా చాంబర్‌ల మేధోవిత్వానికి మీరు నవ్వుతారో, ఏడుస్తారో, తిడతారో, ఇంకేం చేస్తారో .. అది మీకే వదిలేస్తున్నాను.
స్విమ్మింగ్‌పూల్ సినిమాకు మేము ముందుగా అనుకున్న టైటిల్ "దేవి".
చాంబర్‌లో ముందే కనుక్కున్నాము. ఆ టైటిల్ ఫ్రీ గా ఉంది. రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నారు. మేం రిజిస్ట్రేషన్‌కు అప్ప్లై చేశాం.
కట్ టూ ది గ్రేట్ రూల్స్ ఆఫ్ ది చాంబర్ -
"శ్రీదేవి" అన్న టైటిల్ ముందే రిజిస్టర్ అయి ఉన్నందున, మీ టైటిల్ "దేవి" దానికి దగ్గరగా ఉన్నందున .. మీకీ టైటిల్ ఇవ్వటం లేదు .. అన్నారు ది గ్రేట్ చాంబర్ వారు!
అదండీ విషయం.
అంటే "రాజన్న" సినిమా తీశారు కాబట్టి, ""రామన్న" సినిమా టైటిల్ ఇవ్వరా? కామన్ సెన్స్!
కట్ టూ ఫ్లాష్‌బ్యాక్ -
సరిగ్గా పదేళ్ల క్రితం కూడా నాకిలాగే జరిగింది. "ఒక్కటి" అన్న టైటిల్ రిజిస్టర్‌కు పంపాను.
"ఒక్కడు", "అతనొక్కడే" టైటిల్స్ ఆల్రెడీ ఉన్నందున మీకు "ఒక్కటి" టైటిల్ ఇవ్వటం లేదు అని శలవిచ్చారు చాంబర్ వారు!
ఏమైనా అర్థముందా?
ఒక్కడు, అతనొక్కడే టైటిల్స్ ఒక వ్యక్తిని గురించి చెప్తాయి. "ఒక్కటి" అనేది ఒక ఒంకె. డిజిట్. ఎగైన్ కామన్ సెన్స్!
సో, ఇలా ఉంటాయన్నమాట చాంబర్ రూల్స్!
విచిత్రమేంటంటే, ఈ రూల్స్ పెద్ద హెరోలకు, పెద్ద డైరెక్టర్‌లకు, పెద్ద బ్యానర్లకూ అస్సలు వర్తించవు. వాళ్లు రిజిస్టర్ కాకుండానే టైటిల్ అనౌన్స్ చేసుకుంటారు. ఇంకొకరి పేరు మీద ఆ టైటిల్ రిజిస్టర్ అయి ఉన్నాసరే, అదే టైటిల్ తో వారు సినిమాలు తీసేసుకుంటారు. అవి రిలీజవుతాయి. పోతాయి. అది వేరే విషయం.
అక్కడ ఎలాంటి రూల్స్ అడ్డురావు.
నేను రాసి పెండింగ్‌లో పెట్టిన ఒక పుస్తకంలో ఇలాంటి మేధోవిత్వపు ఎపిసోడ్స్ చాలా రాశాను. అది మరి నేను ఎప్పుడు పబ్లిష్ చేస్తానో చూడాలి.
కట్ బ్యాక్ టూ మన టైటిల్ -
పైన చెప్పిన లాంటి పరిస్థితుల్లో .. విధిలేక, మనం మాత్రం వేరే టైటిల్ కి వెళ్లిపోతాం. అలా చివరి క్షణాల్లో మేము అనుకున్న టైటిలే ఈ "స్విమ్మింగ్‌పూల్!"
బట్ నో ప్రాబ్లమ్. అంతా మన మంచికే అన్నట్టు, ఈ టైటిల్ మాకు ఇంకా బాగా వర్కవుట్ అయ్యింది. అయ్యేలా చేసుకున్నాం.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani