Friday, 22 May 2015

భరత్‌కృష్ణ నవల

ఒక బెస్ట్ సెల్లర్ ఇంగ్లిష్ నవల జూన్‌లో ప్రపంచమంతా విడుదల కాబోతోంది. ఆ నవల పేరు తర్వాత చెప్తాను. ప్రస్తుతం ఆ నవలా రచయిత గురించే ఈ బ్లాగ్ పోస్ట్.

ఇది ఆ రచయిత రాసిన తొలి నవల. అయినా ముందే 'బెస్ట్ సెల్లర్' అని చెప్తున్నానంటే .. అది నా నమ్మకం. రేపు కాబోయే నిజం.

చెప్పాలంటే .. ఆ రైటర్‌కు నేను ఫ్యాన్‌ని!

కట్ టూ భరత్‌కృష్ణ - 

గుంటూరులోని ఓ కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలో అప్పట్లో ఓ రెండేళ్లు పనిచేశాన్నేను.

ఆ రెండేళ్లలో, నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థుల్లో కొందరు ఇప్పుడు ఐ ఎ యస్ లయ్యారు. ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లయ్యారు. మరెందరో మంచి బిజినెస్‌మేన్‌లయ్యారు. ఇంకెందరో రకరకాల ఫీల్డుల్లో, వివిధహోదాల్లో, విదేశాల్లో కూడా ఉన్నారు.

అప్పుడు, అలా నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థుల్లో కొందరితో నాకిప్పటికీ కమ్యూనికేషన్, అనుబంధం ఉంది. వాళ్లను నేను అభిమానిస్తాను. చెప్పాలంటే .. వారికి నేను ఫ్యాన్‌ని.

అదిగో, అలా .. నేను భరత్‌కృష్ణ ఫ్యాన్‌ని!

భరత్ గురించి నేనింతకుముందే ఒకసారి ఇదే బ్లాగ్‌లో "ఎవరు?" అంటూ పేరు చెప్పకుండా ప్రస్తావించాను.

భరత్ నవలను, దాని మాన్యుస్క్రిప్ట్ దశలోనే చదివిన క్రెడిట్, ఆనందం, గర్వం నాకున్నాయి. గర్వం ఎందుకంటే .. నేను చూస్తుండగా, నా కళ్లముందు ఎదిగిన నిలువెత్తు వ్యక్తిత్వం భరత్.

భరత్ ఈ నవల కాన్‌సెప్ట్‌ను అనుకున్న స్టేజ్ నుండి, దాన్ని రాయడం పూర్తిచేసేవరకు ప్రతి స్టేజ్ నాకు తెలుసు. చాలా తొందరగా రాయమని పోరుపెట్టింది నేనే. అది బయటికి రావడం ఆలస్యమౌతుంటే ఏమీ చేయలేక చూస్తుండిపోయిన సాక్షినికూడా నేనే.

నవల టాపిక్ ఏంటి, ఎలా ఉంటుంది, పేరేంటి .. అవన్నీ మీకు వెంటవెంటనే తెలిసేలా చేస్తాను. ఆ విషయం అలా పక్కనపెడితే - చాలా విచిత్రంగా - నా స్విమ్మింగ్‌పూల్ సినిమా, భరత్ నవల .. రెండూ .. దాదాపు ఒకే సమయంలో  రిలీజ్ అవుతున్నాయి.

ఇది మాత్రం నేను ఊహించని విశేషం! 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani