రెండ్రోజుల్లో "స్విమ్మింగ్‌పూల్" ప్రమోషనల్ సాంగ్ రెడీ అవుతోంది.
రికార్డింగ్ అయిపోయాక, దాన్ని వీడియో అవుట్‌పుత్‌తో ఎడిట్ చేసి, ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడానికి మరో నాలుగయిదు రోజులు పడుతుంది.
ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం అవసరమయిన కొన్ని షాట్స్‌లో ఒక కొత్త హీరోయిన్‌ను గానీ, ఆ స్థాయిలో ఉన్న ఓ మంచి మోడల్‌ను గానీ చూపించాలన్నది నా తాజా ఆలోచన.
కట్ టూ స్టార్ హంట్ -
విచిత్రంగా, షూటింగ్ తర్వాత చేస్తున్న ఈ స్టార్ హంట్ కోసం ఫేస్‌బుక్ లో నేనిచ్చిన చిన్న యాడ్‌కి కొన్ని అప్లికేషన్లు వచ్చాయిగాని అవి నేను ఊహించిన రేంజ్‌లో లేవు. నేను అనుకున్న విధంగా షూట్ చేయడానికి వారు సరిపోరు.
కొన్ని క్లోజప్ షాట్స్‌తోపాటు - మిడ్, ఫుల్ షాట్స్ లో కొన్ని వాకింగ్ షాట్స్ ఉంటాయి. అన్నీ కలిపి ఓ పది షాట్స్. కేవలం ఓ రెండు గంటల షూటింగ్.
ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియదుగాని, ఓవర్‌నైట్‌లో బాగా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది.
యు ఎస్, రుమేనియా, రష్యా, కెనడా, న్యూజీలాండ్, మారిషస్ లలో నాకు తెలిసిన యాక్టర్స్, మోడల్స్ కొందరున్నారు. అడిగితే - ఫ్రీగా అక్కడినుంచే షూట్ చేసి పంపిస్తారు. అవుట్‌పుట్ కూడా సూపర్ రిచ్‌గా వస్తుంది. కాని, మరింత ఆలస్యం అవుతుంది.
నిజానికి ముందు ఈ షాట్స్‌ని హీరోయిన్ ప్రియ వశిష్ట తోనే తీయాలనుకున్నాను. అది కుదిరేపనిలా అనిపించడంలేదిప్పుడు. ఆ ఆలోచన మానుకున్నాను కూడా.
మరెలా?
ఇంకో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. అప్పటిదాకా నాక్కొంచెం టెన్షన్. మీకు సస్పెన్స్.
అంతే.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani