దయ్యం 1:
ఈ దయ్యానికి ఎప్పుడూ డేట్స్ ప్రాబ్లం, ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం.
వచ్చేవరకూ వస్తుందా రాదా అని మా టెన్షన్. వచ్చాక తొందరగా ఎప్పుడు బయటపడిపోదామా అని తనవైపు టెన్షన్. మొత్తం తను నటించిన నాలుగయిదు రోజుల్లో - లాస్ట్ డే, లాస్ట్ షాట్ వరకూ పెద్ద టెన్షన్ మాకు.
కానీ బాగా నటించింది. ఆ ఒక్క యాంగిల్ చాలు. ఇది మంచి దయ్యం అని చెప్పడానికి.
నాకు కావల్సింది కూడా తెరమీద తను బాగా నటించడమే కాబట్టి, ఈ దయ్యం నిజంగా మంచి దయ్యమే.
దయ్యం 2:
హబ్బో.. ఈ దయ్యం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. మంచి ఎట్రాక్టివ్ స్మయిల్. ఆ చిరునవ్వు ఎంత అమాయకంగా ఉంటుందంటే - తను ఎంత లేట్‌గా వచ్చినా, దానివల్ల మాకు ఎంత టెన్షన్ అయినా .. అంతా ఇట్టే మర్చిపోతాం.
స్మయిల్ తర్వాత, ఈ దయ్యం విషయంలో చెప్పుకోవాల్సింది యాక్టింగ్.
సింగిల్ టేక్ ఆర్టిస్ట్!
పక్కవాళ్ల యాక్టింగ్‌లోనే ఏదయినా తేడారావాలి తప్ప తన విషయంలో రాదు. అంత మంచి నటి తనలో ఉంది. మా ప్రొఫెసర్ "ఆమె కళ్లల్లోనే ఉంది అంతా" అంటారు. మొన్న డబ్బింగ్ రోజు కూడా ఇద్దరూ కలిశారు. అప్పుడు కూడా ప్రొఫెసర్ ఇదే మాట!
సో, ఈ దయ్యం కూడా మంచి దయ్యమే అన్నమాట.
దయ్యం 3:
ఈ దయ్యం గురించి చెప్పాలంటే చాలా ఉంది. బండ దయ్యం. పైకి అలా కనిపిస్తుంది కానీ, పెద్ద డేర్‌డెవిల్.
ఈ దయ్యంతో మాట్లాడాలంటే ముందు శాటిలైట్‌కు కనెక్ట్ కావాలి. అదన్నమాట విషయం.
యాక్టింగ్ అంటే ప్రాణం. బుద్ధిగా డైలాగులూ అవీ బట్టీ పడుతుంది. ఎలా చెయ్యమంటే అలా చేస్తుంది. ఇంకా బాగా చేస్తుంది. కొన్ని క్యాజువల్ డైలాగుల విషయంలో అప్పుడప్పుడూ "ఇది ఇలా కూడా అనొచ్చుకద సర్?" అని అడుగుతుంది. తను చెప్పిన ఆ చిన్న ఇంప్రొవైజేషన్ బాగున్న ప్రతిసారీ ఓకే చెప్పాన్నేను.
ఒకటి రెండు సార్లు కంటిన్యుటీ విషయంలో తెలియక కేర్‌లెస్‌గా పప్పులో కాలేసింది. తర్వాత కంటిన్యుటీ ఏమిటో, ఎందుకో అర్థమయ్యాక అలాంటి పొరపాటు మళ్లీ చెయ్యలేదు.
సో, ఈ దయ్యం కూడా చాలా మంచి దయ్యమే.
కట్ టూ అసలు దయ్యం -
నాకున్న చనువుతో ముగ్గురినీ "దయ్యం" అని అలా సరదాకి అన్నాను గానీ, నిజానికి "స్విమ్మింగ్‌పూల్"లో
ఈ ముగ్గురిలో ఒక్కరే నిజంగా దయ్యం.
ఆ ఒక్కరు ఎవరన్నది మీకే తెలుస్తుంది. తెరమీద చూశాక.
అలాగే .. వీరిలో దయ్యం 1 ఎవరో, 2 ఎవరో, 3 ఎవరో కూడా మీరు అప్పుడే ఈజీగా గెస్ చేయగలుగుతారు. నవ్వుకుంటారు. ఎంజాయ్ చేస్తారు.
అప్పుడేం భయమనిపించలేదు గానీ, ఈ మూడు దయ్యాల్ని తలచుకుంటే ఇప్పుడు మాత్రం చాలా భయమేస్తోంది. మూడు దయ్యాల్నీ మధ్యలో పెట్టుకొని అంత కూల్‌గా షూటింగ్ ఎలా చేశానా అని!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani