లైబ్రరీ అండ్ ఇన్ ఫర్మేషన్
సైన్స్ లో నేను చదివిన
BLISc, MLISc రెండు కోర్సుల్లోనూ
టాప్ ర్యాంకర్ గా ఉస్మానియా యూనివర్సిటీ
నాకు రెండు గోల్డ్ మెడల్స్
ఇచ్చింది.
అయితే - అదే యూనివర్సిటీలో ఉద్యోగం కోసం నేను అటెండ్ అయిన రెండు ఇంటర్వ్యూల్లోనూ ఆ యూనివర్సిటీ నన్ను సెలక్టు చేయలేదు!
అయితే - అదే యూనివర్సిటీలో ఉద్యోగం కోసం నేను అటెండ్ అయిన రెండు ఇంటర్వ్యూల్లోనూ ఆ యూనివర్సిటీ నన్ను సెలక్టు చేయలేదు!
అలాగని,
నేనేం ఇంటర్వ్యూ బాగా చేయలేదని కాదు.
అప్పటి యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్
తో సహా - ఇంటర్వ్యూ చేసిన బోర్డు మెంబర్లు
కనీసం ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా
నన్ను అడగ లేదు! నా
సర్టిఫికేట్స్ చూసి "వెరీ గుడ్” అని
పంపించేశారు. ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు.
నేను
చదివిన యూనివర్సిటీ - నాకు ఇచ్చిన గోల్డ్
మెడల్స్ కు ఇచ్చిన విలువ
అది!!
ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి ..
ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి ..
యూనివర్సిటీ
లైబ్రరీలో ఉద్యోగాలకోసం ఆ సమయంలో జరిగిన
రెండు ఇంటర్వ్యూల్లోనూ - ఎవరికి ఉద్యోగం వస్తుందన్నది - నాకూ, ఇంటర్వ్యూకి అటెండ్
అయిన మరికొందరికీ ముందే తెలిసింది. ఇంకా
చెప్పాలంటే - స్వయంగా ఆ అభ్యర్థులే చెప్పారు
.. "ఈ జాబ్ నాకే వస్తుంది"
అని!
అలాగే - నాకు "రాదు" అని కూడా వాళ్లే చెప్పారు. తర్వాత అలాగే జరిగింది ..
అయితే - అలా చెప్పింది కూడా మరెవరో కాదు .. స్వయంగా నా క్లాస్ మేట్స్. వాళ్లళ్లో - ఒకరు ‘పాస్’ కావటానికీ, మరొకరికి మంచి మార్కులు రావటానికీ నేనే కారణం కావటం కొసమెరుపు!

ఆ
తర్వాత, జీవితంలో నేనెప్పుడూ ఏ యూనివర్సిటీ ఉద్యోగానికీ
కనీసం అప్ప్లై కూడా చేయలేదు ..
అయినా ..
నేను చదివిన నా ఉస్మానియా యూనివర్సిటీ అంటే నాకు ఎప్పుడూ ప్రేమే.
అయినా ..
నేను చదివిన నా ఉస్మానియా యూనివర్సిటీ అంటే నాకు ఎప్పుడూ ప్రేమే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani