Friday, 21 September 2012

అంత సీన్లేదు!

ఇవాళ సుమారు ఒక అర డజను సినిమాలు మన దగ్గర రిలీజ్  అయ్యాయి. వాటిలో నాకు తెలిసిన ఒక చిన్న హీరో సినిమా కూడా రిలీజ్ అయ్యింది. నా దృష్టిలో - ఇప్పటికే ఒక రేంజ్ లో ఉండాల్సిన హీరో అతను. కానీ, యెందుకో అక్కడికి రీచ్  అవలేకపోయాడు.

ఈ రోజు  విడుదలైన  తన చిత్రం మీద ఆ హీరో కి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ - ఆ చిత్ర దర్శకునికి  మాత్రం చాలా ఆశలున్నాయి. సారీ, 'ఆశలుండేవి’ అనాలేమో ఇప్పుడు! 

తన సినిమా ఆడియో ఫంక్షన్ లో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడాడు ఆ దర్శక మిత్రుడు. "ఈ చిత్రం సక్సెస్ అవక పోతే, నేనింక భవిష్యత్తులో ఈ హీరో దగ్గరికీ కథ చెప్పడానికి వెళ్లను" అన్నాడు.

ఒక వెరీ ట్రిక్కీ టైటిల్ తో - తెలుగులో ఆల్రెడీ ఒక హిట్ చిత్రం ఇచ్చిన రికార్డ్ ఆయనకుంది. ఇది మంచి కామెడీ సినిమా. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా సినిమా ఎక్కడికో పోతుంది. కానీ, పరిస్థితి చూస్తోంటే, ఆ దర్శక మిత్రుడి ఆశలు ఫలించే ఏ సూచనలు మాత్రం కనిపించడం లేదు.

కారణం - ఆ సినిమా నేను ఊహించని స్థాయిలో  - అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది!  

"మా చిన్న సినిమాల వాళ్లకి థియేటర్లు అసలు దొరకటం లేదు!" అని ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా నిన్న రాత్రి ఒక టీవీ చానెల్ లో హీరో చెప్పాడు.

నా అమాయకపు ప్రశ్న  ఏంటంటే - మరో అరడజను సినిమాల రిలీజ్ ఉన్న ఈ రోజునే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏంటి? లాభం ఏంటి?  కొంచెం గ్యాప్ చూసుకొని రిలీజ్ చెయ్యొచ్చుగా! ఎంతో కాలం ఆగి, ఇంత హడావిడిగా రిలీజ్ చెయటానికి ఉసిగొల్పిన ఆ కారణం ఏంటి? 

కోరి ఫెయిల్యూర్ కొని తెచ్చుకోవటం తప్ప - నాకయితే మరొక కారణం కనిపించటం లేదు. బట్,  ఐ స్టిల్ విష్ ద డైరెక్టర్,  అండ్ హీరో  ఎ  థంపింగ్ సక్సెస్!

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani