"2020లో
ఏ సోషల్ నెట్ వర్క్
బాగా పాప్యులర్ అయి ఉంటుంది?"
ఈ
రోజు ఉదయం - ఒక వెబ్ సైట్
లో ఈ ఆసక్తికరమైన ప్రశ్న
కనిపించింది నాకు. జవాబు కోసం
గూగుల్ లో సెర్చ్ చేశాను
వెంటనే. చాలా మంది చాలా
చాలా చెప్పారు. వాటన్నిటి సారాంశం ఏంటంటే - ఫేస్ బుక్ (FB)
ని బీట్ చేసే వెబ్
సైట్ లు చాలా చాలా
వస్తాయని. అట్ లీస్ట్ - ఒక
కొత్త వెబ్ సైట్ ఏదో
వస్తుందని.
కాని,
నా ఉద్దేశ్యంలో -
"2020 నాటికి
కూడా FB నే అతి
పెద్ద పాప్యులర్ సోషల్ నెట్ వర్క్
గా, ప్రపంచంలో తన టాప్ పొజిషన్ను
కంటిన్యూ చేస్తూ ఉంటుంది!"
ఇలా చెప్పగలగటానికి నా దగ్గర 100 కారణాలున్నాయి. ఉదాహరణకు కొన్ని:
> ఫేస్
బుక్ కు ఇప్పుడు బిలియన్ యూజర్స్ ఉన్నారు. అంటే - 1 తర్వాత 9 సున్నాలు .. లేదా 100 కోట్లు!
(‘మై స్పేస్’ కనుమరుగు కావటానికి ముందు దాని యూజర్లు 100 మిలియన్లు మత్రమే.)
(‘మై స్పేస్’ కనుమరుగు కావటానికి ముందు దాని యూజర్లు 100 మిలియన్లు మత్రమే.)
> చిన్న-పెద్దా, బీద-ధనిక అనే
భేదం లేకుండా - ఈ భూమి మీదున్న
ప్రతి దేశం లోనూ FB
ఉంది.
> ఏ
ఇతర వెబ్ సైట్ తో పోల్చిచూసినా - కనీసం 100 రెట్లు
అధికంగా FB ని ఉపయోగిస్తున్నారు
జనం.
> 'యువర్ హోం పేజ్' అనే కాన్సెప్ట్ ఇప్పుడు 'యువర్ ఫేస్ బుక్ పేజ్' అయిపోయింది!
> ప్రపంచపు అతి పెద్ద డేటింగ్ సైట్ కూడా ఇదే.
> 'యువర్ హోం పేజ్' అనే కాన్సెప్ట్ ఇప్పుడు 'యువర్ ఫేస్ బుక్ పేజ్' అయిపోయింది!
> ప్రపంచపు అతి పెద్ద డేటింగ్ సైట్ కూడా ఇదే.
> ప్రపంచంలో అత్యధిక ఫోటో షేరింగ్
కూడా ఈ సైట్ మీదే
జరుగుతుంది.
> ప్రపంచపు
అతి పెద్ద గేమింగ్ సైట్
కూడా ఫేస్ బుక్కే.
> నేను
దాదాపు ప్రతి రోజూ FB
ని ఉపయోగిస్తున్నాను.
> నా
15, 13 ఏళ్ల ఇద్దరు అబ్బాయిలు కూడా FB ని
రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారు.
> నేనూ,
మా అబ్బాయిలిద్దరూ FB ని 'ఎలా' ఉపయోగిస్తున్నామా
అని .. ఓ కంట కనిపెట్టడం
కోసమయినా, FB ని రెగ్యులర్ గా
విజిట్ చేస్తుంది నా శ్రీమతి.
> నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ FB ని ఉపయోగిస్తున్నారు, లేదా - కనీసం - FB లోకి ఏదో విధంగా 'ఎంటర్' అవుతున్నారు! (తాతమ్మలు, అమ్మమ్మలతో సహా!)
> నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ FB ని ఉపయోగిస్తున్నారు, లేదా - కనీసం - FB లోకి ఏదో విధంగా 'ఎంటర్' అవుతున్నారు! (తాతమ్మలు, అమ్మమ్మలతో సహా!)
సో
.. ఇప్పటికీ, 2020 నాటికి మధ్య .. FB లో ఇంకా
ఊహించని డెవలప్మెంట్స్ చాలా చాలా వస్తాయి.
వాటి గురించి మరొకసారి కలుద్దాం. 2020 నాటికి, ఆక్సిజన్ లేకుండానయినా జనం బ్రతగ్గలరేమో గానీ,
FB లేకుండా మాత్రం బ్రతకలేరనిపిస్తుంది. కొంచెం అతిశయోక్తిగానే చెప్పాన్నేను. కానీ, 2020 నాటికి FB ఆ రేంజ్
లో ఉంటుందని నా గట్టి నమ్మకం!
***
PS: ఫేస్ బుక్ ని రూపొందించిన మార్క్ జుకేర్బర్గ్ సామర్ఢ్యం గురించి మరోసారి మాట్లాడుకుందాం.
అన్నట్టు - మొన్నటి .. మే 14 కి .. అతని వయస్సు 28 ఏళ్లు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani