Sunday, 31 August 2025

మనుషులు మారొచ్చు, కాని...


బురదలోకి దిగిన తర్వాత, బురద అంటింది అని ఫీల్ అవ్వటం వృధా. వాడు తోశాడు, వీడు అంటించాడు అని అనుకోవడం కూడా శుద్ధ దండగ. 

కారణం ఎవ్వరైనా, ఎంతమందైనా, నిర్ణయం మనది అయినప్పుడు భారాన్ని మన భుజాలమీదకే ఎత్తుకోగల సత్తా మనకుండాలి.   

రెస్పానిసిబిలిటీ తీసుకోవాలి. అంటిన బురద కడిగేసుకొని బయటపడాలి. 

కట్ చేస్తే -

కొంతమంది ఎందుకంత ఖచ్చితంగా ఉంటారో, ఎందుకంత కఠినంగా మాట్లాడగలుగుతారో కొంచెం లేటుగా అర్థమవుతుంది.

ముఖ్యంగా రిలేషన్‌షిప్స్ విషయంలో, మనీ విషయంలో ఖచ్చితంగానే ఉండాలి. అలా లేనప్పుడు, మన కారణంగా ఇంకొకరెవరో బాధపడ్డానికి మనం కారణమవుతాం. 

కట్ చేస్తే -

మనుషులు మారొచ్చు. కాని, ఆ మార్పు పాజిటివ్ కోణంలో జరిగినప్పుడు సంతోషంగా ఉంటుంది.    

Not everyone will remain the same as they were with us on day one. People change. But principles should never change. 

- మనోహర్ చిమ్మని 

Friday, 29 August 2025

Begin Where You Are, Win With What You Have


So many of us keep waiting for the “perfect moment” to start. We imagine that someday, someone will support us, guide us, or give us the opportunity we need. But the truth is simple: the most powerful support you’ll ever have is your own guts.

You don’t need outside approval. You don’t need imaginary backing. What you need is the courage to begin — right here, right now.

Every step forward creates its own momentum. Every small win fuels the bigger victory. And the beauty is this: no matter your age, your past, or your circumstances, you can start your journey from this very point in life.

Great warriors are not remembered for the resources they had, but for the spirit they carried. The same is true for you. The war you’re fighting — whether it’s for your career, health, art, or dreams — can be won with the strength you already hold inside.

So stop waiting. Stop depending. The battlefield is open, and your victory begins the moment you decide to step forward.

Four reminders to carry with you: 

1. “The best time to begin your battle is now. Victory doesn’t wait for outside support — it answers only to your courage.”
2. “Every moment is a starting line. Begin where you stand, fight with your own guts, and the world will make way for your win.”
3. “Your strength is not in borrowed hands but in your own resolve. Start today, from this very step, and conquer with ease.”
4. “No outside savior can fight your war. Trust your grit, begin from here, and watch how life bends to your will.”

Your journey begins now.
Not tomorrow.
Not someday.
Now.

- Manohar Chimmani 

Friday, 22 August 2025

విషయం ఎప్పుడూ సినిమానో ఇంకొకటో కాదు...


దిలీప్ మంచి ఆర్టిస్టు, స్క్రిప్ట్ రైటర్ కూడా. నేను గుంటూరులో పనిచేసినప్పుడు, మా జవహర్ నవోదయ విద్యాలయ గుంటూరు విద్యార్థి. హైద్రాబాద్‌లో కూడా నన్ను తరచూ కలిసేవాడు, నాతో చాలా క్లోజ్‌గా తిరిగాడు కూడా. 

అప్పట్లో నవనీత్ కౌర్‌తో ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చాల భారీస్థాయిలో, చాలా బాగా చేశాడు. 

నవనీత్ కౌర్, రాజీవ్ కనకాల హీరోహీరోయిన్స్‌గా ఒక సినిమా చేస్తున్నప్పుడు, నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోలో, నవనీత్ కౌర్ హీరోయిన్‌గా ఒక సినిమా ప్లాన్ చేస్తూ ఆమెతో చర్చించిన విషయం నాకు తెలుసు. అప్పుడు వాడికి ఒక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. కాని, అదెందుకో ముందుకు కదల్లేదు. 

అప్పట్లో లీడ్‌లో ఉన్న ఒక డైరెక్టర్‌కు దిలీప్ స్క్రిప్టు విషయంలో బాగా హెల్ప్ చేస్తుండేవాడు. "స్టోరీబోర్డుతో సహా స్క్రిప్టులు కూడా ఇచ్చా" అని చెప్పాడు నాతో. 


నవనీత్ కౌర్‌తో కూడా సినిమా చెయ్యాలని టచ్‌లో ఉండేవాడు. ఎలాగైనా చేస్తా అని నాతో చాలాసార్లు చెప్పాడు దిలీప్. 

నిజంగా హైలీ టాలెంటెడ్. జస్ట్ ఒక మోకా... ఒక్క చాన్స్ కోసం ఎదురుచూస్తుండేవాడు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తుండేవాడు.    

కట్ చేస్తే - 

నవనీత్ కౌర్ సినిమాలు తనకు సెట్ కాదు అనుకుంది. నిర్ణయం మార్చుకుంది. చూస్తుండగానే మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, ఎం పి అయింది. పార్లమెంట్‌లో తన స్పీచెస్‌తో దడదడలాడించింది.    


మరోవైపు తాగుడుకి బాగా అడిక్ట్ అయ్యాడు దిలీప్. ఆరోగ్యం బాగా దెబ్బతింది. దాదాపు దశాబ్దం క్రితం ఇదేరోజు చనిపోయాడు. వాడిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చాలా బాధనిపిస్తుంది.  

విషయం ఎప్పుడూ సినిమానో ఇంకొకటో కాదు. మనం. మన నిర్ణయాలు. 

Every decision we make builds the story of who we are—and every decision we avoid writes the story of who we could have been. 

- మనోహర్ చిమ్మని 

Tuesday, 19 August 2025

అన్నీ అనుకున్నట్టు జరిగితే మనం దేవుళ్లమవుతాం


"చాలా జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేశాం. ఏదీ మిస్ అయ్యే చాన్స్ లేదు" అనుకుంటాం. 

"మన ఊహకందని ఏదైనా కారణంతో ఒకవేళ మిస్ అయితే, పవర్‌ఫుల్ 'ప్లాన్ బి' మనకుంది" అనుకుంటాం. 

కాని, మిస్ అవుతుంది. 

దటీజ్ లైఫ్.  

మోస్ట్ స్ట్రాటెజిక్ ప్లాన్స్ కూడా మిస్ అవుతుంటాయి. ఇదేదో అంత బుర్రలేని మామూలు మనుషుల విషయంలో కాదు. ఏ ఒక్క ఫీల్డులోనో కాదు. ఎంతో అనుభవం ఉన్న అతిరథమహారథులకు కూడా తరచూ ఇలా జరుగుతుంటుంది. అన్ని రంగాల్లో, అన్నిచోట్లా జరుగుతుంటుంది. 

అన్నీ అనుకున్నట్టు జరిగితే మనం దేవుళ్లమవుతాం. కాదు కదా.

కట్ చేస్తే -     

వచ్చే చిక్కల్లా "కవరప్" దగ్గర. మనల్ని మనం సమర్థించుకోడానికి పడే పాట్ల దగ్గర. 

అదంత అవసరం లేదు. నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మనివాళ్లని మనం అసలు నమ్మించలేం.

రియాలిటీని ఒప్పుకొని ముందుకే నడవాలి తప్ప, ఎంతసేపూ ఉన్నచోటే ఉండిపోవటం అన్నది సమయానికి మనం ఇచ్చే విలువ విషయంలో ఒక పెద్ద నేరం అవుతుంది. దీన్ని ఎన్నటికీ సరిచేసుకోలేం. 

కాలం వెనక్కి రాదు కాబట్టి.    

Don’t invest in the cover up. After you make a strategic error, announce it. Own it. And then move on. 

- మనోహర్ చిమ్మని 

నా “సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం”


"చిత్రానువాదకుడు డార్లింగ్ స్వామి గారు అనువాదం చేసిన సుజాత రంగరాజన్ గారు రచించిన “స్క్రీన్ ప్లే“ పుస్తకం crisp గా ఆసక్తికరంగా content అందిస్తుంది. flow, రీడబిలిటీ ఉన్న ప్రాక్టికల్ పుస్తకం. కొత్తగా స్క్రీన్ ప్లే  ను అవగాహన చేసుకోడానికి, రాయడానికి ఉపయోగపడే పుస్తకం. అంతా ఒక ఎత్తు… చివర్లో డార్లింగ్ స్వామి గారి తుదిపలుకులు ఒక ఎత్తు. 'ఈ భూమ్మీద మనం శాశ్వతం కాదు, మన డబ్బు శాశ్వతం కాదు, కానీ మన అలోచనలే శాశ్వతం. వాటితో ఒక మంచి సినిమా తీయండి. అది ఎంత అద్భుతంగా ఉంటే రాబోయే తరాల వారు మనల్ని అంతలా గుర్తుపెట్టుకుంటారు, రిఫరెన్స్ గా మన సినిమా చూస్తారు' అని రాశారు .  

ఈ  సమయం లో Manohar Chimmani గారి “సినిమా స్క్రిప్ట్ రచనా శిల్పం “ పుస్తకం గుర్తొచ్చింది. ఇప్పుడైతే online లో order పెడితే ఏ భాష పుస్తకమైనా మరుసటి రోజు కి మన చేతికి వస్తుంది . 90’లలో అలా కాదు. అలాటి రోజులలో  మా  జూనియర్ Srikanth Reddy Gajulapalli (స్పీల్బర్గ్  శ్రీకాంత్) దగ్గర  అరువు తీసుకుని చదివి... xerox తీసుకుని పెట్టుకొన్న పుస్తకం. అప్పట్లో చాలా బాగా  నచ్చింది.

తర్వాత రోజుల్లో  హైదరాద్ వచ్చాక అన్ని లైబ్రరీలు తిరిగి  film making పై చాలా పుస్తకాలు చదివాను. NAARM library లో గంటలు గంటలు చదివేవాడిని. Walden లో చాలా పుస్తకాలు కొన్నాను. వీటితో పాటు  Kiran Indraganti gari అనల్ప బుక్ హౌస్ లో “shot by shot “, “Five C s of Cinematography “ వంటి పుస్తకాలు కొనుక్కున్న జ్ఞాపకం. “చిరిగిన చెడ్డి అన్నా తొడుక్కో, Syd field పుస్తకాలు కొనుక్కో" అనే నినాదంతో ఆ విధంగా ముందుకు వెళ్ళేవాళ్ళం.

వీటితో పాటు నేను Srinivas Tentu చాలా books share చేసుకునే వాళ్ళం. ఆ time లోనే పరచూరి గారు కూడా ఈ subject పై ఆయన thesis ని book గా publish చేసారు(తెలుగు సినిమా సాహిత్యం కథ కథనం శిల్పం). “Save the cat” - if I am not wrong, నవతరంగ్ blog లో ఆర్టికల్ చూసి చదివాను. ఈ మధ్య  భాగ్యరాజా Decoded...


ఎన్ని పుస్తకాలు చదివినా, మొదట చదివిన చిమ్మని మనోహర్ గారి పుస్తకమే ఆసక్తి కి పునాది. ఆ book ఒరిజినల్ కోసం ఎంత try చేసినా దొరకలేదు. Xerox మాత్రం అలాగే ఉంది 😀.

చదివిన screenplay లు “ఎందుకు late అయ్యిందంటే “  అని భార్య కి, లీవ్ కోసం Boss లకి కథలు చెప్పడానికి ఉపయోగ పడ్డాయి 😂."


- M S Rahul
7 August 2025, Facebook.


కట్ చేస్తే - 

ఆంధ్రభూమి, స్వాతి, అంధ్రజ్యోతి వీక్లీలు, సండే 'ఉదయం', సండే 'ఆంధ్రప్రభ', విపుల వంటి పత్రికలకు నా యూనివర్సిటీరోజుల నుంచి నేను కథలూ, ఆర్టికిల్సూ రాసేవాడిని.  

తర్వాత, నేను ఆలిండియా రేడియో (కర్నూలు) లో పనిచేస్తున్నప్పుడు, అనుకోకుండా స్క్రిప్ట్ రైటర్ అయ్యాను. అదో పెద్ద కథ. తర్వాత, ఘోస్ట్ స్క్రిప్ట్ రైటర్‌గా అప్పట్లో కొంతమంది ప్రముఖ దర్శకులకు, కొందరు వర్ధమాన దర్శకులకు పనిచేశాను. ఆ అనుభవం నేపథ్యంగా, అప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్క్రిప్ట్ రైటింగ్ పైన, నేనొక పుస్తకం రాశాను. అప్పటివరకు ఈ సబ్జక్టు పైన తెలుగులో పుస్తకాలు లేవని చెప్పారు.     

అదే "సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం". 

అప్పట్లో అదొక బెస్ట్ సెల్లర్ పుస్తకం. ఫస్ట్ ప్రింట్ తర్వాత, రెండు ప్రింట్లు వేశాను. హాట్‌కేక్స్‌లా మొత్తం 5 వేల కాపీలు "సోల్డ్ అవుట్" అయిపోయాయి. 

తర్వాత మళ్ళీ అనుకోకుండానే నేను డైరెక్టర్ అయ్యాను. రెండు సినిమాలు చేశాను. ఆ రెండు సినిమాల అనుభవాన్ని కూడా చేర్చి, పుస్తకం కొంత రివైజ్ చేసి ప్రింట్ చేద్దామనుకొన్నాను అప్పట్లో.

కాని, నా రెగ్యులర్ ఉద్యోగం, ఇతర క్రియేటివ్ వ్యాపకాలు, కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల మొత్తానికి ఆ పని అలా అలా పెండింగ్‌లో పడిపోయింది.   

విశాలాంధ్ర, నవోదయ వాళ్లు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నేను ఈ పుస్తకం రీప్రింట్ చెయ్యలేకపోయాను.

ఈ పుస్తకాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రముఖ ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు వాళ్ల స్టుడెంట్స్‌కు సిలబస్‌లో భాగంగా ఇచ్చేవారు. కాపీలు మార్కెట్లో దొరక్క, ఫిలిం నగర్‌లోని ఒక జిరాక్స్ సెంటర్లో ఈ పుస్తకం జిరాక్స్ కాపీలు స్పైరల్ బైండ్ చేసి అమ్ముతున్నట్టు విని నేనొకసారి అక్కడికి వెళ్ళాను. అనామకుడుగా నేనూ ఒక కాపీ కొనుక్కున్నాను. అదొక విచిత్రమైన ఫీలింగ్. తర్వాత, కర్నూల్లో చంద్రశేఖర్ అనే మిత్రుడు, యువ రచయిత నాదగ్గరున్న ఆ కాపీ కూడా తీసుకున్నాడు.   

కట్ చేస్తే – 

“సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం” పుస్తకం 'Best Book On Films' కేటగిరీలో నాకు నంది అవార్డు సాధించిపెట్టింది.

అప్పటికే నేను రాసిన “ఆధునిక జర్నలిజం” పుస్తకం, కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మే స్థాయిలో రిఫరెన్స్ బుక్స్ లిస్ట్‌లో ఉంది. ఈ విషయం, అదే యూనివర్సిటీలో నేను PhD ఇంటవ్యూకెళ్ళినప్పుడు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రొఫెసర్లు ఆ ఇంటర్వ్యూలో నాకు చెప్పడం విశేషం. 

నేను రాసి, పబ్లిష్ చేసి, బాగా గుర్తింపు తెచ్చుకొన్న నా ఈ మొదటి రెండు పుస్తకాలు చాలా కాలంగా మార్కెట్లో లేవు. పుస్తకం కోసం ఎంతోమంది నుంచి నాకు డైరెక్టుగా మెసేజెస్, కాల్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. కర్టెసీ – సోషల్ మీడియా! 

నవోదయ అధినేతలు, విశాలాంధ్ర వాళ్ళయితే ఇంక నాకు చెప్పడం మానేశారు.

Thanks to M. S. Rahul for remembering my book, and special thanks to my music director Pradeep Chandra, who called me yesterday after seeing this post on Facebook.  

త్వరలో ఈ 2 పుస్తకాలు నేను రీప్రింట్ చేస్తున్నాను. మిత్రుడు గుడిపాటితో చర్చించి, వెంటనే ఎవరైనా పబ్లిషర్స్‌కు రైట్స్ కూడా ఇచ్చేస్తున్నాను. 

Life isn’t about perfect decisions—it’s about fast, inspired ones. If it fails, reset, decide again, and keep moving.

- మనోహర్ చిమ్మని 

Sunday, 17 August 2025

అసలా ఆలోచనే ఎంత హాయిగా ఉంది!


నేను నా మొదటి సినిమా చేస్తున్న కొత్తలోనో, ఆ తర్వాత కొన్నిరోజులకో, సరిగ్గా గుర్తులేదు. ఒకరోజు సాయంత్రం మా ఎమ్మే క్లాస్‌మేట్ యాకూబ్ (కవి యాకూబ్) ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగింది. 

అది - దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలో ఉన్న మారుతీనగర్‌.

మా ఎమ్మే మిత్రులందరం వెళ్ళాం. డాబా మీద మా మిత్రుల కోసం ఫార్మల్‌గా మా యాకూబ్ మందు కార్యక్రమం కూడా పెట్టాడు. 

రెండు పెగ్గులూ, నాలుగు సిగరెట్లుగా పార్టీ మంచి ఊపులో ఉన్న ఆ సమయంలో ఇంకో ఆత్మీయ మిత్రుడు పైకి వచ్చాడు. 

ఆర్జీవీ ప్రారంభకాలపు సినిమాల్లో చాలావాటికి పబ్లిసిటీ డిజైనర్ అతనే. 

మాటల మధ్యలో ఆయన నోటి నుంచి ఒక మాట విన్నాను... 

"ఫీల్డు వదిలేశాక లైఫ్ చాలా హాయిగా ఉంది... నేనూ, నా ఆర్ట్, నా లోకం, నా నిర్ణయాలు, నా ఇష్టం. ఇంతకంటే ఏం కావాలి మనోహర్?" అన్నాడు.  

ఆ రాత్రి, ఆ డాబా మీద, అంతమంది మిత్రుల మధ్యలో నాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన ఆమాట నాకెందుకు ఇప్పటివరకూ అంత స్పష్టంగా గుర్తుందో నాకిప్పుడు అర్థమవుతోంది. 

ఆ ఆనందం నిజంగా వేరే. 

కట్ చేస్తే -

ఆ రాత్రి నాతో అంత మంచి మాట చెప్పిన ఆ మిత్రుడు... ప్రముఖ అంతర్జాతీయస్థాయి చిత్రకారుడు, తెలంగాణ రాష్ట్ర రాజముద్ర రూపశిల్పి - లక్ష్మణ్ ఏలే. 

బై ది వే, నేను నంది అవార్డ్ పొందిన నా "సినిమా స్క్రిప్ట్ రచనాశిల్పం" పుస్తకానికి కవర్ డిజైన్ చేసింది కూడా లక్ష్మణ్ ఏలేనే!  

When you realize a passionate decision was wrong, drop the ego, drop the temptations, and correct it immediately. Otherwise, you’ll lose not just time and money, but the most precious part of your life. 

- మనోహర్ చిమ్మని 

Friday, 15 August 2025

కొత్త అధ్యాయంలోకి...


కొన్నిటికి గుడ్ బై చెప్పాక లైఫ్ కూల్‌గా ఉంది. 

నాకు మాట్లాడ్దమే ఇష్టం లేని మనుషులతో ఇప్పుడు మాట్లాడే అవసరం లేదు. నాకు ఇష్టం లేకున్నా ఇష్టం కల్పించుకుంటూ మాట్లాడే అవసరం అంతకన్నా లేదు. 

కొన్ని కమిట్మెంట్సు, కొంత పని పూర్తిచెయ్యాల్సి ఉంది. అవి కూడా ఎంత ఫాస్ట్‌గా పూర్తిచెయ్యాలా అనే చూస్తున్నాను. 

నో బ్లేమ్ గేమ్స్. 
నథింగ్. 
వర్కవుట్ కాలేదు అనుకోవాలి అంతే. 

ఒక డజన్ మంది నిర్ణయాలు నా పనిని, ఫలితాన్ని, నా జీవనశైలినీ, జీవితాన్నీ అల్లకల్లోలంగా ప్రభావితం చేస్తున్న చోట, నేను నా వ్యక్తిత్వాన్ని ఇంకా ఇంకా చంపుకొంటూ కొనసాగటం అనేది అర్థం లేని పని.  

సో, పూర్తిస్థాయిలో ఇందులో పనిచేయలేను అనుకున్నప్పుడు గుడ్-బై చెప్పడమే బెటర్.  

పైన చెప్పినట్టు... కొన్ని కమిట్మెంట్సు, కొంత పని పూర్తిచెయ్యాల్సి ఉంది. డెలిగేట్ చెయ్యాల్సినచోట డెలిగేట్ చేస్తూ, వాటిని కూడా చాలా వేగంగా పూర్తిచేయబోతున్నాను. 

కట్ చేస్తే -

ఇక మీదట ఎక్కువ సమయం - నాకిష్టమైన రైటింగ్‌కే. నాకిష్టమైన వ్యక్తులకే. 

మాసివ్ రైటింగ్.
ప్రొఫెషనల్ రైటింగ్. 

ఎక్కువ సమయం అమెరికాలో గడపాలనుకుంటున్నాను. బహుశా, ఈ న్యూ ఇయర్ అమెరికాలోనే.  

Life is short, but it’s wide — fill every inch of it with what truly matters.

- మనోహర్ చిమ్మని  

Thursday, 14 August 2025

నీకేం కావాలో నిర్వచించుకో


సమయం తీసుకో.
ఇప్పుడే.
నీకేం కావాలో నిర్వచించుకో.

ఇంకాస్త సమయం తీసుకో.
ఇప్పుడయినా స్పష్టంగా తెలుసుకో.
నువ్వు కావాలనుకుంటున్న ఫ్రీడమ్ -
నీకెందుకు కావాలో.

అప్పుడు మాత్రమే -
నువ్వేం చేయాలో తెలుస్తుంది.
డూ ఆర్ డై...
చేస్తావో చస్తావో నీ ఇష్టం.
మిగిలిందంతా ఉట్టి బుల్‌షిట్!

- మనోహర్ చిమ్మని 

Wednesday, 13 August 2025

ఆగిపోతే అది ప్రవాహం కాదు


ఒక సుదీర్ఘ అధ్యాయానికి సంపూర్ణంగా తెర దించేశాను.

ఒకటీ అరా కమిట్మెంట్లు, ఒప్పుకొన్న రెండు ప్రాజెక్టుల్ని వీలైనంత త్వరగా పూర్తిచేయడం/చేయించడం ఒక్కటే మిగిలింది. దాని ట్రాక్‌లో అది ఎలాగూ అయిపోతుంది. 

కట్ చేస్తే - 

జీవితం డల్‌గా ఉండకూడదు...కారణం ఏదైనా కానీ. 

ఒక ప్రవాహంలా ఎప్పుడూ జుమ్మంటూ సాగిపోతూ ఉండాలి. దారిలో ఎన్నెన్నో రాళ్ళూరప్పలూ తగుల్తుంటాయి. ప్రవాహం ఆగదు. వాటి పక్కనుంచో, వాటిని ఎగిరి దూకేస్తూనో ప్రవహిస్తూనే ఉంటుంది. ఎక్కడా చతికిలపడదు. ఆగిపోదు. ఆగిపోతే అది ప్రవాహం కాదు.

జీవితం కూడా అంతే. ఒక ప్రవాహంలా సాగిపోతుండాలి తప్ప, ఎక్కడా ఆగిపోవద్దు. నిశ్చేతనంగా నిలబడిపోవద్దు. 

మన వెంటపడినా మనం వద్దనుకున్నవి, మనకు ఆనందాన్నిచ్చినా మనం పట్టించుకోనివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు దేన్నీ వదలొద్దు.   

జీవితం చాలా చిన్నది. దాన్ని వృధా చేయడమంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. 

Live life to the fullest—love deeply, laugh often, explore endlessly, and leave no room for regrets.

- మనోహర్ చిమ్మని  

Friday, 8 August 2025

బిల్డప్పులు తక్కువ, కంటెంట్ ఎక్కువ... అదే మలయాళం సినిమా!


మలయాళం సినిమా అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది నా హైస్కూలు రోజులు. అప్పట్లో మా వరంగల్ రామా టాకీస్‌లో, నవీన్ టాకీస్‌లో, కాకతీయ 35 ఎం ఎంలో మలయాళం డబ్బింగ్ సినిమాలు మార్నింగ్ షోలు పడేవి.

"ఆమె మధుర రాత్రులు", "సత్రంలో ఒక రాత్రి"... ఇలా ఉండేవి ఆ సినిమాల టైటిల్స్. అవన్నీ "ఏ" సర్టిఫికేట్ సినిమాలు. 

ఎక్కడో ఒకటీ అరా బోల్డ్ సీన్లుండేవి. కొన్నిట్లో నిండా కప్పుకుని వెట్ అయ్యే సీన్లుండేవి. వాటికే హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్‌తో తెగ ఎగ్జయిట్ అయ్యేవాళ్ళు ప్రేక్షకులు. నేను కూడా.

అయితే - ప్రతి సినిమాలో కథ మాత్రం చాలా బాగుండేది. 

అలా ఒకటీ అరా బోల్డ్ సీనో, వెట్ సీనో ఉండే అప్పటి మలయాళం సినిమాలను మన డబ్బింగ్ నిర్మాతలు ఎగబడి కొన్నుక్కొని అప్పట్లో మంచి బిజినెస్ చేశారన్నమాట!    

అప్పటి మలయాళం సినిమాల్లో నాకు బాగా గుర్తున్న ఒకే ఒక్క డైరెక్టర్ పేరు - ఐ వి శశి. ఒక్క మలయాళంలోనే సుమారు 110 సినిమాలు డైరెక్ట్ చేశారు శశి. హీరోయిన్ సీమ అప్పట్లో ఈయన దర్శకత్వలో దాదాపు ఒక 30 సినిమాల్లో నటించింది. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారని చదివాను. 

కట్ చేస్తే -

అప్పటికీ ఇప్పటికీ కంటెంట్ విషయంలో మలయాళం సినిమా మారలేదు. 

దీనికి ప్రధాన కారణాలు రెండు:

1. మలయాళ చిత్ర పరిశ్రమ బిజినెస్ పరిథి చాలా చిన్నది. ఎక్కువ బడ్జెట్లు వర్కవుట్ కావు. ఈ నేపథ్యంలో - తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ క్రియేటివిటీ కోసం తపన ఉంటుంది. అదే అక్కడ వర్కవుట్ అయింది, అదే ఇప్పటికీ కొనసాగుతోంది. 

2. మలయాళంలో అత్యధికశాతం మంది కవులు, రచయితలు, ఫిలిం మేకర్స్, ఇతర క్రియేటివ్ రంగాల వారంతా (అప్పట్లో ఎక్కువగా, కొంతవరకు ఇప్పుడు కూడా) కమ్యూనిజం భావజాలం నేపథ్యం ఉన్నవారే. అనవసర భారీతనం, బిల్డప్పులు వంటివాటిని ఈ నేపథ్యం పట్టించుకోదు, ఇష్టపడదు. ఈ ఆలోచనావిధానమే ఎక్కువ శాతం మలయాళ సినిమాల్లో సహజత్వానికి కారణమైంది. ఇప్పటికీ ఈ సహజత్వమే పునాదిగా మలయాళ సినిమా కొనసాగుతోంది.

మొన్నొక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మన తెలుగు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫాక్టరీ) ఒక విషయం బాగా చెప్పారు - మళయాళంలో కోటిరూపాయల్లో బాగా తీయగలిగిన సినిమా మన తెలుగులో తీసేటప్పటికి కనీసం 5 నుంచి 15-20 కోట్లు అవుందని! విశ్వ చెప్పిన మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

అక్కడి టోటల్ సినిమా బడ్జెట్ ఇక్కడ హీరో రెమ్యూనరేషన్‌కు కూడా సరిపోదు. కథ ఏదైనా కానీ - ప్రతి షాట్‌లో, ప్రతి సీన్లో మనవాళ్లకు భారీతనం కావాలి. బిల్డప్పులు కావాలి. అలవాటైన ప్రాణాలు. అవి లేకపోతే ప్రేక్షకులు తిప్పికొడతారని భయం. ఇక బడ్జెట్ 20 కోట్లో, 30 కోట్లో ఎందుక్కాదు? 

దీనికి లేటెస్ట్ ఉదాహరణ - ఆమధ్య వచ్చిన మలయాళం "ప్రేమలు" సినిమా. కేరళ నుంచి మొత్తం టీమ్ వచ్చి హైద్రాబాద్‌లో 2 ఫ్లాట్స్‌లో ఉండి, సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని వెళ్లారు. అంతా కొత్తవాళ్లే. (ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్స్‌లో ఒకరు.) 

ఈ సినిమా మొత్తం బడ్జెట్ 3 కోట్ల లోపే. 
136 కోట్లు వసూలు చేసింది. 

ఇదే సినిమాను కొనుక్కొని మనవాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా సక్సెస్ అయింది.   

అయితే - ఇదే కథను తెలుగులో తీస్తే మనవాళ్ళు కనీసం ఒక 20 కోట్లు ఖచ్చితంగా ఖర్చుచేస్తారని ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూస్తున్న సగటు తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా చెప్తాడు. 

Creativity speaks from the soul, business speaks from the mind. Merging the two with balance is rare—and that’s what makes it powerful.

- మనోహర్ చిమ్మని 

Thursday, 7 August 2025

చిన్న సినిమా ఎందుకు ఆగిపోతుంది?


రాయాలంటే భారతం అవుతుంది కాని, క్లుప్తంగా ఒకటి రెండు పాయింట్స్‌లో చెప్పే ప్రయత్నం చేస్తాను...

ఆర్టిస్టులు, టెక్నీషియన్లను బుక్ చేసుకునేటప్పుడు చాలా స్పష్టంగా మేమివ్వగలిగిన పేమెంట్ గురించి చెప్పి ఒప్పించుకొంటాం. అదనంగా ఒక్క పైసా ఇవ్వటం సాధ్యం కాదు, అన్నీ అందులోనే అని చెప్తాం. ఓకే అంటారు.

ఒక రెండురోజుల షూటింగ్ తర్వాత "కన్వేయన్స్ కావాలి" అని, "ఇంకో అసిస్టెంట్ కావాలి", "ఇది కావాలి, అది కావాలి" అని ఎలాంటి సంకోచం లేకుండా, చాలా నిర్దయగా ఒక్కోటి మొదలవుతుంది.

సినిమా మధ్యలో ఆపలేం. ఒక్కోటీ ఒప్పుకోవాల్సి వచ్చేలా సిచువేషన్స్ క్రియేట్ అవుతాయి.  

బడ్జెట్ కనీసం ఒక 30 శాతం పెరుగుతుంది. 

సినిమా అదే ఆగిపోతుంది. 

ప్రొడ్యూసర్, డైరెక్టర్‌లకు తప్ప దాదాపు ఏ ఒక్కరికీ కొంచెం కూడా పెయిన్ ఉండదు. కర్టెసీకి కూడా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్-డైరెక్టర్స్ వైపుకి చూడరు. కనీసం హాయ్ చెప్పరు. 

నేను జస్ట్ శాంపిల్‌గా ఒక చిన్న అంశం చెప్పాను. దీన్నిబట్టి టోటల్ సినిమా అర్థం చేసుకోవచ్చు.       

కట్ చేస్తే - 

అసలు 30 కోట్ల నుంచి 300 కోట్లు, 1000 కోట్లు ఖర్చుపెట్టే భారీ బడ్జెట్ సినిమాల్లో పనిచేసే సిబ్బందికి ఇచ్చే యూనియన్ వేతనాన్ని, కేవలం కోటి నుంచి 4, 5 కోట్ల లోపు చిన్న బడ్జెట్లో చేసే ఇండిపెండెంట్ సినిమాల్లో కూడా ఎలా ఇవ్వగలుగుతారు? ఎలా అడగగలుగుతారు? 

అసలు యూనియన్‌తో సంబంధం లేకుండా, పనిచేయడానికి ఎందరో పనిలేకుండా ఉన్నారు. అలాంటివారికి అవకాశం ఇచ్చి పనిచేయించుకొంటే 30 శాతం బడ్జెట్ తగ్గుతుంది. ఉన్నంతలో మరింత నాణ్యంగా సినిమా చేయడానికి వీలవుతుంది. 

ఇలా రాశానని నేను యూనియన్స్‌కు, సిబ్బందికి వ్యతిరేకం కాదు. కాని, బడ్జెట్ లేని చిన్న సినిమాలనూ, వందల కోట్ల బడ్జెట్ ఉండే పెద్ద సినిమాలనూ ఒకే విధంగా ట్రీట్ చేయడం వల్ల చిన్న సినిమాలు భారీగా నష్టపోతున్నాయన్నది గుర్తించాలి. 

కట్ చేస్తే - 

ఏదో సినిమా తీయాలన్న ప్యాషన్‌తో ఎవరో ఒకరు, లేదా ఓ నలుగురయిదుగురు లైక్-మైండెడ్ వ్యక్తులు కొన్ని డబ్బులు పూల్ చేసుకొని సినిమా చేస్తున్నప్పుడు - వాళ్ళకి ఇష్టమైన టీమ్‌తో వాళ్ళు స్వతంత్రంగా సినిమా చేసుకోగలగాలి.

మీరు ఫలానా క్రాఫ్ట్‌లో "ఖచ్చితంగా యూనియన్ వాళ్లనే తీసుకోవాలని" రూల్స్ పెట్టడం, అలా తీసుకోలేనప్పుడు యూనియన్ వాళ్ళు మధ్యలో వచ్చి సినిమా షూటింగ్స్ ఆపడం ఎంతవరకు సమంజసం? 

చిన్న సినిమాల విషయంలో - ఆల్రెడీ ఇలాంటి లాజిక్ లేని రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇక మీదట అసలు ఈ రూల్స్‌ను ఎవ్వరూ పాటించరు, పట్టించుకోరు. 

Independent filmmaking is pure freedom — no rules, no brules, just raw vision unleashed. 

- మనోహర్ చిమ్మని

*** 
(మలయాళంలో కోటిరూపాయల్లో తయారవుతున్న అద్భుతమైన సినిమాల్లాంటివి తెలుగులో చేయడానికి 5 నుంచి 30 కోట్లు ఎందుకవుతున్నాయి? రేపు... ఇక్కడే.)   

Tuesday, 5 August 2025

నాకొక బలహీనత ఉంది...


ఏదైనా ఒక కొత్త ఆలోచన నాలో మెరిసి, నన్ను ఇన్‌స్పయిర్ చేసినప్పుడు, దానికి వెంటనే పెద్దగా డబ్బు కూడా అవసరం లేదు అనుకుంటే, దాన్ని నేను వెంటనే అమల్లో పెడతాను. 

అలాంటి ఒక కొత్త ఆలోచనతో, ఒక కొత్త ప్రయోగాత్మక ప్రాజెక్టు కోసం కంటెంట్ రాయడం పూర్తిచేశా ఇప్పుడే. 

పెద్ద స్ట్రెస్-బస్టర్. 

కట్ చేస్తే -  

అనుకున్న స్థాయిలో ఈ పని పూర్తిచేయగలిగితే, ఇది నేననుకున్న ఫలితాన్నిస్తుంది. 

ఈరోజు నుంచి ఒక రెండు వారాలు బాగా కష్టపడాల్సి ఉంది. 

If creatives don’t shake up their routine, they risk fading into it. Do something wildly different—where the magic and madness live.

- మనోహర్ చిమ్మని 

Saturday, 2 August 2025

మనోహర్ చిమ్మని "కోపరేటివ్ ఫిలిం మేకింగ్ క్లబ్!" - 2


మనోహర్ చిమ్మని "కోపరేటివ్ ఫిలిం మేకింగ్ క్లబ్" బేసిక్ బెనిఫిట్స్, రూల్స్, రెగ్యులేషన్స్: 

> అందరిలోనూ టాలెంట్ తప్పకుండా ఉంటుంది. అయితే - మా స్క్రిప్టులో, మా సెటప్‌కు సూటయ్యే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ను మాత్రమే మేం మా ప్రాజెక్టుల్లోకి తీసుకుంటాం. 

> మేమిచ్చే అవకాశమే మీకు పెద్ద రెమ్యూనరేషన్. సో, మేం మీకు రెమ్యూనరేషన్ ఇవ్వము. మీరు మాకు ఒక్క రూపాయి ఇవ్వొద్దు. ఈ విషయంలో రిటెన్ అగ్రిమెంట్ ఉంటుంది. 

> పక్కా కమర్షియల్ సినిమా తీస్తాం, బాగా ప్రమోట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. అది మా లక్ష్యం, మాహెడ్దేక్. అందులో ఎలాంటి సందేహం లేదు. 

> టాలెంట్ ఉన్నవారికి మేం చేసే వెబ్ సీరీస్‌లు, మ్యూజిక్ వీడియోస్, కమర్షియల్ యాడ్స్, డాక్యుమెంటరీస్ మొదలైనవాటిల్లో కూడా అవకాశం రావచ్చు. 

> ఈ క్లబ్ ద్వారా మాతో కలిసి మీరు ఏం చేసినా, అది ఇండస్ట్రీలో మీ తర్వాతి బెటర్ అపార్చునిటీస్‌కు లాంచ్‌ప్యాడ్ కావచ్చు.   

> ఫిలిం ప్రొడక్షన్లో మా ప్రొడ్యూసర్స్‌తో అసోసియేట్ కావాలనుకొనే చిన్న ఇన్వెస్టర్స్ కూడా క్లబ్‌లో చేరొచ్చు. మా ప్రొడ్యూసర్స్‌తో రిటెన్ అగ్రిమెంట్ ఉంటుంది. ప్రొడక్షన్లో మీరు దగ్గరుండి అన్నీ చూసుకోవచ్చు. 

> క్లబ్ మెంబర్స్ అందరికి ఒక ప్రయివేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. కోపరేటివ్ ఫిలిం మేకింగ్, ఫిలిం మేకింగ్ అంశాలపైన ఇంకొకరిని ఇబ్బందిపెట్టకుండా మీ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు. సమిష్టిగా మీకు మీరే కొత్త అవకాశాలను క్రియేట్ చేసుకోవచ్చు.  

కట్ చేస్తే -

నిన్నటి నా పోస్టులో చెప్పినట్టు - ఆసక్తి ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మీ బయోడేటా, లేటెస్టు సెల్ఫీ, ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఈమెయిల్ ద్వారా వెంటనే పంపించండి: richmonkmail@gmail.com

4 వ తేదీ నుంచి వరుసగా ఆడిషన్స్ ఉంటాయి. 

సినీఫీల్డులో కెరీర్ కోసం నిజంగా అంత సీరియస్‌నెస్, ఇంట్రెస్టు ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసమే ఈ కాల్. మిగిలినవాళ్ళు ఎవ్వరూ అనవసరంగా మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్. 

Filmmaking is a gold mine—if your focus is fire and your team is fierce.

- మనోహర్ చిమ్మని  

Be Your Own Backbone


Dependency is a slow poison. It starts with comfort, grows into habit, and ends in heartbreak or helplessness. Whether in work, relationships, or creative pursuits — relying too much on others can cost you clarity, confidence, and control.

Trust your gut. Own your choices.
Blame is for the weak — leaders take full responsibility.

Let people be who they are.
You’re not here to fix or follow anyone.
You’re here to lead, to grow, to win — on your own terms.

Stand tall. Walk alone, if you must.
That’s where real power begins.

-Manohar Chimmani 

Friday, 1 August 2025

మనోహర్ చిమ్మని "కోపరేటివ్ ఫిలిం మేకింగ్ క్లబ్!"


1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగ్జ్ ఇదే పద్ధతిలో "ఎల్ మరియాచి" తీశాడు. 

సోషల్ మీడియా లేని కాలంలోనే, 2007లో, నా రెండో సినిమా "అలా" ఈ పధ్ధతిలోనే తీశాను. 2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" కూడా ఇదే పద్ధతిలో తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంకెందరో ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ ఇప్పటికీ ఇదే పద్ధతిలో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. 

కట్ చేస్తే -  

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా... ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెమ్యూనరేషన్ ముందు ఇవ్వటం అనేది అసలు ఉండదు. 

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు! 
దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు!!

సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్ (మనీ/పని) ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది.   

ఎందుకంటే - 
దీనికి ప్రొడ్యూసర్ ఉండడు. 
ఇండిపెండెంట్ ఫిలిం అన్నమాట. 

అనుకున్న బడ్జెట్‌ను నలుగురయిదుగురు -లేదా- ఒక పదిమంది లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ తలా కొంత షేర్ చేసుకుంటారు.  

సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు. పదికోట్లు కావచ్చు. మేం పూల్ చేసుకున్న ఆ బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతాం.   

నో కాల్ షీట్స్.
నో టైమింగ్స్.
అంతా - రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్.
గెరిల్లా ఫిల్మ్ మేకింగ్. 

ప్రొడ్యూసర్స్, స్టార్స్ లేని ఇండిపెండెంట్ సినిమాల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ ఒక్క పద్ధతే ఎక్కువగా విజయవంతంగా నడుస్తోంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఈ పద్ధతిలో తీసిన ఎన్నో సినిమాలు ఎప్పటికప్పుడు అద్భుత విజయాల్ని రికార్డు చేస్తున్నాయి. 

ఈ కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ప్లాన్ చేసి తీసే సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. మంచి బిజినెస్ చేస్తాయి... ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేస్తే! 

కట్ చేస్తే -  

పూర్తిగా న్యూ టాలెంట్‌తో, మొన్నీ మధ్యే నేను షూటింగ్ పూర్తిచేసిన రోడ్-క్రైమ్-డ్రామా "ఎర్ర గులాబి" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. 

ఇప్పుడు తాజాగా నేను చేస్తున్న రెండు ఫీచర్ ఫిలిమ్స్ ఈ పద్ధతిలో చేస్తున్నవే. ఈ రెండు సినిమాల ప్రిప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పుడు ఏక కాలంలో జరుగుతోంది. 

ఈ సిస్టమ్‌లో నాతో కలిసి పనిచేయాలనుకొనే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇన్వెస్టర్లు మీ పూర్తి వివరాలు తెలుపుతూ (bio-data, latest selfie, Insta link) నాకు ఈమెయిల్ చెయ్యండి...

మనోహర్ చిమ్మని "కోపరేటివ్ ఫిలిం మేకింగ్ క్లబ్"లో చేరండి.  

క్లబ్ సభ్యత్వానికి ఎలాంటి ఫీజు ఉండదు. 
కొన్ని బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ మాత్రం ఉంటాయి. 
త్వరలోనే నా కొత్త సినిమాల ప్రకటన, ప్రారంభం, షూటింగ్ ఉంటాయి. 

పూర్తి వివరాలు నా తర్వాతి పోస్టులో. 

"It's a kind of fun to do the impossible!"
- Walt Disney 

- మనోహర్ చిమ్మని