ఈరోజు నుంచి ఒక 365 రోజుల సమయంలో, నా డైరెక్షన్ టీమ్ నుంచి కనీసం ఒక ఇద్దరు కొత్త డైరెక్టర్స్‌ను పరిచయం చెయ్యబోతున్నాను. ఆ దిశలో ఇప్పటినుంచే పనులు జరుగుతున్నాయి.
కట్ చేస్తే -
"Just_ప్రేమ" అనేది నేను ఎప్పటినుంచో అనుకుంటున్న డ్రీమ్ టైటిల్. దానికి తగ్గ సబ్జెక్ట్ ఉంది. స్క్రిప్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైనింగ్, ఇతర ప్రి-ప్రొడక్షన్ పనుల్లో మా టీమ్ బిజీగా ఉంది.
సబ్జెక్ట్ డిమాండ్ దృష్ట్యా, ఈ సినిమా షూటింగ్‌లో కొంత భాగం స్విట్జర్లాండ్, ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో చేస్తున్నాము. పాపులర్ హీరోహీరోయిన్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులతో భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విశ్వంభర క్రియేషన్స్ బ్యానర్ పైన, నా మిత్రుడు విజయేంద్ర నిర్మాతగా రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు ఫ్లోర్స్ పైకి వెళ్ళి "యాక్షన్!" చెప్తానా అని డైరెక్టర్‌గా నేను, ఎప్పుడెప్పుడు షూటింగ్‌లో మునిగిపోతామా అని నా టీమ్... చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాము.
కెమెరామన్‌గా ఈ సినిమాకు నా మిత్రుడు వీరేంద్ర లలిత్ (ముంబై) చేస్తున్నాడు.
ఈ ప్రాజెక్టుకి సీ ఈ వో ప్రదీప్‌చంద్ర.
మ్యూజిక్, ఇతర టెక్నీషియన్స్‌ను త్వరలో ప్రకటించబోతున్నాం.
ఈ ప్రాజెక్టుకి సీ ఈ వో ప్రదీప్‌చంద్ర.
మ్యూజిక్, ఇతర టెక్నీషియన్స్‌ను త్వరలో ప్రకటించబోతున్నాం.
దర్శకత్వ శాఖలో ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తున్న లహరి జితెందర్ రెడ్డి, ప్రస్తుతం నా టీమ్‌లో చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. లహరి డైరెక్టర్‌గా, తన మొదటి సినిమాను, ఒక భారీ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు రూపంలో 2025 లో ప్రారంభించబోతోంది.
కట్ చేస్తే -
ఈరోజు మా విజయేంద్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆఫీసులో పూజాకార్యక్రమాలు నిర్వహించి "Just_ప్రేమ" వర్కింగ్ పోస్టర్‌ను విజయేంద్రకు అందించటం జరిగింది. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా "Yo!"తో పాటు, ఇప్పుడు ఈ సినిమా పనులు కూడా ఈరోజు నుంచి ఊపందుకోనున్నాయి.
"Just_ప్రేమ"తో విజయేంద్ర ప్రొడ్యూసర్‌గా బ్లాక్‌బస్టర్ విజయం సాధించాలని నేనూ, నా టీమ్ ఆశిస్తున్నాము. ఆ స్థాయిలో మా అందరి కృషి ఉండబోతోంది.
Happy Birthday, dear Vijayendra! Here’s to a wonderful year of blockbuster success and cinematic magic!
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani