అసలు గీ ముచ్చట నన్ను అడిగిన్లు గని, గా 'ఆర్జీవీ'ని అడిగితె సక్కగ చెప్తడు. నేనన్న జెర స్వీట్ కోటింగిస్త గని, ఆర్జీవైతే... అసలు దీనికి సొల్యూషనే లేదు దొబ్బెయిండ్రా అని సాఫ్ సీద చెప్తడు.
అయినా గీ కాస్టింగ్ కౌచ్ కత ఒక్క మన సినిమా ఫీల్డుల్నే ఉన్నదా? నువ్వు ఏ ఫీల్డుకన్న పో... గిదే నడుస్తది.
నీకేంది, నాకేంది?
"నేన్నీకు కాంట్రాక్ట్ ఇప్పిస్త, నువ్వు నాకేమిస్తవ్"... గిది పొలిటీషన్ల కాస్టింగ్ కౌచ్.
"సరె డాడీ, నేను క్లాసుల ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంట. మరి నాకేమిస్తవ్?" గిది ఇంట్ల పిలగాండ్ల కాస్టింగ్ కౌచ్.
"అరేయ్... ఇయ్యాల రాత్రి తొమ్మిది కల్ల నేను నీకు గుడ్ న్యూస్ ఇస్త... మరి నువ్వు నాకేమిస్తవ్?" గిది ఫ్రెండ్‌షిప్‌ల కాస్టింగ్ కౌచ్.
"నేన్నీకు బియ్యమిస్త... నువ్వు నాకు పప్పిస్తవా?"... గిది బార్టర్ సిస్టం.
నువ్వే ఫీల్డులకన్న పో... గిదే ఉంటది.
1924 అనుకుంట... గప్పుడో మూకీ సిన్మా వచ్చింది. దాని పేరు "కాస్టింగ్ కౌచ్". దాని స్టోరీలైన్ గిదే. ఒక కాస్టింగ్ డైరెక్టర్‌కు ఏదడిగితె గదిచ్చే హీరోయిన్ కత గది.
వందేండ్ల కిందనే గిదీని మీద సిన్మనే తీసిండ్లంటే... ఇంక దీని గురించి ఏం మాట్లాడ్తం చెప్పు?
అగో గా సీన్మ నుంచే గీ కాస్టింగ్ కౌచ్ ముచ్చట పుట్టింది.
1924 ల!
వందేండ్ల కిందనే గిదీని మీద సిన్మనే తీసిండ్లంటే... ఇంక దీని గురించి ఏం మాట్లాడ్తం చెప్పు?
అగో గా సీన్మ నుంచే గీ కాస్టింగ్ కౌచ్ ముచ్చట పుట్టింది.
1924 ల!
అంటేందీ, సీన్మ పుట్టినప్పట్నుంచి గిదే కతన్నమాట.
మామూలు క్విడ్-ప్రో-కోలకు దీనికి ఏం తేడా ఉన్నది బై... గా మొరాలిటీ ఒక్కటే.
అయినా, బుద్ధిన్నోడు ఎవడన్న ఫోర్స్ చేస్తడా గిదీని మీద? ఇదసలే సోషల్ మీడియా జమానా. సెకన్ల సోషల్ మీడియాల కనిపిస్తది...
"ఫలానా డైరెక్టర్, ఫలానా హీరోయిన్ను గా డాష్‌ల ఫేవర్సేవో అడిగిండట" అని!
ఇంకేమన్నున్నదా గట్ల బయిటికొస్తె?!
మరి గిది లేదా ఇండస్ట్రీల అంటె... ఉండే ఉంటది. కని, కామన్ సెన్స్ ఏందంటె గిసొంటియన్ని ఇద్దరు మనుషుల మధ్య జరిగే ముచ్చట్లు.
నిజంగ గీ క్విడ్ ప్రో కో చేసుకునెటోల్లకు గింత లొల్లుంటదని తెల్వది. బైటోల్లే నానా కతల్ పడ్తరు.
నిజంగ గీ క్విడ్ ప్రో కో చేసుకునెటోల్లకు గింత లొల్లుంటదని తెల్వది. బైటోల్లే నానా కతల్ పడ్తరు.
ఇప్పుడింక యూట్యూబ్ చానెల్లు కూడ మస్త్ అయినయి కద... ప్రతి గొట్టం గాడు కుడ ఓ పనిలేకుంట ఇంట్ల కూసున్న ఒక ఆర్టిస్టును పట్టుకునేది... "నీకైందా గీ కాస్టింగ్ కౌచ్" అని అడిగేది! వాల్లు వున్నయి లేనియి అన్ని చెప్తరు... బజ్ కావాలె కద...
అటు పనిలేనోల్లకు, ఇటు పనున్నోల్లకు కూడ బజ్ కావాల్నంటె ఇప్పుడు గిదొక్కటే టాపిక్... కాస్టింగ్ కౌచ్!"
... ... ...
... ... ...
మన డైరెక్టర్ "మిస్టర్ డి" ఇంటర్వ్యూ అయిపోయింది.
ఇంటర్వ్యూ తీసుకున్న ప్రముక యూట్యూబ్ చానెల్ యాంకర్ ఫుల్ కుష్!
ఇంటర్వ్యూ తీసుకున్న ప్రముక యూట్యూబ్ చానెల్ యాంకర్ ఫుల్ కుష్!
కట్ చేస్తె -
రేపు వాల్ల చానెల్ అప్లోడ్ చేసే వీడియోకు ఖతర్నాక్ థంబ్‌నెయిల్...
"అసలు
కాస్టింగ్ కౌచ్‌కు
లొంగని హీరోయిన్ ఎవరు?
అందరు హీరోయిన్ల
బండారం బయటపెట్టిన
డైరెక్టర్ మిస్టర్ డి !!"
అగో గట్లుంటది మనోల్లతోని...
- మనోహర్ చిమ్మని
ఇంటర్వ్యూల గా డైరెక్టర్ చెప్పిందానికి, థంబ్‌నెయిల్‌కు ఏమన్న సంబంధమున్నదా?
వీల్లను ఎవ్వడన్న అడిగెటోడున్నడా?
గదే మరి... గందుకే గీ చానెలోల్లతోటి ఎక్కువ తక్కువ మాట్లాడడు మన డైరెక్టర్!
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani