ఒక హీరోయిన్ ఫ్యాన్స్, ఆమె నటించిన లేటెస్ట్ సినిమా పోస్టర్స్, టీజర్స్ చూసి, ఆమె ఆ సినిమాలో టూమచ్ గ్లామర్-షో చేసిందని, లిప్-లాక్స్ ఇచ్చిందనీ... ట్రోల్స్‌తో బాగా రెచ్చిపోయారు. ట్రోల్స్ ఎంత టూమచ్‌గా చేశారంటే, ఆ హీరోయిన్ తన సొంత సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్‌కు కూడా వెళ్ళకుండా హర్ట్ అయి అసలు బయటికి కదలలేనంతగా!
ఆ హీరోయిన్ పేరు అనుపమ పరమేశ్వరన్.
ఆ సినిమా పేరు టిల్లూ స్క్వేర్.
ఒక హీరోయిన్‌గా, తనకిష్టమైన పాత్రలో, తనకిష్టమైనట్టు నటించే ఫ్రీడమ్‌ను కాదనడానికి అసలు ఎవరు వీళ్ళంతా?
ఒక హీరోయిన్‌గా, తనకిష్టమైన పాత్రలో, తనకిష్టమైనట్టు నటించే ఫ్రీడమ్‌ను కాదనడానికి అసలు ఎవరు వీళ్ళంతా?
కట్ చేస్తే -
సోషల్ మీడియాలో ట్రోల్స్‌నే కాదు. మనం పెట్టిన పోస్టు కింద కామెంట్స్ కూడా పట్టించుకొంటే కష్టం.
ఇలా ట్రోల్స్ చేసేవాళ్లందరినీ పట్టించుకుంటే అసలు మనం సోషల్ మీడియాలో ఉండలేం. సినిమాల్లో కూడా ఉండలేం.
ఒక లిమిట్‌ను మించి ట్రోల్స్ చేసేవాళ్ళంతా ఒక మంద మెంటాలిటీకి చెందినవారు. ఎప్పుడూఒ ఒక రకమైన మాస్ హిస్టీరియాలో బ్రతుకుతుంటారు.
ట్రోలింగ్ పేరుతో, ఇలాంటి సిక్ పేషంట్స్ చేసిన సొల్లును అంత సీరియస్‌గా పట్టించుకోవడం అనుపమ తప్పు. అసలు ట్రోల్స్ చదవడం కోసం తన ఒక్క సెకండ్ కూడా వృధా చేసుకోవడం అనేది ఆమె చేసిన మరింత పెద్ద తప్పు.
అనుపమలా మరీ అంత సెన్సిటివ్‌గా ఉంటే, సినిమాల్లో హీరోయిన్‌గా ఏమో గాని, అసలు బ్రతకడమే కష్టం.
Take it light #Anupama!
అనుపమ నటించిన "టిల్లు స్క్వేర్" రేపు విడుదలవుతున్న సందర్భంగా సిద్ధు, అనుపమ & టీమ్‌కు ఆల్ ది బెస్ట్.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani