అంటే, ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నానన్నమాట.
కట్ చేస్తే -
టీమ్ ఇంత నత్త నడక నడుస్తున్నదంటే లోపం ఎక్కడో నాలోనే ఉందని నాకర్థమైంది. సరిగ్గా ఇన్‌స్పయిర్ చెయ్యలేకపోతున్నాను. అసలా ఫైర్ ఉండట్లేదు. నా చాంబర్‌లోంచి బయటకు వెళ్ళగానే అంతా మళ్ళీ సేమ్ రొటీన్ అయిపోతోంది. చాలా కూల్ అయిపోతున్నారు.
ఇప్పటివరకూ సినీఫీల్డులో విజయం సాధించిన ఏ ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా, సినిమాను ఒక తపస్సులా తీసుకున్నవారే. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. సినిమానే శ్వాసించారు. జీవించారు.
కేవలం డబ్బు ఒక్కదాని గురించే ఆలోచిస్తే సినిమా సక్సెస్ కాదు. సక్సెస్‌ఫుల్ సినిమా ఇస్తేనే డబ్బు వస్తుంది. అలాంటి సినిమా కోసం నిజంగా మనం ఎంత కష్టపడుతున్నాం? ఎంత ఆలోచిస్తున్నాం?
ఇప్పటివరకూ సినీఫీల్డులో విజయం సాధించిన ఏ ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా, సినిమాను ఒక తపస్సులా తీసుకున్నవారే. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. సినిమానే శ్వాసించారు. జీవించారు.
నిజంగా మనం సినిమాను అంత సీరియస్‌గా తీసుకున్నామా?
సినిమా బడ్జెట్ చిన్నదయినా, పెద్దదయినా, దాని కోసం పడే శ్రమ ఒక్కటే. మన ప్రతి నిమిషానికి, ప్రతి గంటకీ వాల్యూ ఉంటుంది. ఎందుకని మనం ఆ వాల్యూని గుర్తించలేకపోతున్నాం? అసలు సినీఫీల్డు యాంబియెన్స్ కాని, మూడ్ గాని మనం ఫీలవుతున్నామా?
లైఫ్ స్టైల్, థింకింగ్ ఒకటి కంటిన్యూ చేస్తూ, దానికి ఎలాంటి సంబంధం లేని ఇంకొకటి సాధించాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? అలా మనం ఏదైనా సాధించగలుగుతామా అసలు?
ఈ ఒక్క విషయంలో మన మైండ్‌సెట్ మారినప్పుడు అన్నీ అవే బాగుంటాయి...
కావల్సినన్ని ఫండ్స్ వస్తాయి,
వస్తూనే ఉంటాయి.
స్క్రిప్టులు బాగా చేసుకుంటాం.
మంచి యాక్టర్లు, టెక్నీషియన్స్‌తో
కలిసి పనిచేస్తాం.
బాగా సినిమాలు చేస్తాం.
బ్లాక్‌బస్టర్ హిట్సూ ఇస్తాం.
గతంలోనే ఉండిపోదామా,
మనకిష్టమైన మన ఫ్యూచర్‌కి వెల్దామా?
... మన చేతుల్లోనే ఉంది.
మనకిష్టమైన మన ఫ్యూచర్‌కి వెల్దామా?
... మన చేతుల్లోనే ఉంది.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani