కట్ చేస్తే -
రాజకీయాలు వేరు, మన వ్యక్తిగత స్నేహాలు, రిలేషన్‌షిప్స్ వేరు.
ఒకరి అభిప్రాయాలపై మరొకరు... విమర్శలు ఎవరు ఎలా అయినా చేసుకునే హక్కు ఉంటుంది. కాని, అవి మరీ చిల్లర స్థాయిలో ఉండకపోతే బెటర్.
ఒకరి అభిప్రాయాలపై మరొకరు... విమర్శలు ఎవరు ఎలా అయినా చేసుకునే హక్కు ఉంటుంది. కాని, అవి మరీ చిల్లర స్థాయిలో ఉండకపోతే బెటర్.
ఆయా నాయకుల పైన, పార్టీల పైన, పాలనా పద్ధతుల పైన... ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండటం సహజం. దానికి బీపీలు పెంచుకోనవసరం లేదు.
బాగా పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకులను గుర్తించాలి, ప్రోత్సహించాలి అన్నదొక్కటే రాజకీయాలకు సంబంధించి నా కనెక్షన్. అంతకు మించి రాజకీయాలపైన నాకసలు ఆసక్తి లేదు. నన్ను ఇలా రాయమని, అలా రాయమని చెపే హక్కు ఎవ్వరికీ లేదు. అది పూర్తిగా నా ఇష్టం.

నా వాల్. నా ఇష్టం.
అలాగే, నువ్విలా రాయకూడదు అని నాకు చెప్పే హక్కు కూడా ఎవ్వరికీ లేదు.
ఒకవేళ నా రాతలు నచ్చకపోతే నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు. తప్పేం లేదు.
మొత్తంగా అసలు నా వ్యూ పాయింటే నచ్చనివాళ్ళు నా వాల్ మీదకి రాకపోవడం బెటర్. బ్లాక్ చేస్తే ఇంకా బెటర్.
మొత్తంగా అసలు నా వ్యూ పాయింటే నచ్చనివాళ్ళు నా వాల్ మీదకి రాకపోవడం బెటర్. బ్లాక్ చేస్తే ఇంకా బెటర్.
నా వాల్ మీదకొచ్చే చదువుకున్న కుసంస్కారులను బ్లాక్ చేస్తాను తప్ప, నా సమయం వృధా చేసుకోను.
బయటికి కనిపించే రాజకీయాలు వేరు. మనకు కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ప్రతిదానికీ ఊరికే బీపీలు పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యాలే పాడైపోతాయి. మరెన్నో రకాలుగా నష్టపోయేదీ మనమే.
ముందే చెప్పినట్టు - మన చదువులు, మన ప్రొఫెషన్స్, మన బిజినెస్‌లు, మన అబ్రాడ్ ఉద్యోగాలు, మనలో మరింత మంచి సంస్కారాన్ని పెంచాలి తప్ప, మనల్ని సంస్కార హీనులను చేయొద్దు.
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani