61 ఏళ్ళ ఆశిష్ విద్యార్థి రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఈమె పేరు, రూపాలి బారువా. ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్.
ఆశిష్ నిజంగా చాలా ధైర్యవంతుడి కిందే లెక్క!
నాకు గాని అలాంటి అవకాశమొస్తే, ఏక్ నిరంజన్‌గా ఎంజాయ్ చేస్తా తప్ప మళ్ళీ పెళ్ళి చేసుకోను.
కట్ చేస్తే -
ఆశిష్ విద్యార్థి మొదటి భార్య రాజోషి, ఆశిష్ కొన్నాళ్ళ క్రితం ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు.
"ఇప్పటిదాకా, పిల్లల్ని-నిన్ను పట్టించుకున్నాను. నా వ్యక్తిగత జీవితం, అభిరుచులు, ఇష్టాలు అలా మిగిలిపోయాయి. ఇక నుంచి నా జీవితం నేను నా ఇష్టప్రకారం జీవించాలనుకొంటున్నాను. సో, మనం డివోర్స్ తీసుకుందాం. నువ్వు రెండో పెళ్ళి చేసుకో. కావాలంటే నీకు సరిపోయే అమ్మాయిని నేనే చూసిపెడతా" అని ప్రపోజ్ చేసింది రాజోషి.
ఇంకేముంది, ఓకే అన్నాడు ఆశిష్.
ఎంటర్... ది రూపాలి బారువా!
ఇప్పుడు ఆశిష్ లక్కీ ఫెలోనా, అన్‌లక్కీ ఫెలోనా? దటీజ్ ద బిగ్ కొశ్చన్...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani