"హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చినా, నాలుగేళ్ళలో నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టితీరుతా. తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు పారిస్తా."
"సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో నేనే ఎన్నోసార్లు వాదించాను. గోదావరి నీళ్ళు వేస్ట్‌గా ఊరికెనే పోతున్నై, మాకు ఇస్తే ఏం పాయె అని. వాళ్ళు ఇయ్యలే. మేం ఇయ్యాల తెచ్చి చూపిచ్చినం!"
"మనిషి ఎప్పుడూ పుట్టిన తర్వాతనే నేర్చుకుంటడు తప్ప, పుట్టక ముందే అన్నీ నేర్చుకొని మనం ఎవ్వరం భూమ్మీదకు రాం. టైం మనకోసం ఆగదు. ఆ ఉండిన టైంను ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నాం, దాన్ని ఎంత బాగా ఆస్వాదించినం, మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తున్నామా లేదా... ఇవన్నీ ఆలోచించుకోవాలి. సమస్య నుంచి పారిపోవద్దు. వి షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లం!"
ఇవన్నీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు.
ఆయన చెప్పే మాటలు, చేసే పనులు ఏవైనా ఆ స్థాయిలో ఉంటాయి.
ఇచ్చిన హామీలు అమలు చేయడం మాత్రమే కాదు, ఇవ్వని హామీలను కూడా అప్పటివరకూ కనీవినీ ఎరుగని అద్భుత పథకాల రూపంలో ప్రజలకు అందిస్తారు కేసీఆర్.
ఆయన చెప్పే మాటలు, చేసే పనులు ఏవైనా ఆ స్థాయిలో ఉంటాయి.
ఇచ్చిన హామీలు అమలు చేయడం మాత్రమే కాదు, ఇవ్వని హామీలను కూడా అప్పటివరకూ కనీవినీ ఎరుగని అద్భుత పథకాల రూపంలో ప్రజలకు అందిస్తారు కేసీఆర్.
కట్ చేస్తే -
రాహుల్ గాంధీ: "కేసీఆర్‌ది కుటుంబ పాలన. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నాడు."
(మోతీలాల్, జవహర్లాల్, ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్, ప్రియాంక... ఇంక ఈయనే చెప్పాలి కుటుంబపాలన గురించి! 80 వేల కోట్ల ప్రాజెక్టు నుంచి లక్ష కోట్ల అవినీతి ఎట్లా సాధ్యమో రాహుల్‌కే తెలియాలి. లెక్కల్లో మరీ ఇంత పూర్ అనుకోలేదు!)
రేవంత రెడ్డి: సోనియమ్మ తెలంగాణ ఇవ్వకుంటే మీరు నాంపల్లి దర్గా దగ్గర అడుక్కు తినెటోళ్ళు!"
(భారీ పారితోషికం తీసుకొని ఆ పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇవ్వకపోతే ఈయన పరిస్థితి ఖచ్చితంగా అదే అయ్యుండేది!)
కిషన్ రెడ్డి: "ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్."
(కేసీఆర్ హామీల లిస్టు, గత పదేళ్లలో రాష్ట్రంలో అమలైన అభివృద్ధి పనులు-సంక్షేమ పథకాల లిస్టు ముందేసుకుని, "కుర్‌కురే" తినుకుంటూ ఒక్క లుక్కేయండి. అలాగే కేంద్రంలో ప్రధాని మోదీ లిస్టులు కూడా చూడండి. మోసం ఎవరిదో మీకే తెలుస్తుంది.)
ఈటెల రాజేందర్: "బీఆరెస్ కండువాలు కప్పుకుంటేనే పథకాలు ఇస్తామంటూ దుర్మార్గం చేస్తున్నారు. అర్హులకు వచ్చే పథకాలను ఆపేందుకు మీరెవర్రా?"
(కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి, ఆయన పనితీరు గురించి మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పటి మీ భాష చూడండి. అదే మీ స్థాయిని చెప్తోంది.)
ఇవన్నీ మన సోకాల్డ్ "రేపు తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే" అని పోటీపడి చెప్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు.
వీరి మాటలకు, కేసీఆర్ మాటలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది.
కేసీఆర్ మాటల్లో తెలంగాణ ప్రజల అభివృద్ధి-సంక్షేమం గురించి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దటం గురించిన తపన ఉంటుంది. ఆ అంశాల గురించే స్పష్టంగా మాట్లాడుతారు. ఆ మాటల్లో చెప్పింది చేసి చూపిస్తారు.

మరోవైపు, ప్రతిపక్ష నాయకుల మాటల్లో ఎంతసేపూ "కేసీఅర్‌ను దించుతాం... కేసీఆర్‌ది అవినీతి పాలన... కేసీఆర్‌ది కుటుంబ పాలన" వంటి అతి రొటీన్ డైలాగులే ఉంటాయి తప్ప - "తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కంటే గొప్పగా మేం ఇదిగో ఇది సాధించి చూపిస్తాం" అని చెప్పలేరు. అంత అవగాహన వారికి లేదు. అసలావైపు వారి ఆలోచనే లేదు.
"కేసీఆర్‌ను దించి ఆ పీఠం మేం ఎక్కాలి" అన్న అధికార లాలసతో కూడిన సింగిల్ పాయింట్ ఎజెండానే తప్ప మరొకటి వారికి తెలీదు.
"కేసీఆర్‌ను దించి ఆ పీఠం మేం ఎక్కాలి" అన్న అధికార లాలసతో కూడిన సింగిల్ పాయింట్ ఎజెండానే తప్ప మరొకటి వారికి తెలీదు.
మీ ఓటెవరికి? అధికార లాలసకా... అభివృద్ధి-సంక్షేమ పిపాసికా?
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani