> దశాబ్దాలుగా మిత్రులైన కేసీఆర్-రాధాకృష్ణల మధ్య ఏదో చెడింది. రాధాకృష్ణ చేసిన ఏదో తప్పుని వ్యక్తిగతంగా కేసీఆర్ మనసులో పెట్టుకున్నారు. "అది కరెక్టు కాదు, మీ డాడీ అలా మనసులో పెట్టుకోవద్దు" అని అన్యాపదేశంగా పదే పదే కేటీఆర్‌తో చెప్పడం.
> ఇదే రాధాకృష్ణ కేసీఆర్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కనీస సభా మర్యాద కూడా లెక్కచేయకుండా, ఇంటర్వ్యూ అంతా "నువ్వు నువ్వు" అనే కేసీఆర్‌తో మాట్లాడటం నాకు గుర్తుంది. కాని - నిన్నటి కేటీఆర్‌తో చర్చలో మాత్రం, ఏదో రెండు మూడు సార్లు తప్ప, డిబేట్ అయినంత సేపూ కేటీఆర్‌ను "మీరు మీరు" అనే సంబోధించడం విశేషం.
> ప్రోగ్రాం ప్రారంభం నుంచి చివరివరకు కూడా, ఎవరితోనైనా సరే పిచ్చి వెటకారంగా మాట్లాడే రాధాకృష్ణ తన సహజ శైలిని పక్కనపెట్టి, కేటీఆర్‌తో సంభాషించడాన్ని మాత్రం చాలా ఆనందంగా ఫీలవ్వటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తను మాట్లాడే ప్రతి మాటకూ తనను కేటీఆర్ ఎక్కడ తప్పుగా అనుకుంటాడో అని, కేటీఆర్ ఎక్కడ ఫీలవుతాడోనని రాధాకృష్ణ తెగ ఫీలైపోయాడు. కేటీఆర్ పట్ల ఆయనకున్న ఇష్టం, ప్రేమ బాగా ప్రదర్శించుకోగలిగాడు. నిజంగా అదేనా... లేదంటే... వీళ్ళ డాడీని ఇంక నేను పడెయ్యలేను... రేపు కొన్నాళ్ళ తర్వాత ఎలాగూ సీయం కేటీఆరే అవుతాడు అని ఇప్పటినుంచే కాకా పట్టడమా అన్నది ఒక డౌట్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani