దర్శకరత్న దాసరి గారు 1980 లో అనుకుంటాను, ఒక్క సంవత్సరంలోనే 15 సినిమాలు రిలీజ్ చేశారు. వాటిలో 70 శాతం హిట్స్, సూపర్ హిట్స్, సిల్వర్ జుబ్లీస్.
ఉదా: సర్దార్ పాపారాయుడు, బుచ్చిబాబు, స్వప్న, ఏడంతస్తుల మేడ, సీతారాములు, సర్కస్ రాముడు. ఎట్సెట్రా.
ఈ 15 సినిమాల్లో తమిళం, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ 15 సినిమాల్లో తమిళం, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.
అప్పుడు సినిమాను ఫిలిం నెగెటివ్‌లో తీసేవారు. పని చాలా ఎక్కువ. పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పడుతుంది. అయినా, దాసరి గారు ఒకే ఒక్క సంవత్సరంలో 15 సినిమాలు చేసి, రిలీజ్ చేశారు.
అంటే యావరేజ్‌న నెలకి ఒక సినిమా కంటే ఎక్కువ!
కట్ చేస్తే -
గ్రాఫిక్స్ లాంటివి బాగా ఉన్న సినిమాల్ని పక్కనపెడితే, కనీసం కాన్సెప్ట్ బేస్డ్ జోనర్స్‌లోనైనా సంవత్సరానికి కనీసం ఒక 3 సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది బిగ్ కొశ్చన్!
ఇప్పుడు మొత్తం డిజిటల్ ఫిలిం మేకింగ్. షూటింగ్ నుంచి ఫైనల్ కాపీ వరకు మొత్తం ఒక ఐ-ఫోన్లో పూర్తిచేస్తున్న రోజులివి.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani