గేరీ వేనర్‌చక్...
వైన్ టేస్ట్ చూసి చెప్పే స్పెషలిస్టుగా కెరీర్ ప్రారంభించి ఆ ఫీల్డులోనే ముందు మిలియనేర్ అయ్యాడు. తర్వాత తన సామ్రాజ్యం విస్తరించాడు. ఓ నాలుగైదు బెస్ట్ సెల్లర్ బుక్స్ కూడా రాశాడు.
ఇప్పుడీ వేనర్‌చక్ ప్రసక్తి ఎందుకొచ్చిందంటే -
సోషల్ మీడియా నుంచి గేరీ పాడ్‌కాస్ట్ కెళ్ళాడు. అట్నుంచి అటు మెల్లిగా వీడియో పాడ్‌కాస్ట్ కెళ్ళాడు. ఎక్స్‌పర్ట్ అయ్యాడు.
ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఏదిపడితే అది చెప్తూనే ఉంటాడు. దాన్లోంచి మనకు అవసరమైన ఆణిముత్యాల్ని వెతుక్కోవడం మన బాధ్యత.
ఇక్కడ విషయం ఏంటంటే - గేరీ అంత గొప్పగా ఏం ఉండడు. కావల్సినంత డీగ్లామరస్‌గా కనిపించే ప్రయత్బం చేస్తాడనుకుంటాను. ఎందుకంటే - ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తాడు. నానారకాల క్యాప్స్ పెడతాడు. జుట్టు రకరకాలుగా కత్తిరించి ఉంటుంది. మాస్ జోక్స్, సెటైర్స్ వేస్తుంటాడు. ఇంగ్లిష్‌లో నాలుగక్షరాల బూతుపదాన్ని అలవోకగా వాడుతుంటాడు.
అసలతని మాటలు అంత వినసొంపుగా ఉండవు. కాని, పనికొచ్చే స్టఫ్ మాత్రం చాలా ఉంటుంది.
అసలతని మాటలు అంత వినసొంపుగా ఉండవు. కాని, పనికొచ్చే స్టఫ్ మాత్రం చాలా ఉంటుంది.
అ-యి-నా ... గేరీ వేనర్‌చక్ వీడియోల్ని వేలల్లో లక్షల్లో చూస్తారు. సుమారు 3 మిలియన్లమంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
రాయటం, చదవటం తప్ప - ఆడియో, వీడియో పాడ్‌కాస్టులు పెద్దగా ఇష్టపడని నేను - అప్పుడప్పుడూ "మనం కూడా వీడియోలు చేసేద్దామా?!" అని టెంప్ట్ కావడానిక్కారం మెయిన్‌గా ఈ గేరీనే!
వీడియోలు చేయాలన్న ఆలోచన ఉండీ, ఏదో ఒక సంకోచంతో ఆగిపోతున్నవాళ్ళు Gary Vaynerchuk వీడియోల్ని ఒకసారి చూస్తే సరిపోతుంది.
అయితే - ఒక్కటి మాత్రం మనం మర్చిపోకూడదు. వీడియోలు చేసినా ఏది చేసినా - ప్రత్యక్షంగానో పరోక్షంగానో - ఒక ఖచ్చితమైన ప్రయోజనం ఉండితీరాలి.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani