ఎంతసేపూ పక్క భాషల సినిమాలను పొగుడుతూ, తెలుగు సినిమాలను తిడుతూ కొంతమంది సూడో మేధావులు, సోషల్ మీడియా రైటర్స్ అతి చెత్త పెస్సిమిస్టిక్ రాతలు రాస్తుంటారు.
రీమేక్స్ కూడా - పింక్ ను పింక్‌లా తీయలేదని, లూసిఫర్‌ను లూసిఫర్‌లా తీయలేదని ఓ తెగ బాధపడిపోతుంటారు.
తెలుగు సినిమాల్లో అది ఉండదనీ, ఇది ఉండదనీ నానా రకాల ఆక్రోశం వెళ్లగక్కుతుంటారు.
ఫిలిం మేకర్స్ ఎలా తీయాలనుకుంటారో అలా తీస్తారు సినిమాని. అది ప్రొడ్యూసర్-డైరెక్టర్స్ ఇష్టం. ఎలా తీస్తే డబ్బులొస్తాయని వాళ్ళు భావిస్తారో అలా తీస్తారు. వాళ్ల అంచనాలు ఫెయిలైతే పోయేది కూడా వాళ్ళ డబ్బే, వాళ్ళ పేరే.
వాళ్ళ డబ్బు, వాళ్ళ పేరుని రిస్క్ చేస్తూ వాళ్లకిష్టమైనట్టు సినిమాలు తీసుకుంటారు. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు.
ప్రేక్షకులకు, సోకాల్డ్ సూడో మేధావులకు, సెల్ఫ్ డిక్లేర్డ్ రివ్యూయర్స్‌కు, సోషల్ మీడియా రైటర్స్‌కు ఆప్షన్ ఉంది. చూడొద్దు అనుకుంటే చూడకుండా ఉండటానికి.
కట్ చేస్తే -
సినిమా తీయడం అంటే ఫేస్‌బుక్‌లో పోస్టుపెట్టినంత ఈజీ కాదు.
ఇలా సోషల్ మీడియాలో తెలుగు సినిమాలు బాగుండవు అని వాపోయేవారి సంఖ్య చాలా చాలా తక్కువ. చెప్పాలంటే ఒక వందకి మించదు.
ఇలాంటి వారి ద్వారా తెగే టికెట్స్ సంఖ్య కూడా తక్కువే. అసలా సంఖ్య లెక్కలోకే రాదు.
ఏ తెలుగు సినిమానయితే వీరంతా తక్కువచేసి లాజిక్ లేని రాతలు రాస్తున్నారో, ఇప్పుడు బాలీవుడ్‌తో సహా... దేశంలోని అన్ని భాషల ఫిలిం ఇండస్ట్రీలు తెలుగు సినిమా వైపే చూస్తూ చాలా నేర్చుకుంటున్నాయని వీరికి తెలుసా?
At the end of the day, filmmaking is a business. Big business.
At the end of the day, filmmaking is a business. Big business.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani