నేను గత కొంతకాలంగా అనుకొంటున్న ఈ పుస్తకం గురించి ఈమధ్య ఒకే ఒక్కరోజు గట్టిగా అనుకొన్నాను, రెండే రెండు వారాల్లో టాస్క్ పూర్తిచేశాను.
ఈ నెలాఖరులో రిలీజ్ చేస్తున్నాను.
తేదీ ఇంకా నిర్ణయం కావల్సి ఉంది.
ఈ పుస్తకం ఆవిష్కరణ అఫీషియల్ ప్రమోషన్ రేపు రాత్రి నుంచి ప్రారంభం.
ఈ పుస్తకం ఆవిష్కరణ అఫీషియల్ ప్రమోషన్ రేపు రాత్రి నుంచి ప్రారంభం.
బైదివే... ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబోయే ప్రత్యేక వ్యక్తి ఎవరో మీకు తెలుసు. ఆ స్పెషల్ ట్వీట్ మీలో చాలామంది చూశారు...
కట్ చేస్తే -
కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్.
ఇది పూర్తిగా కేసీఆర్ కేంద్ర బిందువుగా - ఆయా సందర్భాల్లో నేను రాసిన బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు, దినపత్రికల్లో వచ్చిన నా ఆర్టికిల్స్‌లోంచి ఎన్నిక చేసిన కొన్ని వ్యాసాల అందమైన సంకలనం ఈ పుస్తకం.
212 పేజీల హార్డ్‌బౌండ్ క్లాసిక్.
ఈ కంటెంట్‌నంతా - ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి తెలంగాణ ప్రజలతో ఒక చిన్న పుస్తకరూపంలో ఇలా పంచుకొంటున్నాను.
212 పేజీల హార్డ్‌బౌండ్ క్లాసిక్.
ఈ కంటెంట్‌నంతా - ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి తెలంగాణ ప్రజలతో ఒక చిన్న పుస్తకరూపంలో ఇలా పంచుకొంటున్నాను.
ఈ చిన్న ప్రయత్నం ఇన్‌స్పిరేషన్‌తో - నాలాంటి ఇంకెందరో బయటికి రావాలని, వాళ్లంతా కూడా వారికి వీలైనవిధంగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పనిచేయాలన్నది ఈ పుస్తకం ద్వారా నేనాశిస్తున్న ప్రధాన ప్రయోజనం.
త్వరలో జాతీయ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించబోతున్న సందర్భంగా - గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి - ఒక రచయితగా, ఒక అభిమానిగా నేనందిస్తున్న చిరుకానుక ఈ పుస్తకం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani