అనుకోకుండా నిన్న రాత్రి యూట్యూబ్‌లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. అది పూర్తయిన వెంటనే యూట్యూబ్ సజెస్ట్ చేసిన తర్వాతి వీడియో కూడా చూశాను. అది డైరెక్టర్ వి వి వినాయక్ ఇంటర్వ్యూ.
కొంతమంది డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కొంతమంది డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు ఆడియో రిలీజ్, ప్రి-రిలీజ్ ఫంక్షన్స్‌లా పరమ రొటీన్‌గా ఉంటాయి. రాత్రి నేను చూసిన రెండు ఇంటర్వ్యూలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
వినాయక్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు బాగా చెప్పారు. అసలు ఆయన అంత బాగా, అంత క్లారిటీతో, అంత ఈజ్‌గా నవ్వుతూ అలా మాట్లాడ్డం నేనూహించలేదు. (సుమోల ఎఫెక్ట్!) 🙂
ఇంటర్వ్యూలో వినాయక్ పూరి గురించి ఒక మాటన్నారు:
"మళ్ళీ జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలి" అని.
ఈ ఒక్క మాట చాలనుకుంటాను... పూరి లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో ఎవరికివారే ఊహించుకోడానికి.
ఇంటర్వ్యూలో వినాయక్ పూరి గురించి ఒక మాటన్నారు:
"మళ్ళీ జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలి" అని.
ఈ ఒక్క మాట చాలనుకుంటాను... పూరి లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో ఎవరికివారే ఊహించుకోడానికి.
బిందాస్...
కట్ చేస్తే -
మొదటి ఇంటర్వ్యూలో పూరి తన చేతిమీదున్న చైనీస్ టాటూలు చూపిస్తూ, వాటి అర్థం చెప్పారు. ఒకటి - "లెవెంత్ మైల్" అనుకుంటాను. పది మైళ్ళు ఎలాగూ ఎవడైనా నడుస్తాడు. నువ్వు ఇంకో మైలు ఎక్కువ నడిస్తేనే ఏదైనా సాధిస్తావు అని దానర్థం. రెండోది - "నథింగ్ ఈజ్ పర్మనెంట్". జీవితంలో ఏదీ పర్మనెంట్ కాదు. అంటే, ఇప్పుడు నువ్వున్న సిచువేషన్, నువ్వు పడుతున్న కష్టాలు, ఇప్పటి నీ ఫెయిల్యూర్స్... ఏదీ శాశ్వతం కాదు, నీ టైమ్ మారుతుంది అని చెప్పటం.
పట్టాయా వెళ్ళినప్పుడు వేయించుకున్న పచ్చబొట్లలో కూడా ఎంత పాజిటివ్ థింకింగ్ కదా అనిపించింది.
అదే ఇంటర్వ్యూలో ఇంకో సందర్భంలో పూరి ఇంకో అద్భుతమైన విషయాన్ని చాలా సింపుల్‌గా చెప్పారు:
"మనం ఎప్పుడూ అడవిలో ఉన్నాం అనుకోవాలి. అడవిలో ఏవైపు నుంచి ఏ జంతువు వచ్చి మనల్ని ఏ రూపంలో ఎటాక్ చేస్తుందో మనకు తెలీదు. అంత అలర్ట్‌గా ఉంటే తప్ప మనం ఈ భూమ్మీద బ్రతకలేం!"
ఎంత నిజం!
కట్ చేస్తే -
"పూరి మ్యూజింగ్స్" పేరుతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక ఆడియో పాడ్‌కాస్ట్ చేస్తారని, అది ఇంత ఎఫెక్ట్ ఇస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. వాటిల్లో అన్నీ పచ్చి వాస్తవాలు. "దీనెమ్మ, నిజమే కదా" అని పిచ్చెక్కించే ఫిలాసఫీ!
కాని... ఒప్పుకోడానికి, మెచ్చుకోడానికి చాలా మందికి హిపోక్రసీ అడ్డొస్తుంది. అది వేరే విషయం.
కాని... ఒప్పుకోడానికి, మెచ్చుకోడానికి చాలా మందికి హిపోక్రసీ అడ్డొస్తుంది. అది వేరే విషయం.
ఇప్పటివరకు పూరి అప్‌లోడ్ చేసిన సుమారు 200+ పాడ్‌కాస్టుల్లో దేనికదే ఒక జెమ్, ఒక బుల్లెట్. "ఫ్లాప్ మూవీస్", "లైఫ్ యాంథెమ్" వంటివి నిజంగా అల్టిమేట్.
చెప్పాలంటే - పాడ్‌కాస్ట్‌లోని ఒక్కో ఎపిసోడ్ మీద ఒక్కో బ్లాగ్ రాయొచ్చు.
చెప్పాలంటే - పాడ్‌కాస్ట్‌లోని ఒక్కో ఎపిసోడ్ మీద ఒక్కో బ్లాగ్ రాయొచ్చు.
అసలు పూరిలో ఒక ఆడియో పాడ్‌కాస్ట్ చెయ్యాలన్న ఈ ఆలోచన ఎప్పుడు ఎలా వచ్చిందో గాని, ఇది నిజంగా ఒక బ్లాక్‌బస్టర్!
Now... waiting eagerly for the next episode of the podcast... #PuriMusings.
Now... waiting eagerly for the next episode of the podcast... #PuriMusings.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani