దేశంలోనే ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్‌గా, ఒక మీడియా మొఘుల్‌గా ఆయన ఎందరో మన దేశ ప్రధానమంత్రులను, రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూశారు. పాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎన్నో సందర్భాల్లో ఎన్నోరకాలుగా ప్రభావితం చేయగలిగారు.
కట్ చేస్తే -
రామోజీరావు గారు... రాష్ట్ర మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 45 వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ పంపారు.
అందులో ఆయన రాసిన ప్రతి పదం, ప్రతి వాక్యం ఆచితూచి రాసినవే...
"యువతరం నాయకులు" అని ప్రారంభంలో సంబోధించారు. తర్వాత - "అరుదైన నాయకత్వ లక్షణాలు, అసాధారణ సంభాషణ నైపుణ్యం, అన్నిటినీ మించిన రాజకీయ చతురతతో అనతికాలంలోనే పరిణత నాయకునిగా ఎదిగిన" కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆశీస్సులందజేశారు.
అక్కడితో ఆగిపోలేదు. ఒక ఉన్నతశ్రేణి నాయకునికి ఉండాల్సిన లక్షణాలన్నీ మూర్తీభవించిన కేటీఆర్ గురించిన మరెన్నో లక్షణాలను గురించి కూడా చెబుతూ, ఆయన పనితీరును, ఆయన సామర్థ్యాన్ని మెచ్చుకొన్నారు.
కేటీఆర్ సాధించిన పురోగతిని చూసి గర్విస్తున్నానన్నారు రామోజీరావు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి కేటీఆర్ చేస్తున్న నిరంతర కృషిని చూసి తండ్రిగా కేసీఆర్ తప్పక ఆనందిస్తూ వుంటారని చెప్పారు.
"మీవంటి చైతన్యశీలిని పుత్రునిగా పొందిన ఆయన ధన్యులు" అని కేసీఆర్ గారిని ఉద్దేశించి అన్నారు.
ట్విట్టర్ వేదికగా, వేగంగా స్పందిస్తూ కేటీఆర్ చేస్తున్న అనేకరకాల సహాయక చర్యలు అతనిలోని మానవతా దృక్పథాన్ని తెలుపుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
కార్యకుశలతలో కేటీఆర్‌కు సాటిరాగల యువనాయకులు ఇప్పుడు దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదన్నారు. దేశానికి మీలాంటి యువతరం నాయకులు అవసరం అన్నారు.
చివరగా - "ఇంతింతై మీరు దేశానికే నాయకత్వం వహించే ధృవతార(క రాముని)గా ఎదగాలని" ఈ పుట్టినరోజు సందర్భంగా ఆశిస్తున్నట్టు తెలిపారు రామోజీరావు.
కట్ చేస్తే -
రామోజీరావు గారు తన గ్రీటింగ్స్‌లో కేటీఆర్ సామర్థ్యం గురించి చెప్పిన ప్రతి అక్షరం సత్యం. చివరి వాక్యంలో, కేటీఆర్ లక్ష్యం ఏ స్థాయిలో ఉండాలో ఆయన పరోక్షంగా సూచించారని నేననుకొంటున్నాను.
రెట్టించిన ఉత్సాహంతో, తనలోని నాయకత్వ లక్షణాలకు, తన సామర్థ్యానికీ మరిన్ని మెరుగులు దిద్దుకొంటూ, దూసుకొంటూ, ఆ దిశలో ముందుకు వెళ్లటమే ఇప్పుడు కేటీఆర్ చేయాల్సింది!
With that said -
రాష్ట్రస్థాయిలోనే కాదు, జాతీయస్థాయిలో కూడా తన ఊహే హద్దుగా ఎంత ఎత్తుకయినా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్న Hon Min KTR గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
💐🎂💐
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani