ఆ మధ్య నా బర్త్ డే నాడు, నాకు అత్యంత ప్రియమైన ఫ్రెండ్ ఒకరు ఒక ప్రశ్న అడగటం జరిగింది. "ఈ బర్త్ డే కి స్పెషల్ గా నువ్వు ఏదయినా కొత్త నిర్ణయం తీసుకుంటున్నావా?" అని.
నిజానికి నాకు అలాంటి నమ్మకాలు లేవు.
ఒక మనిషి నిజంగా ఏదయినా మానేయాలనుకొన్నా, లేదంటే, కొత్తగా ఏదయినా ప్రారంభించాలనుకొన్నా - దానికి ప్రత్యేకంగా న్యూ యియర్లు, బర్త్ డేలు, మరేవో స్పెషల్ డేలూ, ముహూర్తాలూ అవసరం లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అదే విషయం నా ఫ్రెండ్ తో చెప్పాను.
నిర్ణయాలు ఏ క్షణంలో అయినా తీసుకోవచ్చు. ఒక చిన్న సంఘటన చాలు. మన ఆలోచనా విధానాన్నీ, మన జీవన పథాన్నీ సంపూర్ణంగా మార్చివేయగల ఒక నిర్ణయం తీసుకోడానికి.
కట్ చేస్తే -
మొన్నీ మధ్యే, కేవలం రెండు రోజుల వ్యవధిలో - మా పెద్దబ్బాయి ప్రణయ్, చిన్నబ్బాయి ప్రియతమ్ నాతో ఏకాంతంగా ఉన్నప్పుడు చెరొక ప్రశ్న చాలా క్యాజువల్ గా అడిగారు.
మా అబ్బాయిలిద్దరి రెండు ప్రశ్నలూ నన్ను కనీసం ఒక వారం పాటు ఒక సంపూర్ణ అంతర్ముఖుడ్ని చేశాయి. చివరకు, ఒకే ఒక్క గంట స్వీయ విశ్లేషణ తర్వాత నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాను.
ఇప్పటివరకూ నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలన్నిటిలోకెల్లా అత్యుత్తమమయిన నిర్ణయం అది.
అలాగని నిన్న ఎలాంటి ప్రత్యేకమయిన రోజు కాదు. కానీ, నిన్న నేను తీసుకున్న నిర్ణయం ఫలితాలను, ఇంకో నాలుగు నెలల్లో రాబోతున్న నా పుట్టినరోజు నాటికి పూర్తిగా అందుకోవాలి, పూర్తిగా ఫ్రీ అయిపోవాలి అని గట్టిగా అనుకున్నాను.
సో, రివర్స్ ఇంజినీరింగ్ లో, నా పుట్టినరోజు అలా పనికొచ్చిందన్నమాట!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani