ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యక్తినో, పరిస్థితినో ఎదుర్కొన్నాక "అబ్బ... ఈ దెబ్బతో జ్ఞానోదయం అయ్యింది" అనుకొంటాము. కాని అది నిజం కాదు.
కట్ చేస్తే -
ఆకాలంలో బుధ్ధుడికి బోధివృక్షం కింద కూర్చున్నప్పుడు 49 రోజుల్లో జ్ఞానోదయం అయిందని చదివాను.
మహానుభావుడు... 49 రోజుల్లోనే, ఒక్కసారికే, సర్వం ఒక అవగాహనకొచ్చింది ఆయనకు. కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా అస్సలు కుదరదు.
మహానుభావుడు... 49 రోజుల్లోనే, ఒక్కసారికే, సర్వం ఒక అవగాహనకొచ్చింది ఆయనకు. కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా అస్సలు కుదరదు.
"ఇంక ఇంతకు మించి మనం నేర్చుకొనేది ఏముంటుంది" అనుకుంటాం. కాని, దాని జేజమ్మలాంటి సిచువేషన్ కూడా వెంటనే వస్తుంది.
"ఈ వ్యక్తిని మించి మనల్ని బాధపెట్టేవారు ఇంక లైఫ్‌లో రారు... వచ్చే పరిస్థితికి మనం ఇంక చోటిచ్చే ప్రసక్తే లేదు" అనుకొంటాం. కాని, తప్పక వస్తారు. మనం ఎదుర్కొంటాం.
ఇవన్నీ అనుభవం మీదే తెలుస్తాయి.
కొంతమందికి మాత్రం ఈ జ్ఞానోదయం బై డిఫాల్ట్ అయి ఉంటుందనుకొంటాను. అదృష్టవంతులు. వీరి దరిదాపుల్లోకి ఏ నాన్సెన్స్ వ్యక్తులూ, పరిస్థితులూ రాలేవు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు అంత గుడ్డిగా దేన్నీ నమ్మరు. క్షణాల్లో విషయాన్ని తేల్చేస్తారు. ఇలాంటివాళ్లంటే నాకు చాలా గౌరవం.
కొంచెం లిబరల్‌గా, మాస్‌గా చెప్పాలంటే - ఇదే లోకజ్ఞానం.
కరోనావైరస్ పుణ్యమా అని, సుమారు గత 15 నెలల లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా విషయాల్లో ఆత్మపరిశీలన చేసుకొని, బాగా ఆలోచించుకొనే అవకాశం అందరికీ దొరికింది.
ఈ కోణంలో - లాక్‌డౌన్‌ను మించిన బోధివృక్షం లేదు.
నా విషయంలో మాత్రం - ఏదో బూడిదలోంచి లేచి దులుపుకొన్నట్టు కాకుండా... మస్తిష్కం నిజంగానే ఒక భారీ కుదుపుకు లోనయ్యింది.
అయితే, ఈ 15 నెలలకాలంలో ఇంతకుముందు కూడా రెండు సార్లు ఇలాగే అనుకున్నాను. ఇది మూడోసారి, చివరిసారి అనుకుంటున్నాను.
కొత్తగా ఏదో తెలుసుకోవడమో, నేర్చుకోవడమో అనేది జీవితంలో కొనసాగే ఒక నిరంతర ప్రక్రియ. దానికి ఫుల్‌స్టాప్ ఉండదు. అలా ఉంటుందనుకోవడం ఒక భ్రమ.
కాని, వీటన్నిటినీ మించిన ఒక ఆలోచనాస్థాయికి చేరుకోవడం అనేది ఒకటుంటుంది. అది మాత్రం ఒక్కసారే వస్తుంది.
ఏమైనా, అయామ్ పాజిటివ్...
ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. వ్యక్తిగతంగా నేను నాలో కోరుకొంటున్న మార్పు అదే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani